‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీతో మెగాస్టార్ చిరంజీవి మంచి హిట్ అందుకున్నారు. తర్వాత చిరు తన ఫోకస్ మొత్తాన్ని ‘విశ్వంభర’ మూవీపై పెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దర్శకుడు బాబీతో చిరు చేయాల్సిన ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనుల కారణంగా మరింత ఆలస్యంగా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. ఇక ‘విశ్వంభర’ 2026 జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చరణ్‌తో కలిసి దిగిన డివోషనల్ ఫొటోను బుచ్చిబాబు SMలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పిక్‌లో చరణ్ డైనమిక్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా మార్చి 27న రిలీజ్ కాబోతుంది.
సినీ ప్రియులకు సూపర్ స్టార్ మహేష్ బాబు గుడ్ న్యూస్ చెప్పాడు. బెంగళూరులో కొత్తగా నిర్మించిన ‘AMB సినిమాస్’ ద్వారా డాల్బీ అనుభూతిని పంచనున్నట్లు తెలిపాడు. జనవరి 16న ఇది ప్రారంభం కానున్నట్లు పోస్ట్ పెట్టాడు. దీంతో ఆయనకు నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. మరోవైపు HYDలోని ‘అల్లు సినిమాస్’లోనూ డాల్బీ సినిమా స్క్రీన్ త్వరలో ప్రారంభం కానుంది.
శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ ఇవాళ సాయంత్రం విడుదలై సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా నిలిచింది. ఇద్దరు భామల మధ్య హీరో పడే పాట్లు, తండ్రిగా నరేష్, వెన్నెల కిశోర్ పండించిన కామెడీ నవ్వులు పూయిస్తుంది. దర్శకుడు రామ్ అబ్బరాజు తన మార్క్ స్క్రీన్‌ప్లేతో మెప్పించాడు. కొన్ని పాత సినిమా సీన్లు, క్లైమాక్స్ కాస్త మైనస్.రేటింగ్: 3.25/5
నటి రేణు దేశాయ్ తాజాగా చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో ఒక ఫోటో షేర్ చేస్తూ ‘టౌన్‌లో యమ్మీ వెజ్ ఫుడ్ ఆస్వాదిస్తున్నాను’ అనే క్యాప్షన్ జోడించింది. ఆ స్టోరీలో రేణు దేశాయ్ ముద్దుగా రెడీ అయిన లుక్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు వావ్ యమ్మీ ఫుడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నటీనటులు శివాజీ, నవదీప్, రాహుల్ రామకృష్ణ, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘దండోరా’. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా, డైరెక్టర్ మురళీ కాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2025 DECలో రిలీజై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ మూవీ భారీ విజయం అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు రూ.1300కోట్లకుపైగా వసూలు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తాజాగా ఈ సినిమా OTTపై అప్‌డేట్ వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తమిళ హీరో విజయ్ దళపతి ‘జన నాయగన్’ మూవీ సెన్సార్ వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేషన్ జారీ చేయడంపై ఇటీవల మద్రాసు హైకోర్టు స్టే విధించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ చిత్ర బృందం సుప్రీకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. ఈ పిటిషన్‌పై రేపు విచారణ జరపనుంది.
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటివరకు 21 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. గతంలో ప్రభాస్ ‘బాహుబలి 2′($20.7M) పేరుతో ఉన్న రికార్డును ఈ సినిమా బద్దలుకొట్టింది. దీంతో నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా నిలిచింది.
పల్లీలలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. మలబద్ధకాన్ని నివారించి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఎముకలను దృఢంగా మారుస్తాయి. జుట్టు, చర్మ సమస్యలను దూరం చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి.
తాను చేసిన ఐటమ్ సాంగ్స్‌పై వచ్చిన ట్రోల్స్‌పై నటి మలైకా అరోరా స్పందించింది. డ్యాన్స్ చేయడం గొప్ప అదృష్టమని, ఆ పాటల వల్ల తనకు శక్తి వస్తుందని చెప్పింది. తాను సరైన మార్గంలో ప్రయాణిస్తున్నానని, తాను చేసిన ఐటెం సాంగ్స్ విషయంలో ఎవరికీ సారీ చెప్పాల్సిన అవసరం లేదని తెలిపింది. మహిళలు కూడా ఇలాగే హుషారుగా ఉంటే తనకు దానికి మించిన ఆనందం మరొకటి ఉండదని పేర్కొంది.
జగపతి బాబు ప్రధాన పాత్రలో దర్శకుడు సురేష్ కృష్ణ తెరకెక్కించిన డివోషనల్ డ్రామా ‘అనంత’. నేరుగా ఈ సినిమా OTTలో రిలీజ్ అయింది. జియో హాట్‌స్టార్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమాలో సుహాస్ మణిరత్నం, వైజి మహేంద్రన్ కీలక పాత్రలు పోషించారు.
మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ కలయికలో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’. జనవరి 12న రిలీజైన మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్ జరుపుకున్నారు. దర్శకనిర్మాతలతో పాటు చిరంజీవి, వెంకటేష్, రామ్ చరణ్ ఈ వేడుకలో పాల్గొని కేక్ కట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి.
ఆర్థిక కష్టాలతో సతమతవుతున్న జమీందారీ వారసుడు రాజు(నవీన్ పోలిశెట్టి ).. డబ్బుకోసం జమీందారీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం, ప్రెసిడెంట్ అవ్వడం.. ఆ తర్వాత అతనికి ఎదురయ్యే అనుభవాలే ‘అనగనగా ఒకరాజు’ సినిమా కథ. నవీన్ కామెడీ టైమింగ్ బాగుంది. హీరోయిన్ నటన, ఫస్టాఫ్ మూవీకి ప్లస్. కొత్తదనం లేని కథ, ఊహకు తగ్గట్టు సాగే కథనం మైనస్. రేటింగ్:2.75/5.
కన్నడ యష్ నటిస్తోన్న ‘టాక్సిక్’ టీజర్‌పై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ టీజర్‌లోని ఇంటిమేట్ సన్నివేశాలపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ సీన్‌లో నటించిన బీట్రీజ్ టోఫెన్ బాఖ్ తన ఇన్‌స్టా అకౌంట్‌ను డిలీట్ చేసింది. జనవరి 13 వరకు యాక్టివ్‌గా ఉన్న ఆమె అకౌంట్ ప్రస్తుతం కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.