కన్నడ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమా టీజర్‌పై కర్ణాటకలో వివాదం నెలకొంది. ఈ టీజర్లో కొన్ని దృశ్యాలు అశ్లీలంగా ఉన్నాయంటూ ఆమ్ ఆద్మీ పార్టీ.. కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. తాజాగా దీనిపై మహిళా కమిషన్ స్పందించింది. ఈ వివాదాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలంటూ సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది.
చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీకి భారీ షాక్ తగిలింది. నిన్నే రిలీజైన ఈ చిత్రం ఇవాళ ఆన్లైన్లో ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా పైరసీ చేయడం నేరం అంటూ మండిపడుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని SM వేదికగా పోలీసులను కోరుతున్నారు. కాగా, ‘రాజాసాబ్’ పైరసీ ప్రింట్ కూడా ఒక రోజులోనే వచ్చిన విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో రావిపూడి పలు పాత పాటలను వాడిన విషయం తెలిసిందే. అవి మూవీకి చాలా ప్లస్ అయ్యాయి. ఈ పాటల రైట్స్ కోసం ఆడియో కంపెనీలకు దాదాపు కోటి రూపాయలు చెల్లించారట. అది కూడా కేవలం ట్యూన్స్ వరకు మాత్రమే అనుమతి తీసుకున్నట్లు టాక్.
భార్య, ప్రియురాలి మధ్య నలిగిపోయే ఒక వ్యక్తి కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్నప్పటికీ, ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండ్ హాఫ్ ఆకట్టుకున్నాయి. రవితేజ ఎనర్జిటిక్ నటన, ఆషికా గ్లామర్, వెన్నెల కిశోర్, సునీల్, సత్యల కామెడీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అయితే, రొటీన్ స్టోరీ, సాగదీత సన్నివేశాలు మైనస్. ఓవరాల్‌గా ఇది ఒక యావరేజ్ మూవీ. రేటింగ్: 2.5/5
మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఇవాళ గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్‌పై అప్డేట్ వచ్చింది. దీని డిజిటల్ రైట్స్‌ను జీ5, శాటిలైట్ హక్కులను జీ తెలుగు దక్కించుకున్నాయి. మార్చి మొదటి వారం లేదా చివరి వారంలో ఈ మూవీ OTTలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్.
‘మన శంకరవరప్రసాద్ గారు’చిత్రంతో దర్శకుడు అనిల్ రావిపూడి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దీనితో ఓటమి అనేది లేకుండా వరుసగా 9 హిట్ చిత్రాలను అందించిన దర్శకుడిగా ఆయన నిలిచాడు. ఈ జాబితాలో దర్శకధీరుడు రాజమౌళి 13 సినిమాలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక యువ దర్శకులు నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా తాము దర్శకత్వం వహించిన మూడు చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నారు.
హాలీవుడ్ దర్శకనటుడు తిమోతి బస్ఫీల్డ్ కోసం అమెరికా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 68ఏళ్ల వయసు ఉన్న అతను.. 11ఏళ్ల కవల బాలురపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ‘ది క్లీనింగ్ లేడీ’ సెట్లో ఈ దారుణం జరిగినట్లు బాధితల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో తిమోతిపై అరెస్ట్ వారెంట్ జారీ కాగా.. అతని పరారీలో ఉన్నాడు.
తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన ‘పరాశక్తి’ మూవీని వెంటనే బ్యాన్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. హిందీ వ్యతిరేక ఉద్యమం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో తమ పార్టీని కించపరిచారని తమిళనాడు కంగ్రెస్ నేతలు ఆరోపించారు. అగ్రనాయకురాలు ఇందిరాగాంధీను తమిళులకు వ్యతిరేకంగా చూపించారని మండిపడుతున్నారు. కాగా, దర్శకురాలు సుధా కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కించింది.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తొలిరోజు ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్‌తో కలిపి మొదటి రోజు రూ.84కోట్లు వసూళ్లు సాధించింది. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రానికి థియేటర్ల వద్ద పాజిటివ్ టాక్ లభిస్తోంది. సినిమా ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోయిందని, సెకండ్ హాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్ బాగున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. మాస్ రాజా ఎనర్జీకి తోడు దర్శకుడు కిశోర్ తిరుమల మార్క్ పంచ్ డైలాగులు, సత్య కామెడీ అకట్టుకుంటున్నాయి. మొత్తంగా సినిమా బాగుందని ఆడియన్స్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం తొలిరోజే అదిరిపోయే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. వింటేజ్ చిరంజీవిని గుర్తుచేసేలా ఉన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ చిత్రం ఇండియాలో ప్రీమియర్లతో కలిపి సుమారు రూ. 37.10 కోట్ల వసూళ్లను సాధించింది. అయితే, మేకర్స్ అధికారిక కలెక్షన్లను ప్రకటించాల్సి ఉంది.
మాస్ మహారాజా రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. దర్శకుడు కిశోర్ తిరుమల తెరకెక్కించిన ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఈ మూవీ పూర్తి రివ్యూను ఫస్ట్ షో ముగిసిన వెంటనే Hit TV యాప్‌లో చూడొచ్చు.
హీరోయిన్ మీనాక్షి చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నటిగా తాను తొలిసారి ‘అవుట్ ఆఫ్ లవ్’ సిరీస్ కోసం సెట్లోకి అడుగు పెట్టినట్లు తెలిపింది. తాను చిత్రీకరణలో పాల్గొన్న తొలిరోజే సెట్లో ఏడ్చేసినట్లు చెప్పింది. తన మేనేజర్‌కు ఫోన్ చేసి ఆ సిరీస్ తాను చేయలేనని చేప్పినట్లు పేర్కొంది. కానీ, తను కన్విన్స్ చేసినట్లు చెప్పుకొచ్చింది.
TG: హైదరాబాద్‌లోని కూకట్పల్లి అర్జున్ థియేటర్లో చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుడు ఆనంద్ కుమార్ గతంలో ఏపీఎస్పీ 12వ బెటాలియన్‌లో ఎస్ఐగా పని చేసి రిటైరైనట్లు సమాచారం. అతను గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఎల్లమ్మ సినిమాపై బిగ్ అప్డేట్ వచ్చింది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. సంక్రాంతి రోజున ఈ టైటిల్ టీజర్ అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. బలగం దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కిస్తున్న ఈ మూవీకి హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఫైనల్ అయినట్లు సమాచారం.