• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పెదకూరపాడులో కురిసిన వర్షం

PLD: పెదకూరపాడులో బుధవారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు మండుటెండలతో అల్లాడిన ప్రజలను, సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పలకరించింది. ఈ అకాల వర్షం వల్ల మిరప కోతకు వెళ్లిన వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అకస్మాత్తుగా కురిసిన వానతో రహదారులపై వెళ్తున్న వాహనదారులు తడిసి ముద్దయ్యారు. చేతికి వచ్చినపంట తడిసిపోతుందని ఆవేదన చెందారు.

March 18, 2026 / 04:13 PM IST

బస్సుపై పడిన విద్యుత్ స్థంభం.. తప్పిన ప్రమాదం

NDL: నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు విద్యుత్ స్తంభం సపోర్ట్ తీగకు తగలడంతో స్తంభం విరిగి బస్సుపై పడింది. అదృష్టవశాత్తు విద్యుత్ సరఫరా లేకపోవడంతో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ సంఘటనపై విద్యుత్ శాఖ ఏఈ కంబగిరి పరిశీలించారు.

March 18, 2026 / 04:11 PM IST

‘మొక్కజొన్నకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి’

JGL: రాయికల్ మండలంలో మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని, యూత్ కాంగ్రెస్ రాయికల్ మండల అధ్యక్షుడు ఏలేటి జలంధర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాయికల్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం ఆలస్యం చేస్తే రైతులు నష్టపోతారన్నారు.

March 18, 2026 / 04:11 PM IST

ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ

AKP: రంజాన్ సందర్భంగా ఎలమంచి పట్టణం జామియా మసీదులో బుధవారం 175 ముస్లిం కుటుంబాలకు జామియా మసీదు మత పెద్దలు రంజాన్ తోఫా అందజేశారు. పవిత్ర రంజాన్ మాసాన్ని ముస్లింలు కఠిన ఉపవాసంతో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెలలోనే పవిత్ర ఖురాన్ ఆవిర్భవించిందని తెలిపారు. అల్లాహ్ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు.

March 18, 2026 / 04:11 PM IST

ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి GOOD NEWS

TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని ఆచరణలో చూపిస్తున్నామని చెప్పారు. రాబోయే మూడు సంవత్సరాలలో పట్టణ ప్రాంతాల్లోని ప్రతీ వార్డులో ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో రెండో విడత ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

March 18, 2026 / 04:11 PM IST

నియోజకవర్గ సమస్యలపై గలమెత్తిన MLA పల్లా

JN: నియోజకవర్గంలో రోడ్ల పనులు దాదాపు రెండేళ్లుగా పూర్తిగా నిలిచిపోయాయని MLA డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. 131 గ్రామాలు, 2 పట్టణాలు, 42 వార్డులున్న నియోజకవర్గంలో బస్సుల సమస్య తీవ్రంగా ఉందని, రోజుకు కేవలం 2 ట్రిప్పులు మాత్రమే నడుస్తున్నాయని అన్నారు. వెంటనే రోడ్ల పనులు, బస్సుల సంఖ్య పెంచాలని కోరారు.

March 18, 2026 / 04:09 PM IST

కేంద్ర మంత్రిని కలిసిన మాజీ మంత్రి

CTR: నగరి నియోజకవర్గ సమస్యలను కేంద్రమంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లు మాజీ మంత్రి రోజా తెలిపారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాన్ని తొలగించేలా చేస్తున్నారని ఆయన దృష్టికి తీసుకుపోయారు. కొండచుట్టూ మండప ప్రాధాన్యాన్ని తెలియజేసి, వాటిని కాపాడేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని విన్నవించినట్లు పేర్కొన్నారు.

