TG: కాంగ్రెస్ నేతల ఇళ్లపై KTR తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘రెడ్డికుంటలోని రేవంత్ రెడ్డి ఇల్లు FTL పరిధిలోనే ఉంది. ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు కూడా FTL పరిధిలోనే ఉంది. మంత్రి పొంగులేటి చెరువును పూడ్చి ఇల్లు కట్టారు. వివేక్ ఇల్లు కూడా చెరువులోనే ఉంది కదా. బఫర్ జోన్ నిబంధనలు కేవలం పేదలకు, మధ్యతరగతి ప్రజలకే ఉంటాయా? కాంగ్రెస్ నేతలకు వర్తించవా?’ అంటూ నిలదీశారు.
ADB: ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షల పేపర్ మూల్యాంకన ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు DIEO గణేష్ కుమార్ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూల్యాంకనం జరుగుతుందన్నారు. శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. ఆదివారం తొలిరోజు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, సివిక్స్ పేపర్లకు మూల్యాంకనం జరుగుతుందన్నారు.
HYD: మియాపూర్ హఫీజ్పేట్‌లోని ఆదిత్యనాథ్ ఇంపీరియల్ అపార్ట్‌మెంట్‌లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఫిబ్రవరి 14న శ్వేత అక్కినపల్లి ఇంట్లో నగలు, నగదు మాయమవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఆధారంగా ఇంట్లో పనిచేసే మహిళే దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి 60 గ్రాముల బంగారం, 4 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
HYD: మియాపూర్ హఫీజ్పేట్‌లోని ఆదిత్యనాథ్ ఇంపీరియల్ అపార్ట్‌మెంట్‌లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఫిబ్రవరి 14న శ్వేత అక్కినపల్లి ఇంట్లో నగలు, నగదు మాయమవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఆధారంగా ఇంట్లో పనిచేసే మహిళే దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి 60 గ్రాముల బంగారం, 4 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
SRD: విద్యను అభ్యసించే విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో ప్రావీణ్యత సాధించాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఉపాధ్యక్షుడు గుండం మోహన్ రెడ్డి అన్నారు. శనివారం బీరంగూడలోని ఓ పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
పసికందు నుంచి పండు ముసలి వరకు అందరూ పాలు తాగుతారు. అయితే, ఇటీవల కల్తీ పాల వల్ల ప్రాణాలు పోయిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొందరు లాభాపేక్ష కోసం పాలల్లో డిటర్జెంట్లు, యూరియా, పిండి పదార్థాలు, ప్రమాదకరమైన రసాయణాలను కలిపి కల్తీలకు తెగబడుతున్నారు. వాటిని ఎలా గుర్తించాలి అనే అంశంపై ‘ఆహార భద్రత ప్రమాణాల శాఖ’ అధికారులు పలు సూచనలు చేశారు. వాటిని పైన తెలిపిన ఫొటోలో చూడొచ్చు.
WGL: వరంగల్ స్పాట్ వ్యాల్యుయేషన్ క్యాంప్ లాల్ బహదూర్ జూనియర్ కళాశాలలో 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు క్యాంప్ అధికారి, వరంగల్ డీఐఈవో శ్రీధర్ సుమన్ తెలిపారు. ప్రతీ రోజు ఒక్కో ఎగ్జామినర్ 30 పేపర్ల మూల్యాంకనం చేయాలని, ఛీఫ్ ఎగ్జామినర్, విషయ నిపుణులు మూల్యాంకనంను పర్యవేక్షించాలని అన్నారు.
TG: తొలి కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహారాష్ట్ర సీఎంతో కలిసి 2 ప్రాజెక్టుల శంకుస్థాపనలో పాల్గొన్నారు. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టులతో దేశ ఇంధన భద్రత పెరగనుందన్నారు. వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
MDK: తూప్రాన్ పట్టణంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ రోడ్డుపై చెత్త వేసిన ఓ దుకాణ యజమానికి మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. పట్టణంలో జై లక్ష్మి గ్లాస్ ప్లైవుడ్ హార్డ్వేర్ దుకాణ యజమాని రోడ్డుపై చెత్త వేయడంతో ఇవాళ కమిషనర్ గణేష్ రెడ్డి ఆదేశాల మేరకు రూ. 1000 జరిమానా విధించారు. రోడ్డుపై చెత్త వేయకుండా చెత్తని మున్సిపల్ వాహనాలకు అందజేయాలని కమిషనర్ సూచించారు.
BDK: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వర్క అజిత్ అన్నారు. శనివారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు వినతిపత్రం ఇచ్చారు. పెండింగ్ స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.9,300 కోట్లు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలిపారు.
KMM: నగరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఛైర్మన్‌గా డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎండోమెంట్ అధికారి సమత, ఈవో జగన్మోహన్ రావు సమక్షంలో ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి ఛైర్మన్‌గా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
JGL: మెట్ పల్లి మండలంలోని కొండ్రికర్ల, కోనరావుపేట, పెద్దాపూర్, చౌలమద్ది గ్రామాల రైతులకు సాగునీరు అందించాలని స్థానిక సర్పంచ్ లు అధికారులను కోరారు. మాన్పూర్ వాగుపై ఉన్న వరద కాలువ ద్వారా నీరు వదిలి చెరువులు నింపడంతో పాటు పంటలను కాపాడాలన్నారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో ఈఎన్సీ ఇన్ చీఫ్ రమేశ్ బాబుకు వినతి పత్రం అందజేశారు.
SKLM: లావేరు(M) బుడుమూరు వద్ద హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై విజిలెన్స్ సీఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఐదు హోటళ్లలో గృహ వినియోగ LPG సిలిండర్లను వ్యాపార అవసరాలకు వాడుతున్నట్లు గుర్తించి 14 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత యజమానులపై రూ.35,510 జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు.
VZM: జాతీయ లోక్ అదాలత్ సందర్బంగా కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం కక్షీదారులతో కోర్టు హాల్ కిక్కిరిసిపోయింది. ఈ సందర్బంగా న్యాయమూర్తి డా. ఎస్. విజయ్ చందర్ మాట్లాడుతూ.. లోక్ అదాలత్ వలన కోర్టులు చుట్టూ తిరగకుండా సమయం, ఆదాయం ఆదా అవుతుందని, లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పు అంతిమ తీర్పుగా భావించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.