JN: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్, ఇతర సంబంధిత అధికారులతో కలిసి జిల్లాస్థాయి గ్యాస్ సరఫరా పర్యవేక్షణ కమిటీ (DLESMC) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ అమలు, ప్రస్తుత గ్యాస్ సరఫరా, నిల్వల పరిస్థితిపై ఆరా తీశారు.