• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘నీటి ట్యాంకుల నిర్మాణం వేగవంతం చేయాలి’

MNCL: అమృత్ పథకంలో భాగంగా చేపట్టిన నీటి ట్యాంకుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమృత పథకం క్రింద చేపట్టిన నీటి ట్యాంకుల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవిలో ప్రజలకు నిరంతరం త్రాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

March 17, 2026 / 05:25 PM IST

హ్యామ్ రోడ్ల పేరిట రూ. 18 వేల కోట్ల స్కామ్: హరీష్ రావు

TG: రాష్ట్రంలో హ్యామ్‌ రోడ్ల పేరిట రూ.18వేల కోట్ల స్కామ్‌ జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. హ్యామ్‌ రోడ్లకు 10శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఇస్తున్నారన్నారు. హ్యామ్‌ రోడ్ల ద్వారా కాంగ్రెస్‌కు వేల కోట్లు వస్తున్నాయని.. ఈ కమీషన్లను 4 రాష్ట్రాల ఎన్నికలకు పంపుతారని ఆక్షేపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టెండర్లు రద్దు చేయాలన్నారు.

March 17, 2026 / 05:25 PM IST

ఘటన స్థలాన్ని పరిశీలించిన బడే నాగజ్యోతి

MLG: వాజేడు మండలం మోరుమూరు జీపీ పరిధి బొల్లారం గ్రామానికి చెందిన బాడిశ రాధకు చెందిన ఇళ్లు నిన్న రాత్రి ప్రమాదవశాత్తు కాలిపోయింది. విషయం తెలుసుకున్న నియోజకవర్గ BRS ఇంఛార్జ్ బడే నాగజ్యోతి మంగళవారం బాధితుల నివాసానికి వెళ్లి ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. బాధితురాలని అడిగి వివరాలు తెలుసుకున్నారు. బియ్యం, నిత్యవసర సరుకులు, కొంత ఆర్థికసాయం అందచేశారు.

March 17, 2026 / 05:24 PM IST

టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం

TPT: గుంటూరుకు చెందిన శ్రీ వేంకటేశ్వర పౌల్ట్రీస్ సంస్థ అధినేత వేంకటేశ్వరరావు, టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.10,01,116 విరాళం అందజేశారు. తిరుమలలో భక్తులకు అన్నప్రసాదం సేవల కోసం ఈ విరాళం వినియోగించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

March 17, 2026 / 05:23 PM IST

బాలల హక్కుల కమిటీ జీవో రద్దు.. IUKF హర్షం

VZM: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నియామక జీవోను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని ఇంటర్నేషనల్ యునైటెడ్ కలాం ఫౌండేషన్ (IUKF) స్వాగతించింది. విజయనగరంలో మంగళవారం వారు మాట్లాడుతూ.. నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో సీఎం వెంటనే స్పందించి జీవో రద్దు చేయడం అభినందనీయమన్నారు. ఇది పారదర్శక పాలనకు నిదర్శనమని రాష్ట్ర అధ్యక్షుడు మమ్ముల తిరుపతిరావు తెలిపారు.

March 17, 2026 / 05:21 PM IST

బద్వేల్‌లో ఘనంగా జన చైతన్య జీపు జాతా ప్రారంభం

KDP: బద్వేల్‌లో జన చైతన్య జీపు జాతా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న హాజరై జాతాను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ సీతారాం రెడ్డి, అర్బన్ ఎస్ఐ కొండారెడ్డి, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు విజయకుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శివకుమార్, జిల్లా కార్యదర్శి చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు.

March 17, 2026 / 05:21 PM IST

ఎక్సైజ్ దాడులు.. 600 లీటర్ల ఊట ధ్వంసం

ASR: రంపచోడవరం మండలం నాగులపల్లి గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి ఒకరిపై కేసు నమోదు చేశారు. అలాగే DN పాలెంలో 20 లీటర్ల సారాయితో మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నవోదయం 2.0లో భాగంగా ఇప్పటివరకు 50 కేసులు నమోదు చేసి రూ.80 వేల జరిమానా వసూలు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ తెలిపారు.

