JGL: రాయికల్ మండలంలో మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని, యూత్ కాంగ్రెస్ రాయికల్ మండల అధ్యక్షుడు ఏలేటి జలంధర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాయికల్లో విలేకరులతో మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం ఆలస్యం చేస్తే రైతులు నష్టపోతారన్నారు.