• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఉద్యాన పంటలపై అవగాహన, శిక్షణ కార్యక్రమం

BHPL: గోరికొత్తపల్లి మండలం గాంధీనగర్ గ్రామ శివారులో మంగళవారం జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో, సుధాకర్ డ్రిప్ కంపెనీ సహకారంతో ఉద్యాన పంటలపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎరువుల వినియోగం, డ్రిప్ సాగు, మల్చింగ్, పురుగు-వ్యాధి నియంత్రణపై రైతులకు వివరణాత్మకంగా అవగాహన కల్పించారు.

March 17, 2026 / 05:06 PM IST

ఎన్నికల హామీలను నెరవేర్చాలని ఆందోళన

MNCL: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీజేపీ జన్నారం మండల నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలో భాగంగా మంగళవారం వారు జన్నారం తాహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. అనంతరం స్థానిక తాహసీల్దార్ రామ్మోహన్‌కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు మధుసూదన్ రావు పాల్గొన్నారు.

March 17, 2026 / 05:06 PM IST

కలెక్టరేట్‌ను ముట్టడించిన ఆశా వర్కర్లు

వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా మంగళవారం KMR కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని ఆశా కార్యకర్తలు నిర్వహించారు. కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా పోలీసులు ఆశా కార్యకర్తలను అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

March 17, 2026 / 05:04 PM IST

ఘనంగా మెట్రో ఉగాది ఫెస్టివల్

హైదరాబాద్ మెట్రో అధికారులు, సిబ్బంది అందరు కలిసి మెట్రో ఫెస్టివల్ పేరిట ముందస్తుగా ఉగాది పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ కళారూపం నృత్య ప్రదర్శనలు అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందరూ.. తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒకరికొకరు చెప్పుకున్నారు. ఉప్పల్ డిపో నుంచి ఇంజనీర్లు రవి ప్రకాష్ , నారాయణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

March 17, 2026 / 05:03 PM IST

చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

ADB: తలమడుగు మండల కేంద్రంలో కలెక్టర్ రాజర్షి షా మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో చలివేంద్రాన్ని స్థానిక అధికారులు, నాయకులతో కలిసి ప్రారంభించారు. వేసవికాలం నేపథ్యంలో చలివేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్ మోహన్, ఎంపీడీవో శంకర్, తదితరులున్నారు.

March 17, 2026 / 05:03 PM IST

గంటల తరబడి ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా?

గంటల తరబడి ఇయర్‌ఫోన్స్ వాడటం వల్ల చెవి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు ఇది క్రమంగా వినికిడి శక్తిని తగ్గిస్తుంది. హెడ్ ఫోన్స్ వాడేటప్పుడు వాల్యూమ్ ఎప్పుడూ 60% కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి గంటకోసారి ఇయర్‌ఫోన్స్ తీసేసి, చెవులకు గాలి తగిలేలా 5-10 నిమిషాలు విరామం ఇవ్వాలి. ముఖ్యంగా ఇయర్‌ఫోన్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.

March 17, 2026 / 05:03 PM IST

రేపు శ్రీకాకుళంలో ఇఫ్తార్ విందు

SKLM: రంజాన్ పండుగను పురస్కరించుకుని బుధవారం నగరంలో జిల్లా స్థాయి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి షైక్ మహబూబ్ షరీఫ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ రోడ్డులోని శశి కన్వెన్షన్ హాల్లో సాయంత్రం 6 గంటల నుండి ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

March 17, 2026 / 05:02 PM IST

‘చిత్తూరులో LPG కొరత లేదు’

CTR: చిత్తూరు జిల్లాలో LPG సిలిండర్ల కొరత ఉందన్న వార్తలు అవాస్తవమని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. జిల్లాలో తగినంత నిల్వలు ఉండగా, బుక్ చేసిన సిలిండర్లు 1–2 రోజుల్లో అందుతున్నాయని చెప్పారు. అవసరం ఉన్నప్పుడే బుకింగ్ చేయాలని ప్రజలకు సూచించారు.

