KRNL: ప్రభుత్వ అనుమతి లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్న ఓ కళాశాల యాజమాన్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని PDSU రాష్ట్ర అధ్యక్షుడు కె. భాస్కర్ డిమాండ్ చేశారు. బుధవారం ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాంతీయ కార్యాలయంలో ఆర్వో లాలప్పకు వినతిపత్రం అందజేశారు. అనుమతి లేకుండా ప్రచారం చేస్తూ.. అడ్మిషన్లు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.