• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

MLAను కలిసిన ఎస్సీ, ఎస్టీ యూనియన్ నాయకులు

ఎన్టీఆర్: నందిగామ MLA తంగిరాల సౌమ్యను హౌసింగ్ కార్పొరేషన్ ఎస్సీ, ఎస్టీ యూనియన్ నాయకులు శనివారం కలిశారు. సంస్థలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ ఆమెకు వినతిపత్రం అందజేశారు. దళిత ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా CM చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని విన్నవించారు.

March 14, 2026 / 08:19 PM IST

దాబా నిర్వాహకునిపై కేసు నమోదు: SI

NGKL: వంగూరు మండల కేంద్రంలో డొమెస్టిక్ సిలిండర్‌ను కమర్షియల్ సిలిండర్‌గగా వాడుతున్న యోగి దాబా ఓనర్ నరేందర్ రెడ్డిపై శనివారం కేసు నమోదు చేసినట్లు మండల SI మహేశ్ తెలిపారు. సివిల్ సప్లై అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గృహ అవసరాలకు వాడే LPG సిలిండర్‌ను వ్యాపార అవసరాలకు వాడటం నేరమని అన్నారు.

March 14, 2026 / 08:18 PM IST

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కాసర్ల శ్యామ్

WGL: ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారిని శనివారం ప్రముఖ సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి.. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు ఆయనకు అమ్మవారి శేష వస్త్రం అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, నిర్వహకులు తదితరులు ఉన్నారు.

March 14, 2026 / 08:18 PM IST

‘వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరగలేదు’

ఖమ్మం వెలుగు మట్ల భూదాన్ భూమిలో ఇళ్లు కోల్పోయిన వారికి సరైన న్యాయం జరగలేదని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కన్వీనర్ పాలకుర్తి కృష్ణ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. అనర్హులకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టడం సరైంది కాదని విమర్శించారు.

March 14, 2026 / 08:18 PM IST

చిరుత పులిని చంపిన ముగ్గురి అరెస్ట్

MNCL: తాళ్లపేట అటవీ రేంజ్‌లో చిరుత పులిని చంపిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసామని ఎఫ్డీఓ రామ్మోహన్ తెలిపారు. దండేపల్లి మండలంలోని ఊట్లకు చెందిన మొడ్తే వెంకటేష్, మొడ్తే శ్రీనివాస్ పాతమామిడిపల్లికి చెందిన వనపర్తి శ్రీకాంత్ ఊట్ల అటవీ ప్రాంతంలో క్లచ్ వైరుతో ఉచ్చును వేసి చిరుత పులిని చంపి గోళ్లను సేకరించి కాల్చి వేశారన్నారు. ఈ మేరకు వారిని అరెస్టు చేశామని FDO వెల్లడించారు.

March 14, 2026 / 08:17 PM IST

పండుగలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి: SP

ADB: కుల మతాలకు అతీతంగా ప్రతి పండుగను శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఆదిలాబాద్‌లోని ఖిజార మస్జిద్‌లో శనివారం సాయంత్రం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ దావత్‌లో ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి ఖర్జూర పండు తినిపించి ఉపవాస దీక్ష విరమించారు.

March 14, 2026 / 08:16 PM IST

BREAKING: 1430 మిసైళ్లతో ఇరాన్ దాడి

ఇజ్రాయిల్‌పై ఇరాన్ భారీ క్షిపణి దాడులు చేసింది. నిమిషాల్లోనే 1430 మిసైళ్ల వర్షం కురిపించింది. ఉత్తర, మధ్య, దక్షిణ ఇజ్రాయిల్ ప్రాంతాలపై దాడులకు పాల్పడింది. ఈలట్ నగరంలో క్లస్టర్ బాంబులు, భారీ విధ్వంసం సృష్టించింది.

March 14, 2026 / 08:16 PM IST

శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకున్న రాష్ట్ర గవర్నర్

NGKL: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శనివారం శివప్రతాప్ శుక్లా దంపతులు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఆలయ మర్యాదలతో గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. ఆలయ EO శ్రీనివాసరావు అంతకుముందు తెలంగాణ పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. గవర్నర్ వెంట జిల్లా కలెక్టర్ డీఎఫ్‌వో తదితరులు ఉన్నారు.

