‘రాజు వెడ్స్ రాంబాయి’ తర్వాత వేణు ఊడుగుల, సంధ్యా భాను చల్లా నిర్మాణంలో మరో సందేశాత్మక చిత్రం రాబోతోంది. మధుకర్ రెడ్డి కొమిరెడ్డి దర్శకత్వంలో యదార్థ గాథ ఆధారంగా ఇది తెరకెక్కుతోంది. అన్నదమ్ముల గొడవలు ఒక ఊరి రాతను ఎలా మార్చాయనే కథాంశంతో ఈ మూవీ రాబోతుంది. ‘ఇల్లు, ఊరు ఓడిపోయిన కథ’ అంటూ మేకర్స్ భావోద్వేగ నోట్ విడుదల చేశారు. ఈ కుటుంబ కథా మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
తమిళనాడు సీఎం విజయ్‌తో రిలేషన్ రూమర్లపై నటి త్రిష పరోక్షంగా స్పందించింది. తన పెంపుడు కుక్క ఫొటోను షేర్ చేస్తూ.. ‘నా వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడానికి దీన్ని మాత్రమే అనుమతిస్తాను’ అంటూ కౌంటర్ ఇచ్చింది. తన బర్త్‌డే, విజయ్ ఎన్నికల విజయం, తన సినిమా ‘కరుప్పు’ రూ.348 కోట్ల వసూళ్లతో ఈ మే నెల తనకు ఎంతో మ్యాజికల్‌గా మారిందని త్రిష సంతోషం వ్యక్తం చేసింది.
‘యుఫోరియా’పై దర్శకుడు గుణశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఇది A సర్టిఫికెట్ సినిమా అయినా, తల్లిదండ్రులతో కలిసి చూడాల్సిన చిత్రమని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. నా కెరీర్లోనే ఇలాంటి గొప్ప అభినందనలు ఎప్పుడూ అందుకోలేదు’ అని తెలిపాడు. కథనే నమ్ముకుని, పాత్రల పరంగా నటీనటులను ఎంచుకుని తీసిన సినిమా ఇదేనని, ఈ విజయం తనకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందన్నాడు.
‘బైసన్’తో నిరాశ చెందిన ధృవ్ విక్రమ్ తాజాగా తనకు ఒక క్రేజీ ఆఫర్ దక్కినట్లు ఇన్‌స్టా ద్వారా వెల్లడించాడు. దీంతో సందీప్ కిషన్ హీరోగా రూపుదిద్దుకుంటున్న ‘సిగ్మా’ మూవీలో ధృవ్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు గట్టిగా చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఏంటనేదానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
స్టార్ హీరోయిన్ త్రిష SMలో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. తాను ఎంతో ఇష్టపడే ‘మ్యాజికల్ మే’లో జరిగిన తన బర్త్‌డే ఫొటోలను షేర్ చేస్తూ.. ’40 ఏళ్ల వయసులో 25 ఏళ్ల అమ్మాయిలా కనిపించడం గొప్ప కాదు.. 20 ఏళ్ల వయసులో ఉన్న యువతులు 40 ఏళ్ల ప్రాయాన్ని చూసి భయపడకుండా, ఆ వయసు కోసం ఎదురుచూసేలా చేయడమే నా లక్ష్యం. ఈ జ్ఞాపకాలు నాకు జీవితాంతం ప్రత్యేకం’ అని రాసుకొచ్చింది.
అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘రాకా’. ప్రస్తుతం ముంబైలోని ప్రత్యేక సెట్‌లో బన్నీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాడట. సినిమాలో యాక్షన్‌తో పాటు ఎమోషన్స్‌కు కూడా పెద్దపీట వేసినట్లు టాక్. ఎక్కువ పాత్రలతో సాగే ఈ చిత్రంలో, వచ్చే షెడ్యూల్ నుంచి ఓ ఎమోషనల్ రోల్ కోసం మరో యంగ్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
తమిళనాడు రాజకీయాల్లోకి మరోస్టార్ హీరో ధనుష్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ధనుష్ తండ్రి, సీనియర్ దర్శకుడు కస్తూరి రాజా మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు, అది వారి వ్యక్తిగత ఇష్టం. ఎవరికీ ప్రజలకు మంచి చేయాలని ఉంటుందో వారంతా రాజకీయాల్లోకి రావాలి. భవిష్యత్తులో ధనుష్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టవచ్చు. అలాగే నా మనవళ్లు కూడా రావచ్చు’ అని చెప్పుకొచ్చాడు.
