• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గుర్తింపు సంఘం ఎన్నికలకు కసరత్తు

PDPL: పాలకుర్తి(M) బసంత్ నగర్‌లోని అల్ట్రా టెక్ సిమెంట్ కర్మాగారంలో పర్మనెంట్ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని యూనియన్ల నాయకులు యాజమాన్యాన్ని సంప్రదించి చర్చించారు. గత యూనియన్ కాలపరిమితి ముగియడంతో ఇటీవల నాయకులు తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం గుర్తింపు ఎన్నికలు నిర్వహించే దిశగా నాయకులు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళారు.

April 10, 2026 / 02:00 PM IST

BRSకు మంత్రి జూపల్లి స్ట్రాంగ్ కౌంటర్

TG: BRS హయాంలో నిర్మించిన ప్రాజెక్టులన్నీ కేవలం కాసుల కోసమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. రాజకీయంగా నష్టం వస్తుందని తెలిసినా, తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి రాష్ట్రం ఇచ్చిన ఘనత UPAదేనని గుర్తు చేశారు. గొల్లపల్లి ప్రాజెక్టు విషయంలో BRS నేతలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టులు కడుతున్నారని తమను విమర్శించడం హాస్యాస్పదమని చెప్పారు.

April 10, 2026 / 02:00 PM IST

కార్పొరేట్ సామాజిక బాధ్యత సదస్సు రామ్మోహన్ నాయుడు

AP: శ్రీకాకుళంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు సహకరిస్తున్నాయి. మత్స్యకారులు.. అర్ధరాత్రి వేటకు వెళ్లే సమయంలో ఇబ్బందులు పడేవారు. వారి కోసమే CSR ద్వారా సోలార్ లైట్లు ఏర్పాటు చేసుకున్నాం’ అని తెలిపారు.

April 10, 2026 / 01:59 PM IST

కార్పొరేట్ సామాజిక బాధ్యత సదస్సుకు కేంద్ర మంత్రి

AP: శ్రీకాకుళంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు సహకరిస్తున్నాయి. మత్స్యకారులు.. అర్ధరాత్రి వేటకు వెళ్లే సమయంలో ఇబ్బందులు పడేవారు. వారి కోసమే CSR ద్వారా సోలార్ లైట్లు ఏర్పాటు చేసుకున్నాం’ అని తెలిపారు.

April 10, 2026 / 01:59 PM IST

మంత్రిని కలిసిన ఎమ్మెల్యే దంపతులు

NGKL: అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, అనురాధ దంపతులు ఇవాళ, రాష్ట్ర మంత్రి వాకటి శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వచ్చే నెల మే 3వ తేదీన జరగనున్న తన కుమారుడు చిక్కుడు యశ్వంత్ వివాహానికి హాజరు కావాలని కోరుతూ మంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆహ్వానాన్ని స్వీకరించిన మంత్రి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

April 10, 2026 / 01:58 PM IST

చెత్త అంపైరింగ్ చేస్తున్నారు: మాజీ క్రికెటర్

KKR vs LSG మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ అంపైర్ తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. అంపైర్ల తప్పిదం కారణంగా KKR విధ్వంసకర ఓపెనర్ ఫిన్ అలెన్(9) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. ఇలాంటి చెత్త అంపైరింగ్ ఎక్కడా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోవైపు అభిమానులు కూడా దీనిపై అసహనం వ్యక్తం చేశారు.

April 10, 2026 / 01:57 PM IST

హెల్మెట్ రక్షణ కవచం: ఎస్సై

VZM: ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది కేవలం నిబంధన మాత్రమే కాదు, ప్రాణ రక్షణ కవచమని నెల్లిమర్ల ఎస్సై బి.గణేష్ స్పష్టం చేశారు. ఇవాళ నెల్లిమర్లలో నిర్వహించిన వాహన తనిఖీల్లో భాగంగా, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులను ఆపి వారికి రహదారి భద్రతపై ప్రత్యేక అవగాహన కల్పించారు.

