KNR: జనగణన- 2027 కోసం ఏర్పాటుచేసిన శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులకు సూచించారు. 2027 జనగణనపై అధికారులకు కలెక్టరేట్‌లోని మర్రి చిన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో ఈనెల 15 నుంచి చార్జ్ ఆఫీసర్లు, అదనపు ఛార్జ్ అధికారులు, శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.
ADB: శ్రీ సరస్వతి శిశు మందిరాలు సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలని తెలంగాణ రాష్ట్ర ఆధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ అన్నారు. ఇచ్చోడ మండలంలో నిర్వహించిన శ్రీ సరస్వతి విద్యాపీఠం 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. శిశు మందిరాల్లో చదువుతోపాటు వినయం, విధేయత, దేశభక్తి వంటి విషయాలను బోధించడం జరుగుతుందన్నారు.
CTR: రానున్న ఉగాది, రంజాన్ పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కుప్పం DSP పార్థసారథి సూచించారు. రామకుప్పంలో మంగళవారం పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. అందరూ సహకరించి సోదర భావంతో పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ మల్లేష్ యాదవ్, ఎస్సైలు పాల్గొన్నారు.
TG: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9 మందితో సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్‌ను నియమించింది. సభ్యులుగా గ్రేహౌండ్స్ కమాండర్ రవీందర్ రెడ్డి.. షాద్ నగర్ డీసీపీ శిరీష్.. ఈగల్ డీఎస్పీలు బుచ్చయ్య, హరీష్ చంద్రారెడ్డి, మొయినాబాద్ ఎస్సై మల్లికార్జున ఉన్నారు.
రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్. ఈ మూవీకి సీక్వెల్‌గా ధురంధర్ 2 తెరకెక్కించారు. ఈ క్రమంలో ధురంధర్: ది రివెంజ్ సెన్సార్ పూర్తి అయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ రన్ టైమ్ ఇండియాలో 3 గంటల 49 నిమిషాలు కాగా ఓవర్సీస్‌లో మాత్రం 3 గంటల 55 నిమిషాలతో మూవీని ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు.
అనంతపురం నగరపాలక సంస్థ, జిల్లాలోని పురపాలక సంఘాల పాలకవర్గాల గడువు నేటితో ముగిసింది. దీంతో రేపటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో కార్యకలాపాలు జరగనున్నాయి. అనంతపురం నగరపాలక సంస్థకు కలెక్టర్ ఆనంద్, తాడిపత్రి మున్సిపాలిటీకి జేసీ విష్ణుచరణ్ ప్రత్యేక అధికారులుగా వ్యవహరించనున్నారు. మిగతా మున్సిపాలిటీల బాధ్యతలను ప్రభుత్వం ఆర్డీవోలకు అప్పిగించింది.
E.G: ఇమామ్, మౌజన్లకు రంజాన్ సందర్భంగా ప్రభుత్వం గౌరవవేతనలు విడుదల చేయడం పట్ల మండపేట టీడీపీ ముస్లిం మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు షేక్ కరీం మెకానిక్ హర్షం వ్యక్తం చేశారు. మండపేట టీడీపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. CM చంద్రబాబు ఆదేశాలతో ఇమామ్ మౌజన్ల గౌరవ వేతనం నిమిత్తం రూ.45 కోట్లు విడుదల చేశారన్నారు.
SS: పుట్టపర్తిలోని కలెక్టర్ కార్యాలయంలో భూముల కేటాయింపుపై జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. భూముల అప్పగింత ప్రక్రియను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. భూసేకరణలో ఉన్న అడ్డంకులను తొలగించి, సరిహద్దుల గుర్తింపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని వరంగల్ రోడ్డుపై నిలిపి ఉన్న బస్సుల నుంచి బ్యాటరీలు దొంగిలించిన నిందితులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నగర శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఆటోలో బ్యాటరీలను తరలిస్తున్న దొంగలను పట్టుకున్నట్టు వెల్లడించారు. బ్యాటరీల విలువ సుమారు రూ. 60,000 ఉంటుందని పేర్కొన్నారు.
ELR: ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో జిల్లాను అన్ని రంగాలలోనూ అభివృద్ధి బాటలో నిలిపేందుకు ప్రజాప్రతినిధులందరూ కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా ఇంఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై సమీక్షించారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేసేవారిపై 6ఏ కేసులు నమోదు చేస్తామన్నారు.
SRPT: హుజూర్‌నగర్ క్యాంపు హైస్కూల్‌లో నేడు మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు ముగిశాయి. ఎంఈవో సైదా నాయక్, హెచ్‌ఎం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపికల్లో 22 మంది బాలురు, 18 మంది బాలికలు పాల్గొన్నారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10 మంది బాలురు, 10 మంది బాలికలను జిల్లా స్థాయికి ఎంపిక చేసినట్లు ఎంఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు పాల్గొన్నారు.
BHNG: యాసంగి పంటకు సంబంధించి రైతు భరోసాను పొందేందుకు అర్హులైన రైతులు ఈనెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని AO శైలజ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 28, 2026 నాటికి కొత్తగా పట్టాదార్ పాస్‌బుక్ పొంది, డిజిటల్ సంతకం ప్రక్రియ పూర్తయిన రైతులు, గతంలో ఏవైనా కారణాల వల్ల ఇప్పటివరకు రైతు భరోసా రాకున్నా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినయోగం చేసుకోవాలన్నారు.
AP: రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్ లభ్యత పెరిగేలా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఉత్పత్తి పెంపు, మెరుగైన పంపిణీ జరిగేలా చూడాలని సమీక్షకు హాజరైన సీఎస్ సాయిప్రసాద్, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్ ఓఎన్జీసీ ప్రతినిధులకు సూచించారు. సీఎన్జీ, పీఎన్జీల వినియోగం గరిష్ఠంగా పెంచాలని పేర్కొన్నారు.
HYD: హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 98 శాతం పనులు పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్ట్ రూ.35.61 కోట్లతో రూపుదిద్దుకున్నట్లు వివరించారు. రైల్వే శాఖలో ఇదొక ‘ఇంజనీరింగ్ మార్వెల్’ అంటూ కేంద్ర మంత్రి అభివర్ణించారు. త్వరలోనే మల్కాజ్‌గిరి, హైటెక్ సిటీ, హఫీజ్ పేట ప్రాంతాల్లో పునరుద్ధరించినట్లు తెలిపారు.
NZB: విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండడం అత్యంత కీలకమని TU వీసీ ప్రొ.టీ. యాదగిరి రావు అన్నారు. ఈనెల 25న PIB, సమాచారం ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించనున్న ‘సైబర్ హైజీన్ ప్రాక్టీసెస్’ అవగాహన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను రిజిస్ట్రార్ యాదగిరి, పలువురు ప్రొఫెసర్లతో కలిసి ఇవాళ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.