‘పెద్ది’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ(మున్నా త్రిపాఠి) తెలుగులో మాట్లాడి ప్రేక్షకులను అలరించాడు. ‘విజయవాడ ప్రజలకు నమస్కరిస్తున్నా. మీరంతా నా కుటుంబం’ అని అన్నాడు. తనకు టాలీవుడ్‌లో అవకాశం ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబుకు ధన్యవాదాలు చెప్పాడు. ఈ సందర్భంగా మీర్జాపూర్‌లోని ఫేమస్ డైలాగ్ చెబుతాననగా.. చరణ్ వద్దని సరదాగా హెచ్చరించాడు.
ప్రముఖ నిర్మాత అగర్వాల్ బాంబే సివిల్ కోర్టును ఆశ్రయించాడు. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌పై FWICE విధించిన నాన్ కో-ఆపరేషన్ ఆదేశాలను వ్యతిరేకిస్తూ పిటిషన్ వేశాడు. చలనచిత్ర పరిశ్రమలో ఎవరిపైనా నిషేధాలు విధించే హక్కు ఏ సంస్థకూ లేదని స్పష్టం చేశాడు. ఇలాంటి చర్యలు సృజనాత్మక స్వేచ్ఛను, జీవనోపాధిని దెబ్బతీస్తాయని, వివాదాలను చట్టబద్ధంగానే పరిష్కరించాలని డిమాండ్ చేశాడు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. జూన్ 4న విడుదల కానున్న ఈ మూవీ టికెట్ బుకింగ్స్‌లో రికార్డు సృష్టించింది. గత 24 గంటల్లోనే, బుక్‌మైషోలో సుమారు 70వేల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. గంటకు 1.03వేల టిక్కెట్లతో ఈ సినిమా ఇప్పటికే ఆ ప్లాట్‌ఫామ్ యొక్క గంటవారీ ట్రెండ్స్‌లో టాప్‌లో ఉంది.
యంగ్ హీరో అఖిల్, మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ఈ సినిమా జూన్ 26న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో వచ్చే వారం నుంచి ఈ సినిమా ప్రమోషన్స్‌లో అఖిల్ పాల్గొనబోతున్నాడు. ఇంటర్వ్యూలతో పాటు ప్రత్యేకంగా టూర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమా రాయలసీమ యాసలో సాగనుంది. ప్రధాన పాత్రల సంభాషణలు యాసలో ఉంటాయట.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన OG మూవీలోని హీరోయిన్ ప్రియాంకా మోహన్‌కు అరుదైన గౌరవం దక్కింది. దక్షిణ కొరియా టూరిజానికి గౌరవ అంబాసిడర్‌గా నియామకమయ్యారు. కొరియా సంస్కృతి, సాంప్రదాయాలు తనకు స్ఫూర్తినిస్తాయని.. ఇప్పుడు ఇందులో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. కాగా, ఇటీవల ప్రియాంక నటించిన మేడిన్ కొరియా మూవీ కూడా ఆ దేశ నేపథ్యంలో తీసిన సినిమా కావడం గమనార్హం.
పెద్ది కథ విని చరణ్ ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా ఒప్పుకున్నారని దర్శకుడు బుచ్చిబాబు చెప్పారు. ‘నిజాయతీగా ‘పెద్ది’లాంటి కథ రాస్తే, అంతే నిజాయతీ గల హీరో అవకాశమిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. క్లైమాక్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు. పెద్ది’ అంటే ఆటంకం వస్తే ఆగిపోయే కుర్రాడి కథ కాదు. ముందుకు సాగిపోయే కుర్రాడి కథ’ అని అన్నారు.
విజయవాడలో నిర్వహించిన పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో రామ్ చరణ్ పాల్గొన్నారు. ‘ఇలాంటి కథ కోసం కష్టపడకపోతే ఇంకా దేనికి కష్టపడతాం. ఇష్టం, ప్రేమతో ఈ మూవీ చేశా. అభిమానుల కోసం చేతులు విరగొట్టుకోవడమే కాదు. రక్తమైనా చిందిస్తా. నాన్న, కళ్యాణ్ బాబాయ్ కోసం ఎంతైనా కష్టపడతా. నాకు తెలిసిందల్లా సినిమాయే. నేను చనిపోయే వరకూ మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తా’ అని అన్నారు.