• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోండి’

కడప: జిల్లా పెండ్లిమర్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిపార్ట్‌మెంట్ ఆఫీసర్‌పై దాడి చేసిన ప్రిన్సిపల్ ఇందిరను వెంటనే సస్పెండ్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సగిలి గుర్రప్ప డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల సమయంలో విధులు నిర్వహిస్తున్న డిపార్ట్మెంట్ ఆఫీసర్ భూత లింగేశ్వరరావుపై దాడి చేసి కులం పేరుతో దూషించారని ఆయన ఆరోపించారు.

March 14, 2026 / 06:19 PM IST

పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమం

W.G. ఆకివీడు మండలం అజ్జమూరులో శనివారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్- 2026′ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలల వేసిన నివాళులర్పించారు. అట్టడుగు వర్గాల వారి సంక్షేమం కోసం ఆయన కృషి చేశారన్నారు.

March 14, 2026 / 06:19 PM IST

పాలేరు వాగులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

ప్రకాశం: జరుగుమల్లి మండలం కే. బిట్రగుంట గ్రామ సమీపంలోని పాలేరు వాగులో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. వివరాలు తెలియకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించారు.

March 14, 2026 / 06:19 PM IST

సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

NLR: కోవూరు పట్టణంలోని ఒకటి, రెండు వార్డులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వార్డుల్లో పర్యటించి స్థానిక సమస్యలపై ప్రజలను ఆరా తీశారు. స్థానిక ప్రజలు చెప్పిన సమస్యను పరిష్కరిస్తూ వార్డుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

March 14, 2026 / 06:19 PM IST

‘ప్రజల సమస్య పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం’

KDP: ప్రజల సమస్య పరిష్కారమే కూటమి ప్రభుత్వా లక్ష్యం మని పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. శనివారం టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను బీటెక్ రవి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన 40 అర్జీలను పరిశీలించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు.

March 14, 2026 / 06:18 PM IST

IPL: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్

IPL-2026 సీజన్ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ సీజన్ IPLకు అందుబాటులో ఉండటం లేదని అతడు స్వయంగా వెల్లడించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్న పీటర్సన్, ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. తన వ్యక్తిగత కారణాలతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

March 14, 2026 / 06:16 PM IST

అధికారులకు మంత్రులు కీలక సూచనలు

TG: SC, ST సంక్షేమశాక మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి పలు అంశాలపై అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. హాస్టల్ భవనాలను మూడు నెలల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలోపు భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. వసతి గృహాల మరమ్మతుల బిల్లులు 15 రోజులకోసారి క్లియర్ చేస్తామని తెలిపారు.

March 14, 2026 / 06:15 PM IST

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి

AP: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ హైస్కూల్‌ను పరిశీలించిన ఆయన విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజన నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్య ప్రమాణాలు, భోజన వసతులపై అధికారులకు పలు సూచనలు చేశారు.

March 14, 2026 / 06:14 PM IST

హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణం

CTR: విద్యార్థులు టెన్త్ హాల్ టికెట్ చూపించి RTC బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని పుంగనూరు డిపో మేనేజర్ దేనేశష్ తెలిపారు. శనివారం అయన మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పరీక్షలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం పూట బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బస్సులు నడుపుతామని ఆయన స్పష్టం చేశారు.

March 14, 2026 / 06:13 PM IST

‘జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం’

KRNL: మంత్రాలయం నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వాల్మీకి లక్ష్మన్న స్పష్టం చేశారు. శనివారం కౌతాళం మండలంలోని తోవి, అగసలదిన్నె గ్రామాల్లో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో జనసేన జెండా ఎగుర వేస్తామన్నారు.

March 14, 2026 / 06:11 PM IST

ప్రతి ఒకరు బాధ్యతతో మొక్కలు నాటాలి: సర్పంచ్

HNK: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ధర్మసాగర్ మండలం ధర్మపురం గ్రామంలోని నర్సరీ పనులను సర్పంచ్ రమా-రఘోత్తం రెడ్డి, ఉపసర్పంచ్ రవివర్మ, GP కార్యదర్శి భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలను నాటి, వాటిని కాపాడాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు.

March 14, 2026 / 06:11 PM IST

కోమటి జయరాంకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు

ELR: ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రభుత్వ ప్రతినిధిగా కోమటి జయరాం నియమితులయ్యారు. శనివారం విజయవాడలో జరిగిన అభినందన కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం కోమటి జయరాంకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

March 14, 2026 / 06:11 PM IST

రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన కార్యక్రమం

KRNL: రహదారి ప్రమాదాల నివారణకు ప్రతి శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కర్నూలు రేంజ్ డీఐజీ డా. కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులకు ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. మైనర్లు వాహనాలు నడపకూడదని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పోలీస్ అధికారులు సూచించారు.

March 14, 2026 / 06:10 PM IST

డ్రగ్స్ నిర్మూలన అవగాహన కార్యక్రమం

WGL: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ వరంగల్ ఆధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని SI రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రేటర్ WGL వర్కింగ్ ప్రెసిడెంట్ R శ్రీహరి పాల్గొన్నారు. యువత డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఆయన సూచించారు. డ్రగ్స్ నిర్మూలన కోసం యువత ముందుకు రావాలన్నారు.

March 14, 2026 / 06:10 PM IST

ధోనీకి ఇదే చివరి ఐపీఎల్..?

CSK స్టార్ క్రికెటర్ MS ధోనీకి ఇదే చివరి IPL సీజన్ కావచ్చని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ధోనీ లేకుండా CSK జట్టును ఊహించుకోవడం చాలా కష్టమని పేర్కొన్నాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలో CSK ఈసారి టైటిల్ గెలిచి, ధోనీకి ఘనంగా వీడ్కోలు పలకాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించాడు. కాగా, గత కొన్ని ఏళ్లుగా ధోనీకి ఇదే చివరి సీజన్ అంటూ ప్రచారం సాగుతూనే ఉంది.

March 14, 2026 / 06:08 PM IST