మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ కామెడీ టైమింగ్‌తో అలరించిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. విడిపోయిన భార్యాపిల్లలను దక్కించుకునేందుకు భర్త చేసిన ప్రయత్నమే ఈ సినిమా కథ. అనిల్ మార్కు కామెడీ, చిరు నటన, వెంకటేశ్ ఎంట్రీ, సంగీతం ప్రధాన బలాలు. రొటీన్ కథ, సాగదీత సీన్లు మైనస్. మొత్తంగా ఇది పక్కా సంక్రాంతి ఎంటర్‌టైనర్. రేటింగ్: 3.25/5
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా ప్రీమియర్స్ మొదలయ్యాయి. చిరంజీవి ఎంట్రీ, ఫస్ట్ ఫైట్ సూపర్ అంటున్నారు. కామెడీ బాగుందని, ఫుల్ ఎంటర్‌టైనర్ అని చెబుతున్నారు. భీమ్స్ మ్యూజిక్ వేరే లెవల్ ఉందంటున్నారు. కొన్ని చోట్ల సాగదీత సీన్లు సినిమాకు కాస్త మైనస్ అని తెలుస్తోంది. పూర్తి రివ్యూ కోసం రేపటి వరకు వేచి చూడాల్సిందే.
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా ప్రీమియర్స్ మొదలయ్యాయి. చిరంజీవి ఎంట్రీ, ఫస్ట్ ఫైట్ సూపర్ అంటున్నారు. కామెడీ బాగుందని, ఫుల్ ఎంటర్‌టైనర్ అని చెబుతున్నారు. భీమ్స్ మ్యూజిక్ వేరే లెవల్ ఉందంటున్నారు. కొన్ని చోట్ల సాగదీత సీన్లు సినిమాకు కాస్త మైనస్ అని తెలుస్తోంది. పూర్తి రివ్యూ కోసం రేపటి వరకు వేచి చూడాల్సిందే.
సరిగమప లిటిల్ ఛాంప్స్ రియాలిటీ షో సింగర్, చిన్నారి వరుణవికి చిరంజీవి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడి ఆ చిన్నారి కోరిక మేరకు ఆమెను చిరంజీవి వద్దకు తీసుకెళ్లగా, ఆ పాపకు అవసరమైన సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు. అన్నట్లుగానే, తాజాగా చిరంజీవి కుమార్తె సుస్మిత రూ.5 లక్షల చెక్కును వరుణవి కుటుంబానికి అందజేసింది.
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒకరాజు’ జనవరి 14న విడుదలవుతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ అయింది. వరంగల్ కాకతీయ జూనియర్ కాలేజీలో జనవరి 12న సాయంత్రం 5గంటలకు ఈ ఈవెంట్ జరగనుంది. అలాగే రేపు ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా.. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ జనవరి 12న రిలీజ్ కాబోతుంది. బుక్ మై షోలో ఈ మూవీ ట్రెండ్ కొనసాగుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన ఒక్క గంటలో 13వేల టికెట్స్ బుక్ అయ్యాయి. ఇక అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో నయనతార, వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు.
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాలయ్య నటించిన ‘ఆదిత్య 369’కు సీక్వెల్‌గా రాబోతున్న ‘ఆదిత్య 999 మ్యాక్స్’లో మోక్షజ్ఞ నటించనున్నాడు. జనవరి చివరిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మార్చి మొదటి వారంలో ఇది సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు, ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కించనున్నట్లు టాక్.
ప్రముఖ సింగర్ ప్రశాంత్ తమంగ్(43) గుండెపోటుతో కన్నుమూశాడు. తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ప్రశాంత్‌ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్స్ ధ్రువీకరించారు. కోల్‌కతాలో పోలీస్ కానిస్టేబుల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన 2007 ఇండియన్ ఐడల్ సీజన్ 3 విజేతగా నిలిచాడు. పలు సినిమాల్లో నటించాడు.
ఘట్టమనేని జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’తో ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడు. విజయవాడలో జరిగిన నటుడు కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన.. ‘కృష్ణ గర్వపడేలా జీవించడం నా జీవిత లక్ష్యం. ఆయన దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. మహేష్ బాబు నాకు రోల్ మోడల్. నా తొలి మూవీ ఫస్ట్ లుక్‌ను ఆయనే రిలీజ్ చేయడం గర్వంగా ఉంది. థ్యాంక్యూ బాబాయ్’ అని అన్నాడు.
ఇవాళ దర్శకుడు సుకుమార్ బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్ చెప్పాడు. ‘హ్యాపీ బర్త్ డే డార్లింగ్ సుకుమార్. ఈరోజు నీకంటే నాకు ఇంకా ప్రత్యేకం.. ఎందుకంటే నా జీవితాన్ని మార్చిన రోజు ఇదే. నా జీవితంలో నువ్వు నాకు ఎంత స్పెషల్ అనేది మాటల్లో చెప్పలేను. నువ్వు పుట్టినందుకు థ్యాంక్స్’ అంటూ పోస్ట్ పెట్టాడు. కాగా, వీరి కాంబోలో ‘ఆర్య’, ‘ఆర్య 2’, ‘పుష్ప’, ...
తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. నటి ముచ్చర్ల అరుణ, దర్శకుడు గోపీచంద్ మలినేని, బాబీ సింహా, తమన్, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ తదితరులు వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వారికి పండితులు వేదాశీర్వచనం చేసి.. తీర్థప్రసాదాలను అందజేశారు.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన తాజా క్రైమ్ థ్రిల్లర్ ‘కళంకావల్’ OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ OTT సంస్థ సోనీలివ్‌లో జనవరి 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది. ఇక దర్శకుడు జితిన్ కె జోస్ తెరకెక్కించిన ఈ సినిమాలో వినాయకన్ కీలక పాత్ర పోషించారు.
రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా హీరోయిన్ నుపుర్ సనన్ పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు, సింగర్ స్టెబిన్ బెన్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఉదయ్‌పూర్‌లో ఇరుకుటుంబాలు, సన్నిహితుల మధ్య వారి పెళ్లి జరిగింది. ఈ కొత్త జంటకు నెటిజన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా, నుపుర్ బాలీవుడ్ నటి కృతి సనన్‌కు సొంత చెల్లెలు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. JAN 13న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. దీనికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీకి 2:10 గంటల రన్ టైం లాక్ అయినట్లు టాక్. ఇక ఈ మూవీలో ఆషికా రంగనాథన్, డింపుల్ హయతి కీలక పాత్రలు పోషించారు.
జనవరి 13న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి మాస్ మహారాజా రవితేజ సిద్ధమయ్యాడు. తాజాగా తన తదుపరి ప్రాజెక్టుపై రవితేజ అప్‌డేట్ ఇచ్చాడు. డైరెక్టర్ శివ నిర్వాణతో తన నెక్స్ట్ సినిమా ఉంటుందన్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని చెప్పాడు. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు టాక్.