GDWL: జిల్లాలోని KGBV పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించిన బడ్జెట్ను పూర్తిగా వినియోగించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. విద్యార్థినుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని,అనుమతి లేని వారిని పాఠశాలల్లోకి రానివ్వకూడదని స్పష్టం చేశారు. పరిశుభ్రమైన మరుగుదొడ్లు, తాగునీరు, నాణ్యమైన ఆహారం అందించడంలో ప్రిన్సిపాళ్లు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.