VZM: ప్రభుత్వ ఆదేశాల మేరకు మహత్మ జ్యోతిరావు ఫూలే 200వ జయంతి కార్యక్రమాన్ని ఏఫ్రిల్ 11న నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాం సుందర్ రెడ్డి గురువారం తెలిపారు. ఆ రోజు ఉదయం 10.00 గంటలకు కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న పూలేకి నివాళులర్పించి, అనంతరం ఆడిటోరియంలో సభ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో ప్రజా ప్రతినిధిలు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.
పార్వతీపురం మండలం సూడిగంలో పాతబడిన విద్యుత్ వ్యవస్థను ఆధునీకరించాలని కోరుతూ అరకు ఎంపీ గుమ్మ తనూజా రాణికి వినతిపత్రం సమర్పించారు. ఎంపీపీ మజ్జి శోభారాణి, వైసీపీ నాయకులు చంద్రశేఖర్ ఈ మేరకు ఎంపీ నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
కాకినాడ జిల్లాలో గృహ వినియోగ సిలిండర్లను సకాలంలో సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో గ్యాస్ ఏజెన్సీలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఓటీపీ రాని సిలిండర్ల సరఫరాను నిలిపివేయాలని స్పష్టం చేశారు. అన్ని ఏజెన్సీలకు సమానంగా గ్యాస్ లోడ్ పంపిస్తామని ఆయన పేర్కొన్నారు.
HYD: అర్హులైన వారికి మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లులు వచ్చేలా చూస్తున్నామని బహదూర్‌పురా ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ అన్నారు. గురువారం నియోజకవర్గానికి చెందిన 80 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పారదర్శకంగా ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
KKRపై LSG విజయం సాధించడంలో ముకుల్ చౌదరి కీలక పాత్ర పోషించాడు. ఈ ఓటమి KKR కెప్టెన్ రహానే స్పందింస్తూ.. ‘ముకుల్ ఒక్కడే అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో ఓడించాడు. అతడి బ్యాటింగే మా ఓటమికి కారణం. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టం. కానీ మా కుర్రాళ్లు ఆడిన తీరు అమోఘం. ఇలాంటి మ్యాచ్‌ల్లో తప్పులను వెతకకూడదు. కానీ ముకుల్ ఆడిన తీరుకు, ఆ భాగస్వామ్యానికి క్రెడిట్ ఇవ్వాల్సిందే’ అని అన్నాడు.
KRNL: టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేశ్ పార్టీ క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌ఛార్జులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గంగులపాడు బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ బాబురావు, చిన్నతుంబళం సొసైటీ ఛైర్మన్ కందనాతి నరసప్ప హాజరయ్యారు. పార్టీ బలోపేతం, కేడర్ సమన్వయం, రాబోయే కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించినట్లు వారు పేర్కొన్నారు. క్రమశిక్షణతో పనిచేయాలని మంత్రి సూచించారన్నారు.
ATP: గుంతకల్లు శ్రీనివాసనగర్‌కు చెందిన లావణ్య, ఆంజనేయులు దంపతుల కుమారుడు సుదీప్ (10) స్థానిక చర్చి స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఇంటికి సమీపంలోనే ఉన్న ఎస్ఎస్ ట్యాంక్‌లోకి ఈత కొట్టేందుకు వెళ్లిన సుదీప్ నీట మునిగి ఊపిరాడకు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
NZB: ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన ఎర్గు సత్యవ్వ చికిత్స కోసం రూ.5 లక్షలు, గుండారం గ్రామానికి చెందిన బొద్దుల శ్రీనివాస్‌కు రూ.60 ముందస్తు సహాయం గురువారం సాయంత్రం అందించారు. దీంతో బాధిత కుటుంబాలు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
జిన్నారం మండలం కొడకంచి గ్రామంలోని పశువైద్య సబ్‌సెంటర్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. గోడలు, వరండా ధ్వంసం కావడంతో పశువులకు చికిత్స అందించడం కష్టమవుతోందని పాడి రైతులు వాపోతున్నారు. భవనం కూలిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ATP: తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని ఎమ్మెల్యే పరిటాల సునీత సందర్శించారు. అక్కడ భక్తులతో కలిసి భోజనం చేశారు. అనంతరం స్టోర్ రూమ్‌లో నిల్వ ఉన్న సరుకుల నాణ్యతను పరిశీలించారు. భక్తులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. భక్తులకు నాణ్యమైన ఆహారం అందించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.
BDK: భద్రాచలం గిరిజన మ్యూజియం ఆధునికీకరణకు రూ.కోటి నిధులు విడుదలయ్యాయని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ గురువారం తెలిపారు. అలాగే ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి సీతక్క చేతుల మీదుగా ‘ఆదివాసీ కోయ ఇలవేల్పుల చరిత్ర’ గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్నట్లు వారు వెల్లడించారు. మరో 2 నెలల్లో మ్యూజియం డిజైనింగ్ పనులు ప్రారంభిస్తామన్నారు.
NTR: రైల్ పార్సిల్ యాప్ ద్వారా బుకింగ్, డెలివరీ సేవలను సులభతరం చేశామని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ బి.ప్రశాంత్ కుమార్ తెలిపారు. వినియోగదారుల సౌలభ్యం కోసం ఇంటింటికీ సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గత నెలలో విజయవాడ నుంచి 280 బుకింగ్‌లు నమోదయ్యాయని వెల్లడించారు. కస్టమర్లు ఈ యాప్‌ను వినియోగించుకోవాలని ఆయన కోరారు.
JGL: రాయికల్ పట్టణంలోని బస్తీ దవాఖానకు రాష్ట్రంలో ప్రథమ బహుమతి లభించింది. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా డాక్టర్ మొహమ్మద్ షబ్బీర్, నర్సింగ్ ఆఫీసర్ వసంత ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. పేద ప్రజలందరూ బస్తీ దవాఖాన సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ షబ్బీర్ కోరారు.
BHNG: మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని షిరిడి సాయి బాబా ఆలయంలో సాయిబాబాను గురువారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. బీర్ల ఐలయ్య, అనిత కుమారుడు బీర్ల శివమణి పుట్టిన రోజు సందర్భంగా బాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
GDWL: అవినీతికి పాల్పడి ఏసీబీకి పట్టుబడ్డ ఐజ మండలం ఎక్లాస్పూర్ గ్రామ అవుట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శి బోయ రంగన్నను విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఉత్తర్వులు జారి చేశారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరు కోసం లంచం డిమాండ్ చేస్తూ రంగన్న పట్టుబడిన ఘటనపై విచారణ అనంతరం కేసు రుజువు అయ్యింది.