• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

గోపీచంద్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం

గోపీచంద్ 34వ చిత్రం షూటింగ్ ఇవాళ ఘనంగా ప్రారంభమైంది. పాపులర్ స్టంట్ మాస్టర్ వీ వెంకట్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అనార్కలి నాజర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘యాత్ర’ ఫేమ్ 70ఎమ్ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతమందిస్తున్నాడు.

June 1, 2026 / 05:33 PM IST

‘పుష్ప-3’పై జగపతిబాబు క్రేజీ అప్‌డేట్.!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రాబోతున్న ‘పుష్ప-3’పై నటుడు జగపతిబాబు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. చాలా మంది ఊహించిన దానికంటే ముందే మూడో భాగం పనులు ప్రారంభమవుతాయన్నాడు. రెండో భాగంలో ఎడిటింగ్ వల్ల తన సీన్స్ తగ్గాయని, అయితే సపుష్ప-3సలో తన పాత్రకు మరింత ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మాస్ రోల్ చేయనున్నట్లు టాక్.

June 1, 2026 / 05:18 PM IST

నాని ‘పారడైజ్’లో మెగాస్టార్!

నాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘పారడైజ్’ గురించిన ఒక సెన్సేషనల్ న్యూస్ ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. లోకేష్ కనగరాజ్ ‘LCU’ తరహాలోనే శ్రీకాంత్ ఓదెల ఒక భారీ సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేస్తున్నారట. ఈ సినిమా క్లైమాక్స్‌లో మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే తదుపరి చిత్రానికి సాలిడ్ లీడ్ ఇవ్వబోతున్నట్లు టాక్.

June 1, 2026 / 04:47 PM IST

దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి వరల్డ్ రికార్డ్!

ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ జన్మదినోత్సవ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 38 చిత్రాలకు స్వయంగా సంగీత దర్శకత్వం వహించిన ఏకైక దర్శకుడిగా ఆయన ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్’ నుంచి వరల్డ్ రికార్డ్ పత్రాన్ని అందుకున్నాడు. అరుదైన గౌరవం సాధించిన ఆయన ప్రస్తుతం ‘వేదవ్యాస్’ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు.

June 1, 2026 / 04:37 PM IST

ఏపీలో ‘పెద్ది’ ప్రీమియర్‌ టికెట్స్‌ ఓపెన్‌

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పెద్ది’. జూన్ 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ సందర్భంగా జూన్‌ 3న ఏపీలో ప్రీమియర్స్‌కు అనుమతి లభించింది. ప్రీమియర్స్‌కు సంబంధించి ఈరోజు బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. 

June 1, 2026 / 04:30 PM IST

అల్లు అర్జున్ ‘రాకా’లో మలయాళ నటి!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘రాకా’లో మలయాళ నటి ఫెమినా జార్జ్ భాగమయ్యింది. ఓ ప్రమోషన్‌లో ఆమె ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించి. తాను అల్లు అర్జున్‌కు పెద్ద ఫ్యాన్ అని, ఇంతటి క్రేజీ ప్రాజెక్ట్‌లో చిన్న పాత్ర అయినా నటించడం కల నిజమవడమేనని ఆనందం వ్యక్తం చేసింది. ఫెమినా రాకతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

June 1, 2026 / 03:45 PM IST

పర్పుల్ శారీలో మెరిసిపోతున్న దివ్య గణేశన్

తమిళ బిగ్ బాస్ సీజన్ 9 విజేత దివ్య గణేశన్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ లైట్ పర్పుల్ కలర్ శారీ, స్టైలిష్ బ్లౌజ్ ధరించి విరబోసిన కురులతో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. రెడ్ బ్యాండ్, సన్నటి నెక్లెస్‌తో ట్రెడిషనల్ అండ్ క్యూట్ లుక్స్‌తో మెరిసిపోతున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

June 1, 2026 / 03:16 PM IST

భర్తని కనిపించకుండా దాచేసిన రష్మిక.!

టోక్యోలో జరిగిన యానిమే అవార్డ్స్‌లో పాల్గొన్న నటి రష్మిక మందన్న, అనంతరం తన జపాన్ పర్యటన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అక్కడ ఆమె సాంప్రదాయ జపనీస్ దుస్తులు ధరించి ఆకట్టుకుంది. అయితే, ఈ ఫోటోల్లో ఆమె భర్త విజయ్ దేవరకొండను  కనిపించకుండా దాచేసింది. దీంతో అభిమానులు “ఆ వ్యక్తి ఎవరో మాకు తెలుసు” అంటూ నెట్టింట జోరుగా కామెంట్లు పెడుతున్నారు.

June 1, 2026 / 02:34 PM IST

పెరిగిన రష్మిక రేంజ్ 

హీరోయిన్ రష్మిక పెళ్లి తర్వాత బ్రేక్ తీసుకోకుండా ఫుల్ బిజీగా మారిపోయింది. అలాగే, రెమ్యునరేషన్ కూడా పెంచేసింది. తెలుగులో ఒక్కో సినిమాకూ రూ.8-10 కోట్ల మధ్య తీసుకుంటుంది. ఇక బాలీవుడ్‌లో మాత్రం దీనికి రెట్టింపు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈనెల 19న ఆమె నటించిన ‘కాక్‌టెయిల్ 2’ కోసం ఏకంగా రూ.15 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది.

