ASR: రంపచోడవరం మండలం నాగులపల్లి గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి ఒకరిపై కేసు నమోదు చేశారు. అలాగే DN పాలెంలో 20 లీటర్ల సారాయితో మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నవోదయం 2.0లో భాగంగా ఇప్పటివరకు 50 కేసులు నమోదు చేసి రూ.80 వేల జరిమానా వసూలు చేసినట్లు ఇన్స్పెక్టర్ శ్రీధర్ తెలిపారు.