NGKL: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును బీజేపీ అధిష్ఠానం తమిళనాడు ఎన్నికల ఇంఛార్జ్‌గా నియమించింది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా బాధ్యతలను ఆయనకు అప్పగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఆయన పనిచేయనున్నారు. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధిష్టానానికి బాలరాజు ధన్యవాదాలు తెలిపారు.
MDK: నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీనాక్షి, డాక్టర్ మోహన్ నాయక్ ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వైద్య సేవలు అందించారు. గ్రామస్తుల ఆరోగ్య సమస్యలను తెలుసుకుని వారికి అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ విధంగా ఇంటి వద్దకే వైద్యం అందించడం పట్ల గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు రాజు, మాజీ సర్పంచ్ లక్ష్మణ్ పాల్గొన్నారు0
KKD: పిఠాపురం RTC కాంప్లెక్స్‌లో కూటమి నాయకులు ‘దివ్యాంగుల శక్తి’ పథకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా DCCB బ్యాంక్ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, Ex.MLA దొరబాబు, ఇతర కూటమి నాయకులు పాల్గొని, రిబ్బన్ కట్ చేసి దివ్యాంగుల ఉచిత బస్సును ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం దివ్యాంగులకు కల్పించిన ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NLR: ఉదయగిరి ఆర్టీసీ డిపోలో బుధవారం ‘దివ్యాంగ శక్తి’ పథకంను ప్రారంభించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలానీ డిపో మేనేజర్ రమేశ్ కుమార్ తెలిపారు. ఈ పథకం ద్వారా 300 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ పథకాన్ని జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
TG: కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆమె గన్నేరుపప్పు దంచుకుని తిని బలవన్మరణానికి పాల్పడింది. విషపూరితమైన గన్నేరు పప్పు తినడంతో తీవ్ర అస్వస్థతకు గురైన దివ్యను.. స్థానికులు కరీంనగర్ ఆసుపత్రికి, ఆ తర్వాత హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
నిర్మల్ జిల్లాలోని 47 పరీక్ష కేంద్రాలలో గురువారం నిర్వహించిన పదవ తరగతి పరీక్షలు ఏడుగురు విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఈవో భోజన్న తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 9722 మంది విద్యార్థులకు గాను 9715 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని ప్రశాంతంగా పరీక్షను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. మొత్తం 99.93 శాతం విద్యార్థులు హాజరయ్యారు.
KRNL: ఆదోని మండలం చాగి గ్రామంలో బుధవారం ప్రమీల (23) అనే యువతి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భీమప్ప, నాగలక్ష్మి దంపతుల మూడో కుమార్తె అయిన ఈమె, బీ-ఫార్మసీ పూర్తి చేసి ఆదోనిలోని ఒక మెడికల్ షాపులో పనిచేస్తోంది. ఈ క్రమంలో బలవన్మరణానికి పాల్పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మార్కాపురం పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా, ఆర్డీవో పెంచల ప్రభాకర్ బుధవారం తన చాంబర్లో బాధ్యతలు చేపట్టారు. సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ ఆదేశాలను సమర్థవంతంగా అమలుపరుస్తానని, మార్కాపురం పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ సిబ్బంది ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రకాశం: యర్రగొండపాలెం ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం దివ్యాంగ శక్తి పథకాన్ని టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగులకు బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం కోసం ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మకమైన పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎరిక్షన్ బాబు తెలిపారు.
ప్రకాశం: కనిగిరిలోని ఆర్టీసీ డిపోలో దివ్యాంగులకు ప్రభుత్వం కల్పించిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బుధవారం ప్రారంభించారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం లాగానే దివ్యాంగులకు కూడా ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
GNTR: AISF రాష్ట్ర సమితి సభ్యురాలిగా, రాష్ట్ర యువజన వేదిక కో-ఆర్డినేటర్‌గా జి. అంజలి మంగళవారం నియమితులయ్యారు. విశాఖపట్నంలో జరిగిన AISF రాష్ట్ర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అంజలి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ AISF మహిళా కార్యదర్శిగా ఉన్నారు. అంజలిని AISF, ANU ఇంఛార్జ్ పాలం నాసరయ్య, తదితరులు అభినందించారు.
VSP: సేవలకు ప్రతిరూపం బ్రహ్మకుమారీస్ అని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. బుధవారం డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్‌లో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకలలో అయిన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… బ్రహ్మకుమారీస్ సమాజ సేవలో ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామ్ రాజు పాల్గొన్నారు.
TG: PCC దుమారంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. మహేష్ కుమార్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. మహేష్ కుమార్ సారథ్యంలో గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించామని గుర్తు చేశారు. రంజాన్ వేడుకలకు జగ్గారెడ్డి ఏర్పాటు బాగున్నాయని తెలిపారు. అందుకే PCC చీఫ్ అయితే బాగుంటుందన్నా.. ఇప్పుడున్న PCCని తొలగించాలనేది ఉద్దేశం కాదని వివరించారు.
KMM: మధిర మున్సిపాలిటీలో పారిశుద్ధ్యన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ముమ్మరంగా నిర్వహించారు.
MHBD: పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పరీక్ష కేంద్రాల నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేయాలని DSP తిరుపతిరావు సూచించారు. బయ్యారంలో ఏర్పాటుచేసిన పదవతరగతి పరీక్ష కేంద్రాన్ని బుధవారం ఉదయం ఆయన పరిశీలించారు. విద్యార్థులు భయం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని ఆయన సూచనలు చేశారు.