ఆర్థిక కష్టాలతో సతమతవుతున్న జమీందారీ వారసుడు రాజు(నవీన్ పోలిశెట్టి ).. డబ్బుకోసం జమీందారీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం, ప్రెసిడెంట్ అవ్వడం.. ఆ తర్వాత అతనికి ఎదురయ్యే అనుభవాలే ‘అనగనగా ఒకరాజు’ సినిమా కథ. నవీన్ కామెడీ టైమింగ్ బాగుంది. హీరోయిన్ నటన, ఫస్టాఫ్ మూవీకి ప్లస్. కొత్తదనం లేని కథ, ఊహకు తగ్గట్టు సాగే కథనం మైనస్. రేటింగ్:2.75/5.
కన్నడ యష్ నటిస్తోన్న ‘టాక్సిక్’ టీజర్‌పై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ టీజర్‌లోని ఇంటిమేట్ సన్నివేశాలపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ సీన్‌లో నటించిన బీట్రీజ్ టోఫెన్ బాఖ్ తన ఇన్‌స్టా అకౌంట్‌ను డిలీట్ చేసింది. జనవరి 13 వరకు యాక్టివ్‌గా ఉన్న ఆమె అకౌంట్ ప్రస్తుతం కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
‘పరాశక్తి’పై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దర్శకురాలు సుధా కొంగర చెప్పింది. ప్రస్తుతం ఓ సినిమాను ప్రేక్షకులకు అందించాలంటే ఎన్నో సవాళ్లు దాటాల్సి వస్తోందని తెలిపింది. ఒక వర్గానికి చెందిన అభిమానుల వల్ల తాము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఫేక్ IDలతో తమపై దారుణమైన పోస్టులు పెడుతున్నారని పేర్కొంది. ఇదంతా ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసని చెప్పింది.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.120కోట్లు వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమాలో నయనతార, వెంకటేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మారుతి కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనిపై మారుతి స్పందించాడు. చిరంజీవి హీరోగా త్వరలోనే సినిమా తీస్తానని చెప్పాడు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ప్రస్తుతం చిరు ‘మన శంకరవరప్రసాద్ గారు’, మారుతి తెరకెక్కించిన’ రాజాసాబ్’ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
ఇటీవల నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలై విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న సిరీస్ ‘అడాల్‌సెన్స్’. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ పలు రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఈ సిరీస్‌కు రెండో పార్ట్ రాబోతుంది. ఈ విషయాన్ని నటుడు స్టీఫెన్ గ్రాహం వెల్లడించాడు. ఇప్పటికే ఆ ప్రయత్నంలో ఉన్నామని, కథను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నామని తెలిపాడు.
టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒకరాజు’ మూవీ ఇవాళ విడుదలైంది. నవీన్ కామెడీ టైమింగ్ బాగుందని ప్రేక్షకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని, కథ కంటే కామెడీకే ప్రాధాన్యత ఇచ్చారని అంటున్నారు. కొన్ని సన్నివేశాలు సాగదీతగా ఉన్నాయని పేర్కొంటున్నారు.
నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ట్రైలర్ రిలీజ్ అయిన రోజు నుంచే చాలా కాన్ఫిడెంట్స్‌తో ఉన్నట్లు తెలిపాడు. ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నాడు. ఓవర్సీస్ ఆడియన్స్‌కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు.
స్వీయ దర్శకత్వంలో త్రినాథ్ కఠారి హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘ఇట్లు మీ ఎదవ’. ఈ మూవీ గతేడాది నవంబరులో థియేటర్లలో సందడి చేసింది. సంక్రాంతి సందర్భంగా ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈనెల 15 నుంచి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ కానుంది.
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన మూవీ ‘మన శంకరవరప్రసాద్‌గారు’. నిన్న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే బుక్ మైషోలో 1 మిలియన్ టికెట్ల సెల్స్ సాధించి చరిత్ర సృష్టించింది. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా.. వెంకటేష్ అతిథి పాత్రలో నటించాడు.
అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన హీరోయిన్ శ్రీలీల. వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ హిట్‌లు మాత్రం పడటం లేదు. ఈ ఎఫెక్ట్ శ్రీలీల రెమ్యూనరేషన్‌పై పడినట్లు తెలుస్తోంది. గత సినిమాలకు రూ.3-4 కోట్ల పారితోషికం తీసుకున్న ఆమె.. తాజా చిత్రం ‘పరాశక్తి’కి కోటి రూపాయలు మాత్రమే అందుకున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ నేపథ్యంలో కింగ్ నాగార్జునతో సినిమా చేయాలని ఆయనకు అక్కినేని ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. ‘హలో బ్రదర్’ తరహా ఫుల్ లెంగ్త్ కామిక్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించాలని కోరుతున్నారు. నాగ్ స్టైల్‌కు రావిపూడి కామెడీ టైమింగ్ సెట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కించిన ‘డాకు మహారాజ్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమా OST కోసం ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అప్‌డేట్ ఇచ్చాడు. జనవరి 26న ఈ మూవీ OSTని విడుదల చేయనున్నట్లు తెలిపాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు.
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో తెరకెక్కిన మూవీ ‘రాజాసాబ్’. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.201కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ తన స్టామినాను మరోసారి నిరూపించుకున్నాడని రెబల్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.