ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి తీవ్రత దృష్ట్యా వాతావరణశాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఏప్రిల్ 12 నుంచి 22వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు 44°C దాటే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా మధ్యాహ్నం 12-4 గంటల వరకు వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.