April 10, 2026 / 01:55 PM IST

అనంత్‌ అంబానీ బర్త్‌డే.. సల్మాన్‌ పోస్ట్ వైరల్

అనంత్ అంబానీ పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘అనంత్ దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాడు.. స్వచ్ఛమైన మనసున్న నా చిన్న తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ సల్మాన్ పోస్ట్ పెట్టాడు. ఆయనతో పాటు రామ్ చరణ్, షారుఖ్ ఖాన్, అనన్య పాండే వంటి ప్రముఖులు కూడా అనంత్‌కు విషెస్ తెలిపారు.

April 10, 2026 / 01:52 PM IST

హిందూ సమ్మేళనికి ఆహ్వానం

NRPT: ఉట్కూరు మండలం పెద్ద జట్రం గ్రామంలో ఈనెల 22న జరగనున్న హిందూ సమ్మేళనం కార్యక్రమానికి రావాలని ఆదిత్య పరాశ్రీ స్వామిని నిర్వాహకులు ఆహ్వానించారు. ధర్మ రక్షణ లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ సమ్మేళనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమ ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

April 10, 2026 / 01:45 PM IST

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

SKLM: మందస గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్సై కె.కృష్ణ ప్రసాద్ బాలికలకు మహిళా భద్రత, శక్తి యాప్ ఆవశ్యకతపై ఇవాళ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలపై సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న వేధింపులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ మోసాల పట్ల, బాల్య వివాహాల నియంత్రణపై అవగాహన కల్పించారు.

April 10, 2026 / 01:45 PM IST

సోదర సోదరీమణుల దినోత్సవ శుభాకాంక్షలు

MDK: ప్రపంచ సోదర సోదరీమణుల దినోత్సవం సందర్భంగా రామాయంపేట డివిజనల్ అటవీ శాఖ అధికారి (FRO) విద్యాసాగర్ శుభాకాంక్షలు తెలిపారు. రామాయంపేట డివిజన్ పరిధిలోని అన్ని మండలాల సోదర సోదరీమణులకు ఆయన ప్రత్యేకంగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబాల్లో అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధం ఎంతో గొప్పదని, ఈ ప్రేమ ఇలాగే కలకాలం కొనసాగాలని ఆకాంక్షించారు.

April 10, 2026 / 01:44 PM IST

వాటర్ మెన్ ను పరామర్శించిన కార్పొరేటర్

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని 21 డివిజన్‌లో వాటర్ మెన్ మహేందర్ అనారోగ్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ గుండా సంతోష్ వారి నివాసానికి చేరుకుని ఆయనను పరామర్శించారు. ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డివిజన్ వాసులు కోస్గి వెంకటేష్ వెంకట్ రెడ్డి బాలు తదితరులు పాల్గొన్నారు

April 10, 2026 / 01:43 PM IST

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: సర్వోత్తమ్ రెడ్డి

SRPT: చివ్వెంల మండలం వల్లభపురంలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడాతూ.. సన్నాలు పండిస్తున్న రైతులను ప్రోత్సహించడానికి క్వింటాకు రూ.500ల బోనస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు.

April 10, 2026 / 01:40 PM IST

మెయింటెనెన్స్ పేరుతో కరెంట్ కట్

JN: మెయింటెనెన్స్ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దు అని దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామ రైతులు వాపోతున్నారు. గత కొన్ని రోజులుగా మధ్యానం సమయంలో విద్యుత్‌లో అంతరాయం జరుగుతుందని, దీంతో చేతికందిన వరి పొలాలు ఎండిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను అడిగితే మెయింటనెస్స్ అని అంటున్నారు అని, ఇలా చేయొద్దు అని అన్నారు.

April 10, 2026 / 01:40 PM IST

HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. ప్రియురాలు ఆత్మహత్య

TG: పెళ్లికి నిరాకరించిందని కక్షగట్టి, ప్రియురాలి శరీరంలోకి బలవంతంగా HIV సోకిన రక్తాన్ని ఎక్కించాడు ఓ కిరాతకుడు. ఆ ద్రోహాన్ని, అనారోగ్యాన్ని తట్టుకోలేక పోచారం ఐటీ కారిడార్‌కు చెందిన యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత నెల జరిగిన ఈ ఘటనలో బాధితురాలు ప్రాణాలు విడవడం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

April 10, 2026 / 01:39 PM IST