• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అంతర్జాతీయ కరాటే విజేతను అభినందించిన మంత్రి

W.G: కొలంబోలో జరిగిన కరాటే పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన విస్సాకోడేరు విద్యార్థి కౌరు అభిలాష్‌ను రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో తనను కలిసిన అభిలాష్ ప్రతిభను మంత్రి కొనియాడారు. క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

April 10, 2026 / 09:42 AM IST

వృద్ధులను చంపిన నిందితుడికి 2 రోజుల కస్టడీ

HYD: ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నెలరోజుల వ్యవధిలో యాదమ్మ, మంగతాయారు అనే ఇద్దరు వృద్ధులను కిరాతకంగా హతమార్చిన నిందితుడు వాసును జూబ్లీహిల్స్ పోలీసులు 2 రోజుల కస్టడీకి తీసుకున్నారు. బెట్టింగులకు అలవాటు పడిన వాసు వీరిద్దరిని కిరాతకంగా హత్య చేసి నగర శివారులలో పడేశాడు. ఈ ఘటనలో నిందితుడు నుంచి పోలీసులు మరింత సమాచారం రాబట్టేందుకు విచారిస్తున్నారు.

April 10, 2026 / 09:39 AM IST

గురుకుల ఫలితాల్లో హాలహర్వి విద్యార్థుల ప్రతిభ

KRNL: నందవరం మండలం హాలహర్వికి చెందిన విద్యార్థులు అంబేడ్కర్ గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. గ్రామానికి చెందిన 8మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. అందరూ ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేసిన ప్రేమ్ కుమార్‌ను గ్రామస్థులు అభినందించారు. విద్యాభ్యాసంలో మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు.

April 10, 2026 / 09:38 AM IST

జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరుగుదల

WNP: జూరాల ప్రాజెక్టుకు వరద నీరు స్వల్పంగా పెరుగుతోందని అధికారి వెంకటేశ్ తెలిపారు. గురువారం 63 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, శుక్రవారం 155 క్యూసెక్కులకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 0.320 టీఎంసీల లైవ్ నిల్వ ఉంది. సాగునీటి అవసరాల కోసం కుడి, ఎడమ కాలువలకు 644 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

April 10, 2026 / 09:38 AM IST

భద్రకాళి ఆలయంలో విశేష పూజలు

WGL: చైత్రమాస వసంత రుతువు సందర్భంగా భద్రకాళి దేవాలయంలో ఇవాళ విశేష పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు శేషు ఆధ్వర్యంలో తెల్లవారుజామునే సుప్రభాత సేవలతో ఆలయ ద్వారాలు తెరిచి, అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. వేద పండితులు అమ్మవారిని నయనానందకరంగా అలంకరించారు. దర్శనానికి వచ్చిన భక్తులకు అర్చకులు కుంకుమార్చనలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

April 10, 2026 / 09:37 AM IST

రాష్ట్రస్థాయి అవార్డులతో వైద్యులకు సన్మానం

GDWL: జిల్లా వైద్యులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటడం గర్వకారణమని డీఎంహెచ్ఎ డాక్టర్ సంధ్యా కిరణ్మయి అన్నారు. World Health Day సందర్భంగా హైదరాబాద్‌లో మంత్రి దామోదర రాజనరసింహ చేతుల మీదుగా అవార్డులు అందుకున్న బృందాన్ని గురువారం సన్మానించారు. డాక్టర్ ప్రియాంక, నందకిషోర్, ఏఎన్ఎం సాలమ్మలను అభినందించారు.

April 10, 2026 / 09:37 AM IST

పిచ్చికుక్క దాడిలో వ్యక్తికి గాయాలు

MNCL: మందమర్రి మండలం ఆదిల్ పేట్ గ్రామానికి చెందిన గోమాస సమ్మయ్య పై పిచ్చికుక్క దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చెయ్యగా ఈఎంటీ రాకేష్, పైలట్ సంపత్ వెంటనే ఘటన స్థలానికి చేరుకొని వైద్యుడి సూచన మేరకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం సమ్మయ్యను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

April 10, 2026 / 09:37 AM IST

వైఎస్ జగన్‌ను కలిసిన చింతాడ

SKLM: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఆమదాలవలస వైసీపీ ఇంఛార్జ్ చింతాడ రవికుమార్ గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రస్తుత పార్టీ స్థితిగతులపై చర్చించారు. అలాగే, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని జగన్ సూచించినట్లు రవికుమార్ తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జగన్ సూచించారు.

April 10, 2026 / 09:36 AM IST

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్‌

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి తీవ్రత దృష్ట్యా వాతావరణశాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్‌ ప్రకటించింది. ఏప్రిల్ 12 నుంచి 22వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు 44°C దాటే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా మధ్యాహ్నం 12-4 గంటల వరకు వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

April 10, 2026 / 09:34 AM IST

ముదిరాజ్ నాయకుల ముందస్తు అరెస్ట్..!

NLG: హలో ముదిరాజ్ – చలో గాంధీ భవన్ ముట్టడికి తరలివెళ్తున్న ముదిరాజ్ నాయకులను మర్రిగూడ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏ లో చేరుస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించిందన్నారు. ప్రభుత్వనికి ముదిరాజుల సత్తా ఏమిటో చూపిస్తామన్నారు.

April 10, 2026 / 09:33 AM IST

ధాన్యం సేకరణ లక్ష్యాలపై కేంద్రానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి

NLG: తెలంగాణలో పెరుగుతున్న వరి ఉత్పత్తికి అనుగుణంగా కేంద్రం కేటాయింపులు పెంచాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి రాసిన లేఖలో.. రబీ 2024-25కు సంబంధించిరా రైస్ కోటా తగ్గించి, 5 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కేటాయించాలని కోరారు. బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని 20 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలన్నారు.

April 10, 2026 / 09:32 AM IST

10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

TG: రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరగనుంది. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దని సూచించింది. పెరిగే ఉష్ణోగ్రతల వల్ల వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

April 10, 2026 / 09:32 AM IST

OTTలోకి బ్లాక్‌ బస్టర్‌ మిస్టరీ థ్రిల్లర్‌

మలయాళ దర్శకుడు జీతూ సతీషన్ తెరకెక్కించిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘సంభవం అధ్యాయం ఒన్ను’. అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా దాదాపు రూ.6 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. జియో హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 15 నుంచి మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

April 10, 2026 / 09:31 AM IST

నీటి సరఫరా బోర్డు విలీనం వద్దని వినతి

సత్యసాయి: సత్యసాయి నీటి సరఫరా బోర్డును జిల్లా పరిషత్‌లో విలీనం చేయవద్దని అహుడా చైర్మన్ టీసీ వరుణ్‌కు కార్మిక సంఘం నాయకులు విన్నవించారు. అనంతపురంలో ఆయనను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్మికులకు అండగా ఉంటామని, మెరుగైన వ్యవస్థ కోసం కృషి చేస్తామని వరుణ్ హామీ ఇచ్చారు.

April 10, 2026 / 09:30 AM IST

ప్రైవేటు పాఠశాలలు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలు ముద్దు

మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని శివ నగర్ కాలనీలో గల MPUP స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు శుక్రవారం ఉదయం ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరిస్తూ కాలనీలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, విద్య తీరును తల్లిదండ్రులకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ‘ప్రైవేటు పాఠశాలలు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలు ముద్దు’ అంటూ నినాదాలు చేశారు.

April 10, 2026 / 09:29 AM IST