March 17, 2026 / 05:20 PM IST

ఎక్సైజ్ దాడులు.. 600 లీటర్ల ఊట ధ్వంసం

ASR: రంపచోడవరం మండలం నాగులపల్లి గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి ఒకరిపై కేసు నమోదు చేశారు. అలాగే DN పాలెంలో 20 లీటర్ల సారాయితో మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నవోదయం 2.0లో భాగంగా ఇప్పటివరకు 50 కేసులు నమోదు చేసి రూ.80 వేల జరిమానా వసూలు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ తెలిపారు.

March 17, 2026 / 05:20 PM IST

దామెర MROకు వినతిపత్రం అందజేసిన నేతలు

HNK: కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ.. దామెర MROకు బీజేపీ మండల అధ్యక్షుడు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు చాడ శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.

March 17, 2026 / 05:20 PM IST

‘యువతిని హత్య చేసిన నిందితుడిని వెంటనే ఉరితీయాలి’

ASF: కొండపల్లిలో ప్రేమ పేరుతో నమ్మించి యువతి సమ్మక్క గొంతు నులిమి హత్య చేసిన నిందితుడు కేర్ కరి జలపతిని వెంటనే ఉరితీయాలని ఆదివాసి సంఘాలు డిమాండ్ చేశారు. మంగళవారం బెజ్జుర్ ఆదివాసీ సంఘంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సమ్మక్క కుటుంబాన్ని ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆమె కుటుంబానికి వెంటనే రూ. 25 లక్షలు ఎక్సగ్రెసియా ప్రకటించాలన్నారు.

March 17, 2026 / 05:19 PM IST

ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ

ATP: పామిడిలో మంగళవారం వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫాను వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. రంజాన్ పండుగను ప్రతి ముస్లిం కుటుంబాలు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ రంజాన్ తోఫాను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ప్రజలకు ఆమె రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు.

March 17, 2026 / 05:18 PM IST

12వ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

E.G: CITU తూ.గో జిల్లా 12వ మహాసభలు ఏప్రిల్ 1,2 తేదీలలో జరగనున్నాయి. ఈ మేరకు మంగళవారం రాజమండ్రిలోని CITU జిల్లా కార్యాలయం వద్ద పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సుందర్ బాబు, బీ.పవన్ మాట్లాడుతూ.. కార్మికులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్‌ను ప్రతిఘటించి కార్మిక హక్కుల కోసం పోరాటాలు చేస్తామన్నారు.

March 17, 2026 / 05:17 PM IST

గ్యాస్ సరఫరా, నిల్వల పరిస్థితిపై ఆరా తీసిన కలెక్టర్

JN: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్, ఇతర సంబంధిత అధికారులతో కలిసి జిల్లాస్థాయి గ్యాస్ సరఫరా పర్యవేక్షణ కమిటీ (DLESMC) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ అమలు, ప్రస్తుత గ్యాస్ సరఫరా, నిల్వల పరిస్థితిపై ఆరా తీశారు.

March 17, 2026 / 05:16 PM IST

అనారోగ్య బాధితులకు అండగా ఎమ్మెల్యే జారే

BDK: అశ్వరావుపేట నియోజకవర్గానికి చెందిన అనారోగ్య బాధితులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అండగా నిలుస్తున్నారు. 65 మంది బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులను మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ భవన్ సచివాలయంలో అధికారులకు అందించారు. సకాలంలో చెక్కులు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.

March 17, 2026 / 05:16 PM IST

‘పశువులకు టీకాలు వేయించాలి’

AKP: పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా టీకాలు వేయించాలని నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వెంకటరమణ, తాండవ ప్రాజెక్ట్ ఛైర్మన్ సత్యనారాయణ సూచించారు. నాతవరం మండలం గుమ్మనపూడిలో గాలికుంటు వ్యాధి నివారణ కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. వచ్చేనెల 29 వరకు పశువైద్య సిబ్బంది గ్రామాలకు వెళ్లి పశువులకు వ్యాక్సిన్ వేస్తారన్నారు.

March 17, 2026 / 05:15 PM IST