• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేను స్వశక్తితో వచ్చా: సీఎం రేవంత్

TG: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి BRS నేతలపై విరుచుకుపడ్డారు. YSR దయతో హరీష్ రావు మంత్రి అయ్యారని, చంద్రబాబు దయతో కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారని ఎద్దేవా చేశారు. తాను స్వశక్తితో ఎదిగిన వాడినని స్పష్టం చేశారు. గత పదేళ్లలో ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా మార్షల్స్‌తో తనను బయటకు పంపించిన రోజులను గుర్తు చేస్తూ, ఇప్పుడు మీకు అవకాశం ఇస్తున్నామని వ్యాఖ్యానించారు.

March 18, 2026 / 11:30 PM IST

‘ఎక్స్‌’ సేవల్లో అంతరాయం..!

మైక్రో బ్లాగింగ్ వేదిక ‘ఎక్స్’ (ట్విట్టర్) సేవల్లో అంతరాయం ఏర్పడింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యూజర్లు టైమ్‌లైన్ రీఫ్రెష్ కావడం లేదని, పోస్టులు కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. రాత్రి 8 గంటల నుంచి మొబైల్, డెస్క్‌టాప్ వెర్షన్లలో ఈ సమస్య తలెత్తింది. దాదాపు గంట తర్వాత సేవలు పునరుద్ధరించబడినట్లు తాజా సమాచారం.

March 18, 2026 / 11:13 PM IST

తెలుగు ప్రజలకు జగన్ ఉగాది శుభాకాంక్షలు

AP: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా వైసీపీ అధినేత జగన్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రజలందరికీ శుభాలు కలగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రేపు ఉదయం 9 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

March 18, 2026 / 10:55 PM IST

శుక్రవారానికి అసెంబ్లీ వాయిదా

TG: అసెంబ్లీ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ఉదయం 9:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. రేపు ఉగాది సందర్భంగా సభకు సెలవు ప్రకటించారు.

March 18, 2026 / 10:40 PM IST

నా కాలిగోటికి కూడా సరిపోరు: సీఎం రేవంత్

TG: అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘2023లో మీ నెత్తిమీద కాలు పెట్టి తొక్కి అధికారంలోకి వచ్చాం.. 2029లోనూ అదే పునరావృతమవుతుంది’ అని హెచ్చరించారు. ‘నేను స్వశక్తితో పైకి వచ్చాను. మీరు నా కాలిగోటికి కూడా సరిపోరు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంతమంది ఏకమై వచ్చినా ధీటుగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.

March 18, 2026 / 10:25 PM IST

అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి అండగా ఎమ్మెల్యే

KMM: ఏన్కూరు మండలం ఆరికాయలపాడు గ్రామానికి చెందిన ఏలుగోటి నరేందర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిన వెంటనే వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వాసిరెడ్డి నాగేశ్వరరావు అందించిన సమాచారంతో, హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి వైద్యులకు ఎమ్మెల్యే ఇవాళ చరవాణి ద్వారా మాట్లాడి నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు.

March 18, 2026 / 10:24 PM IST

కోహ్లీపై డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

RCB స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నుంచి మరో అద్భుత సీజన్‌ను ఆశిస్తున్నట్లు ఏబీ డివిలియర్స్ పేర్కొన్నాడు. ఈసారి RCBని ఛాంపియన్‌గా నిలపడంలో విరాట్ కీలక పాత్ర పోషిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లీ తన నిలకడైన ఆటతీరుతో జట్టుకు వెన్నెముకగా నిలుస్తాడని ఏబీడీ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, ఐపీఎల్‌లో పాల్గొనేందుకు కోహ్లీ లండన్ నుంచి భారత్‌కు చేరుకున్నాడు.

March 18, 2026 / 10:13 PM IST

ఎల్లుండి తిరుమల పర్యటనకు చంద్రబాబు

AP: CM చంద్రబాబు ఎల్లుండి తిరుమల పర్యటనకు రానున్నారు. మనవడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా శ్రీవారికి మొక్కులు చెల్లించనున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా జిల్లా యంత్రాంగం తిరుమలలో సమీక్ష నిర్వహించనుంది. పద్మావతి అతిథిగృహ సమావేశ మందిరంలో కలెక్టర్, ఎస్పీ, టీటీడీ భద్రతాధికారి భేటీ అయ్యారు. శ్రీవారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను జిల్లా యంత్రాంగం పరిశీలించారు.

