TG: హైదరాబాద్‌లోని కూకట్పల్లి అర్జున్ థియేటర్లో చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుడు ఆనంద్ కుమార్ గతంలో ఏపీఎస్పీ 12వ బెటాలియన్లో ఎస్ఐగా పని చేసి రిటైరైనట్లు సమాచారం. అతను గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఎల్లమ్మ సినిమాపై బిగ్ అప్‌డేట్ వచ్చింది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. సంక్రాంతి రోజున ఈ టైటిల్ టీజర్ అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. బలగం దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కిస్తున్న ఈ మూవీకి హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఫైనల్ అయినట్లు సమాచారం.
TG: హైదరాబాద్ కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్‌లో విషాదం చోటుచేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ చూస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతుడి వివరాలను సేకరిస్తున్నారు. అతని మృతితో థియేటర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్ర శాటిలైట్ హక్కులను ‘జీ తెలుగు’ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ZEE5’ దక్కించుకుంది.
‘జన నాయగన్’ సినిమా విడుదలను తమ చిత్రం ‘పరాశక్తి’ అడ్డుకుందన్న ఆరోపణలపై నటుడు, నిర్మాత దేవ్ రామ్‌నాథ్ మండిపడ్డారు. తమ సినిమాపై ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సినిమాను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని, ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు. ఇండస్ట్రీలో అందరూ బాగుండాలన్నదే తమ కోరిక అని ఆయన స్పష్టం చేశారు.
ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 161 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. కేవలం భారత్‌లోనే రూ. 129.2 కోట్ల గ్రాస్ వసూళ్లు రావడం విశేషం. ఇక నిన్న ఒక్కరోజే ఈ చిత్రం రూ. 19.1 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.
‘జన నాయగన్’ చిత్ర బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సెన్సార్ బోర్డు కావాలనే తమ చిత్రాన్ని విడుదల కాకుండా అడ్డుకుంటోందని పిటిషన్ దాఖలు చేసింది. వెంటనే సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేసేలా బోర్డును ఆదేశించాలని కోరింది. కాగా, చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేయాలంటూ మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై, డివిజన్ బెంచ్ స్టే విధించిన విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం ఓ అరుదైన ఘనత సాధించింది. USలో ప్రీమియర్స్ ద్వారానే వన్ మిలియన్ డాలర్లను వసూలు చేసిన చిరు రెండో చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. మరోవైపు, బుక్‌మై షోలో గడిచిన 24 గంటల్లోనే 2 లక్షల 86 వేల టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. మూవీకి హిట్ టాక్ రావడంతో భారీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది.
‘మన శంకరవరప్రసాద్ గారు’ హిట్ టాక్‌తో సంక్రాంతి రేసులో తనకు తిరుగులేదని అనిల్ రావిపూడి మరోసారి నిరూపించుకున్నాడు. గతంలో ‘F2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలతో పండగ హిట్లు కొట్టిన అనిల్.. ఇప్పుడు మెగాస్టార్‌తో మరో విజయం అందుకున్నాడు. క్లీన్ ఫ్యామిలీ కామెడీతో వరుస విజయాలు అందుకుంటున్న అనిల్.. ‘టాక్ ఆఫ్ ది ఇండస్ట...
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో మేకర్స్ సంబరాల్లో మునిగిపోయారు. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు చిరంజీవిని కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి వారికి స్వీట్లు తినిపించి, వారితో కలిసి ఫొటోలు దిగారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి ‘వారణాసి’ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడు. రూ. 1300 కోట్లకు పైగా బడ్జెట్‌తో సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం రూపొందుతోంది. అయితే, ఈ సినిమాలో ఓ బాలీవుడ్ స్టార్ నెగిటివ్ షేడ్స్ ఉన్న ఒక ప్రత్యేక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. దీంతో ఆ నటుడు ఎవరా అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఇందులో ‘చారులత’ అనే అమాయకమైన, ధనిక యువతి పాత్రలో నటించానని మీనాక్షి చౌదరి తెలిపింది. మొదటిసారి పూర్తిస్థాయి కామెడీ రోల్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించిందని చెప్పింది. నవీన్‌తో కలిసి నటించడం ఒక లెర్నింగ్ స్కూల్‌లా ఉందని పేర్కొంది.
మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ కామెడీ టైమింగ్‌తో అలరించిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. విడిపోయిన భార్యాపిల్లలను దక్కించుకునేందుకు భర్త చేసిన ప్రయత్నమే ఈ సినిమా కథ. అనిల్ మార్కు కామెడీ, చిరు నటన, వెంకటేశ్ ఎంట్రీ, సంగీతం ప్రధాన బలాలు. రొటీన్ కథ, సాగదీత సీన్లు మైనస్. మొత్తంగా ఇది పక్కా సంక్రాంతి ఎంటర్‌టైనర్. రేటింగ్: 3.25/5
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా ప్రీమియర్స్ మొదలయ్యాయి. చిరంజీవి ఎంట్రీ, ఫస్ట్ ఫైట్ సూపర్ అంటున్నారు. కామెడీ బాగుందని, ఫుల్ ఎంటర్‌టైనర్ అని చెబుతున్నారు. భీమ్స్ మ్యూజిక్ వేరే లెవల్ ఉందంటున్నారు. కొన్ని చోట్ల సాగదీత సీన్లు సినిమాకు కాస్త మైనస్ అని తెలుస్తోంది. పూర్తి రివ్యూ కోసం రేపటి వరకు వేచి చూడాల్సిందే.