March 17, 2026 / 05:02 PM IST

‘దివ్యాంగుల శక్తి పథకాన్ని ప్రారంభించనున్న సీఎం’

ప్రకాశం: ఈ నెల 18వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదగా దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించనున్నట్లు మంత్రి స్వామి మంగళవారం తెలిపారు. స్త్రీ శక్తి పథకం వర్తించే అన్ని బస్సుల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు వెంట వచ్చే సహాయకులకు ఛార్జీలు 50 శాతం రాయితీ ఉంటుందన్నారు.

March 17, 2026 / 05:02 PM IST

పాఠశాలల్లో మౌలిక వసతులపై రాజీ పడొద్దు: కలెక్టర్

GDWL: జిల్లాలోని KGBV పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిగా వినియోగించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. విద్యార్థినుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని,అనుమతి లేని వారిని పాఠశాలల్లోకి రానివ్వకూడదని స్పష్టం చేశారు. పరిశుభ్రమైన మరుగుదొడ్లు, తాగునీరు, నాణ్యమైన ఆహారం అందించడంలో ప్రిన్సిపాళ్లు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

March 17, 2026 / 05:01 PM IST

జిల్లాలో పదో తరగతిపై స్పెషల్ ఫోకస్

MDK: జిల్లాలో పదో తరగతి ఫలితాల సాధన కోసం 99 రోజుల ప్రణాళికపై డీఈవో విజయ సమీక్ష నిర్వహించారు. పరీక్షలకు గైర్హాజరయ్యే విద్యార్థులను క్లస్టర్ స్థాయిలో గుర్తించి, వారు హాజరయ్యేలా ప్రోత్సహించాలని సీఆర్పీలకు దిశానిర్దేశం చేశారు. జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంవో సుదర్శన మూర్తి, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

March 17, 2026 / 05:01 PM IST

రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ

KNR: శంకరపట్నం మండలం మెట్‌పల్లి రైతు వేదికలో ఆత్మ (ATMA) ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం జరిగింది. జమ్మికుంట KVK కోఆర్డినేటర్ డా. ఎన్. వెంకటేశ్వర్ రావు ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకత, ప్రయోజనాలను వివరించారు. మొలంగూర్ క్లస్టర్‌కు చెందిన 125 మంది రైతులకు కిట్లు పంపిణీ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

March 17, 2026 / 05:01 PM IST

ఈనెల 21న కలెక్టరేట్ ముట్టడి: BJP

NZB: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 21న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు BJP  జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి తెలిపారు. మంగళవారం BJP జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వానికి కలెక్టరేట్ ముట్టడి తమ సమాధానమన్నారు.

March 17, 2026 / 05:00 PM IST

తాగునీటి పైపు లైన్ గ్రాంట్ కోసం ఎమ్మెల్యే వినతి

KRNL: ఆలూరు హెబ్బటం నుంచి కురుకుంద గ్రామాల వరకు త్రాగునీటి పైపు లైన్ కోసం రూ.59 లక్షల గ్రాంట్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరికి వినతిపత్రం సమర్పించారు. ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమెను కలిసి, రైతులు, స్థానికులు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను వివరించి, వేసవిలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

March 17, 2026 / 05:00 PM IST

నీటి సమస్యను పరిశీలించిన ఎంపీడీవో

ELR: ఉంగుటూరు మండలం కైకరం పంచాయతీ శివారు రామన్న గూడెం, వెంకట కృష్ణాపురం గ్రామాలలో నీటి సమస్య ను ఎంపీడీవో జీఆర్ మనోజ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో గ్రామస్థులతో మాట్లాడి నీటి సమస్య త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ అభివృద్ధి అధికారి సుమలత, తదితరులు పాల్గొన్నారు.

March 17, 2026 / 05:00 PM IST