March 14, 2026 / 08:15 PM IST

‘రేపు నాంపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం’

NLG: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాతృమూర్తి పేరుతో ఏర్పాటు చేసిన ‘కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో రేపు 13వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం జరగనుంది. నాంపల్లి మండల ప్రజల కోసం మునుగోడులో ఈ శిబిరం నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 12 శిబిరాల ద్వారా 9,034 మందికి పరీక్షలు చేసి, 1,970 మందికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు.

March 14, 2026 / 08:15 PM IST

నల్గొండ మార్కెట్ కమిటీ గడువు 6 నెలల పొడిగింపు

NLG: జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో 6 నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 మార్చిలో బాధ్యతలు చేపట్టిన కమిటీ గడువు ఈనెల 12తో ముగిసింది. పదవీ కాలం పొడిగింపుపై హర్షం వ్యక్తం చేస్తూ ఛైర్మన్ జూకూరి రమేష్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

March 14, 2026 / 08:14 PM IST

శెనగల గోదాం పరిశీలించిన ప్రమీల దేవి

KDP: రైతులు ఇచ్చిన శెనగలకు 15 రోజులలోపే డబ్బులు వారి బ్యాంక్ ఖాతాల్లో జమవుతాయని DM. ప్రమీల దేవి తెలిపారు. శనివారం లింగాల మండలంలో కొనుగోలు కేంద్రాన్ని బిజినెస్ మేనేజర్ ఖాదరవల్లి కలిసి పరిశీలించారు. రైతులు తెచ్చిన శనగల నాణ్యత, తూకాల విధానం, మూటలకు ట్యాగులు సక్రమంగా వేస్తున్నారా.. అనే అంశాలను పరిశీలించారు. రైతులు దళారులకు శెనగలు విక్రయించి మోసపోవద్దని తెలిపారు.

March 14, 2026 / 08:12 PM IST

పోలీసు ట్రైనీలకు సీపీఆర్, ప్రథమ చికిత్సపై శిక్షణ

కర్నూలు: జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో 203 పోలీసు ట్రైనీ కానిస్టేబుళ్లకు సీపీఆర్, ప్రథమ చికిత్సపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితుల ప్రాణాలను రక్షించేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని వైద్యులు తెలిపారు.

March 14, 2026 / 08:11 PM IST

‘GHMC ఎన్నికల కోసమే నగరంలో తోఫా పంపిణీ’

HYD: కొండాపూర్ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. విందులో BRS ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పాల్గొన్నారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ.. గత ప్రభుత్వం రాష్ట్రంలో మైనార్టీలకు రంజాన్ కానుకగా తోఫా అందజేసిందన్నారు. ఈ ప్రభుత్వం గత సంవత్సరం ఇవ్వని రంజాన్ తోఫా.. GHMC ఎన్నికల కోసమే పంపిణీ చేస్తుందని విమర్శించారు.

March 14, 2026 / 08:11 PM IST

1, 2 వార్డుల సందర్శించిన మున్సిపల్ ఛైర్మన్

KNR: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 1, 2 వార్డులను మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) సందర్శించారు. ముందుగా దుబ్బ మల్లికార్జున స్వామి ఆలయం, శ్రీ పార్వతి సమేత రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వెళ్లే రోడ్డు దుస్థితి, లైట్లు, వైకుంఠధామం సమస్యలు, డ్రైనేజీ వంటి అంశాలను స్థానికులు తెలియజేశారు.

March 14, 2026 / 08:10 PM IST

‘గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలి’

PDPL: గ్రామ పంచాయితీ కార్మికుల వేతనాలను గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు CITU ఆధ్వర్యంలో ఇవాళ ఎమ్మెల్యే విజయరమణారావుకు వినతి పత్రం అందజేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, రెండవ పీఆర్సీ పరిధిలోకి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్, ఖాజా, తదితరులు పాల్గొన్నారు.

March 14, 2026 / 08:10 PM IST