June 1, 2026 / 01:49 PM IST

ఒకే ఫ్రేమ్‌లో నాని, మెగాస్టార్?

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నానితో తెరకెక్కిస్తున్న ‘పారడైజ్’ చిత్రానికి, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే సినిమాకు మధ్య క్రేజీ ఇంటర్‌లింక్ ఉందనే టాక్ నడుస్తోంది. ‘పారడైజ్’ క్లైమాక్స్‌లోనే చిరు సినిమాకు సంబంధించిన లీడ్ కనిపించనుందట. అంతేకాకుండా ఈ చిత్రానికి ప్రీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

June 1, 2026 / 11:58 AM IST

‘ఇరుముడి’ క్రేజీ అప్‌డేట్.. గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

హీరో రవితేజ ‘ఇరుముడి’ చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా గ్లింప్స్‌ను “ది హార్ట్ ఆఫ్ ఇరుముడి” పేరుతో ఈనెల 3న రిలీజ్ చేయనున్నారు. శివ నిర్వాణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్. ఎమోషనల్ పోస్టర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్, టీ-సిరీస్ నిర్మిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

June 1, 2026 / 11:47 AM IST

‘విమర్శించండి.. కానీ వ్యక్తిగత విషయాలొద్దు’

నటీమణులపై SMలో జరిగే వ్యక్తిగత దాడులపై హీరోయిన్ త్రిప్తి దిమ్రీ స్పందించింది. ఐశ్వర్య లేదా అనన్య అయినా వారి సక్సెస్ వెనుక ఎంతో కష్టం ఉందని గుర్తు చేసింది. ప్రేక్షకులు డబ్బులు పెట్టి సినిమా చూస్తారు కాబట్టి నచ్చకపోతే విమర్శించే హక్కు వారికి ఉంటుందని, అయితే నటనను వదిలేసి వ్యక్తిగత విషయాలను ముడిపెట్టి ట్రోల్ చేయడం చికాకు కలిగిస్తుందని త్రిప్తి పేర్కొంది.

June 1, 2026 / 11:10 AM IST

‘ట్రెండ్స్, అవార్డుల కోసం నేను సినిమాలు చేయను’

సినీ రంగంలో 20 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న హీరోయిన్ అదా శర్మ తన పాత్రల ఎంపికపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. స్టూడెంట్ నుంచి కిల్లర్ వరకు ఎన్నో విభిన్న రోల్స్ చేశానని, కథను మనస్ఫూర్తిగా నమ్మితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తానని చెప్పింది. అవార్డులు, ఇన్‌స్టాగ్రామ్ ట్రెండ్స్ కోసం కాకుండా.. ఆ పాత్ర తనను ఎంతవరకు ప్రభావితం చేస్తుందనే దానిపైనే నిర్ణయం తీసుకుంటానని అదా స్పష్టం చేసింది.

June 1, 2026 / 10:48 AM IST

ట్రోలర్స్‌కు సీనియర్ నటి స్ట్రాంగ్ కౌంటర్

సోషల్ మీడియాలో నటీమణులపై వస్తున్న ట్రోల్స్‌పై బాలీవుడ్ సీనియర్ నటి మాధురి దీక్షిత్ తీవ్రంగా మండిపడింది. ముఖ్యంగా కేన్స్ వేడుకల్లో ఐశ్వర్యరాయ్ రూపం, దుస్తులపై కామెంట్లు చేసేవారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 20 ఏళ్లుగా దేశానికి గర్వకారణంగా నిలిచిన ఐశ్వర్య స్థాయిని ఇలాంటి వ్యాఖ్యలు తగ్గించలేవని పేర్కొంది. రూపం చూసి విలువ కట్టడం యువతకు తప్పుడు సందేశం ఇవ్వడమేనని చెప్పింది.

June 1, 2026 / 10:25 AM IST

ట్రోలర్స్ చేతిలో ముక్కలైన దర్శకుడి కల

ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేసే ఆన్‌లైన్ నెగెటివిటీ వల్లే తన ‘LIK’ సినిమా బాక్సాఫీస్ వద్ద దెబ్బతిందని డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ఆవేదన వ్యక్తం చేశాడు. పరిశ్రమలో పెద్దల మద్దతు లేని సినిమాల తలరాతను ఈ తప్పుడు రివ్యూలు మార్చేస్తాయని, ఇవి దర్శకుల కలలను ముక్కలు చేస్తాయని మండిపడ్డాడు. మంచి ఓపెనింగ్స్ వచ్చినా కథ ఇలా మారిపోవడాన్ని తాను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని అన్నాడు.

June 1, 2026 / 10:04 AM IST