రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్ 2’ మూవీ 2026 మార్చి 19న విడుదల కానుంది. ‘ధురంధర్’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ పూర్తయినట్లు తెలుస్తోంది. దీనికి సెన్సార్ బోర్డు U/A 16+ సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. అలాగే ఈ మూవీ రన్ టైం 3:40 గంటలుగా లాక్ చేసినట్లు టాక్. మొదటి భాగం(3:34 గంటలు)తో పోలిస్తే 6 నిమిషాలు ఎక్కువట.