March 18, 2026 / 09:52 PM IST

ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు: SP

KDP: జిల్లా ఎస్పీ విశ్వనాథ్ జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది, రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది తెలుగు వారి నూతన సంవత్సర ఆరంభమని పేర్కొంటూ, ప్రజలకు ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఆనందంగా జరుపుకోవాలని కోరారు.

March 18, 2026 / 09:51 PM IST

వాహనాదారులకు గుడ్ న్యూస్.. 2 శాతం ట్యాక్స్ రద్దు

TG: రాష్ట్ర రవాణా వ్యవస్థలో పెను మార్పులు రానున్నాయి. వాహనదారుల ఇబ్బందులను తొలగిస్తూ, డిజిటల్ సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 23 నుంచి రాష్ట్ర రవాణా శాఖ కేంద్ర ప్రభుత్వ ‘వాహన్’ నెట్‌వర్క్‌తో అనుసంధానం కానుంది. దీంతో ఒక వ్యక్తి రెండో వాహనం కొనుగోలు చేస్తే అదనంగా కట్టాల్సిన 2 శాతం లైఫ్ ట్యాక్స్‌ను రద్దు కానుంది.

March 18, 2026 / 09:50 PM IST

రేపే ఉగాది.. ముహూర్త సమయం ఇదే!

రేపటి నుంచి పరాభవ నామ సంవత్సరం ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 6.53 గంటల నుంచి ఉదయం 9.30 గంటల వరకు అత్యంత శ్రేష్ఠ ముహూర్తం ఉందని పండితులు తెలిపారు. ఈ సమయంలో పంచాంగం వినడంతో పాటు కొత్త పనులు ప్రారంభించాలని సూచించారు. తెల్లవారుజామునే నూనెతో స్నానం చేసి, ఉగాది పచ్చడి తాగాలని తెలిపారు. 

March 18, 2026 / 09:41 PM IST

ఈనెల 20న మునగాలలో మెగా హెల్త్ క్యాంప్

SRPT: మునగాల మండలంలో ఈనెల 20న మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు మునగాల మండల వైద్యాధికారి రవీందర్ ఈరోజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్ని విభాగాల వైద్య సిబ్బంది పాల్గొన్న ఉన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉచితంగా వైద్య సేవలు పొందాలని సూచించారు.

March 18, 2026 / 09:40 PM IST

నిరంతర ఎల్పీజీ సరఫరాకు కలెక్టర్ ఆదేశాలు

KMR: రబీ 2025-26 ప్యాడీ కొనుగోలు ఏర్పాట్లపై DPC సమావేశం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన జరిగింది. కొనుగోలు కేంద్రాలు, రవాణా, నిల్వ ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎల్పీజీ సరఫరా సమీక్షించి నిరంతర రీఫిల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనులకు విరుద్ధంగా వినియోగిస్తున్న 113 కేసుల్లో 160 సిలిండర్లు సీజ్ చేసినట్లు తెలిపారు.

March 18, 2026 / 09:38 PM IST

పురుగుమందు తాగి యువకుడు ఆత్మహత్య

NDL: మండలంలోని ఎస్.లింగం దిన్నె గ్రామంలో దొర్నిపాడు హెల్త్ అండ్ వెల్త్ సొల్యూషన్స్ వర్క్ ఫ్రం హోం సంస్థ లో రూ. 3.20 లక్షలు చెల్లించి మోసపోయి దూదేకుల నాగరాజు (25)అనే రైతు కూలీ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుతెచ్చి డబ్బులు కట్టి చివరకు కంపెనీ మూతపడడంతో అప్పుల వారి బాధతాళ లేక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

March 18, 2026 / 09:36 PM IST

డీజే బాక్స్‌లను ధ్వంసం చేసిన పోలీసులు

HNK: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని హంటర్ రోడ్డు చౌరస్తాలో బుధవారం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టి ఆటోలో ఉన్న డిజే బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ సీఐ పిట్టల వెంకన్న ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది 50 ఆటోలు ఆపి డీజే బాక్స్‌లను పట్టుకున్నారు. వీటిని జెసిబి సహాయంతో ధ్వంసం చేశారు

March 18, 2026 / 09:35 PM IST