టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న మూవీ ‘భోగి’. తాజాగా ఈ సినిమా OTT డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. దీని డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. 2026 దసరా కానుకగా ఈ మూవీ విడుదల కానున్నట్లు టాక్.