March 18, 2026 / 04:08 PM IST

వడగళ్ళతో కూడిన వర్షం

ASR: పెదబయలు మండలం బొంగరం గ్రామపంచాయతీ పరిధిలో ఈరోజు సాయంత్రం ఒక్కసారిగా వర్షం పడింది. ఈరోజు శ్రీ రాసకొండ చెల్లెమ్మ తల్లి పండగను పురస్కరించుకొని, సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. అనంతరం భక్తులు తిరుగు ప్రయాణ సమయంలో గాలి, వడగళ్లతో భారీ వర్షం పడడంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

March 18, 2026 / 04:08 PM IST

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే

BHNG: ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఇవాళ కలెక్టరేట్‌లో కలెక్టర్ అనురాగ్ జయంతిని కలిశారు. ఈ సందర్భంగా ఆలేరు మండల పరిధిలో ఉన్న సుమారు 1,600ల పేద ప్రజల ఇళ్ల స్థలాలను, భూములను 22-A  Act-1908, POT Act-1977 పేరుతో ప్రోహిబిటెడ్ జాబితాలో చేర్చారు. POT చట్టాన్ని రద్దు చేసి భూములను రెగ్యులర్ చేయాలని ఎమ్మెల్యే కలెక్టర్‌కి వినతిపత్రాన్ని అందజేశారు.

March 18, 2026 / 04:04 PM IST

‘ఆధునిక వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలి’

E.G: ఆధునిక వ్యవసాయంపై రైతులు అవగాహన కలిగి ఉండాలని మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చింతపల్లి రామకృష్ణ అన్నారు. మండపేట మండలం వ్యవసాయ శాఖ అధికారి ప్రభాకర్ నేతృత్వంలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు.

March 18, 2026 / 04:04 PM IST

ఆలయ పునర్నిర్మాణానికి స్థల పరిశీలన

NRPT: మరికల్ మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణానికి బుధవారం స్థపతులు శ్రావణ్ కుమార్ శర్మ, బాలమురళీ కృష్ణలు స్థలాన్ని పరిశీలించారు. వారికి ఆలయ నిర్మాణ కమిటీ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. హైందవ సాంప్రదాయ ప్రకారం, ఇతిహాసాలతో నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు.

March 18, 2026 / 04:04 PM IST

పొగాకు రైతుల సమస్యలపై కేంద్రానికి విన్నపం

E.G: రాజమండ్రి MP దగ్గుపాటి పురందేశ్వరి ఫ్లూ-క్యూర్డ్ వెర్జీనియా పొగాకు రైతుల సమస్యలను కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పియూష్ గోయల్ దృష్టికి బుధవారం తీసుకువెళ్లారు. జీఎస్టీ విధానంలో ఉన్న లోపాల వల్ల పొగాకు ఉత్పత్తులపై ‘పన్నుపై పన్ను’ పరిస్థితి ఏర్పడుతోందన్నారు. దీనివల్ల చట్టబద్ధ సిగరెట్ ఉత్పత్తుల ధరలు పెరిగి, అక్రమ సిగరెట్ల వినియోగం పెరుగుతోందని ఆమె తెలిపారు.

March 18, 2026 / 04:04 PM IST

రామడుగు పేరు వెనుక కథ ఇదేనా..?

NLG: అనుముల మండలంలోని రామడుగు గ్రామం భక్తి విశ్వాసాలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. స్థానిక పురాణాల ప్రకారం అరణ్యవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ అడుగు పెట్టడంతో గ్రామానికి రామడుగు అనే పేరు వచ్చిందని  స్థానికులు నమ్మకం. అహల్య వాగులో ఉన్న రాముడి పాదం ఈ గాథకు నిదర్శనంగా భావిస్తారు. భక్తులు ఈ ప్రదేశాన్ని దర్శించి విశేష భక్తిని చాటుకుంటున్నారు.

March 18, 2026 / 04:03 PM IST

విద్యుత్ శాఖ డైరెక్టర్‌కు వినతి

HNK: వీల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డు భవనానికి విద్యుత్ శాఖ అధికారులు అకారణంగా విధించిన అపరాధ రుసుమును రద్దు చేయాలని ఇవాళ మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. విధించిన జరిమానాను తక్షణమే రద్దు చేయడంతో పాటు భవనానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.

March 18, 2026 / 04:03 PM IST

గ్యాస్ బుకింగ్‌పై కలెక్టర్ కీలక ఆదేశాలు

GDWL: గద్వాలలోని గ్యాస్ ఏజెన్సీలను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా బుధవారం అకస్మాత్తుగా తనిఖీ చేశారు. గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందవద్దని ఆయన స్పష్టం చేశారు. కొత్త నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో రెండు బుకింగ్‌ల మధ్య 45 రోజుల గడువు, పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల గడువు తప్పనిసరి అని తెలిపారు.

March 18, 2026 / 04:02 PM IST