KRNL: రహదారి ప్రమాదాల నివారణకు ప్రతి శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కర్నూలు రేంజ్ డీఐజీ డా. కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులకు ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. మైనర్లు వాహనాలు నడపకూడదని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పోలీస్ అధికారులు సూచించారు.