బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన ‘తు మేరీ మెయిన్ తేరా మేన్ తేరా తు మేరీ’ మూవీ ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. దీంతో నిర్మాతలు నష్టాలు చవి చూశారు. ఈ నేపథ్యంలో తాను తీసుకున్న రెమ్యూనరేషన్ నుంచి కార్తీక్ రూ.15 కోట్లు వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమా కోసం అతను దాదాపు రూ.50కోట్లు పారితోషకం తీసుకున్నట్లు సమాచారం.
జూ.ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ భాగమైనట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ అనిల్ కపూర్ పోస్ట్ పెట్టాడు. ఈ మూవీలో తాను నటిస్తున్నట్లు వెల్లడించారు. NTRతో రెండోసారి నటిస్తున్నానని చెప్పాడు. కాగా, ‘వార్ 2’లో వీరిద్దరూ నటించారు.
బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న సినిమా ‘ఏక్ దిన్’. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా పోస్టర్‌పై విమర్శలు వస్తున్నాయి. 2016లో వచ్చిన థాయ్ మూవీ ‘వన్ డే’ను పోలి ఉందని.. మూవీని కాపీ చేశారని పలువురు విమర్శలు చేస్తున్నారు. పేరు దగ్గర నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వరకూ అన్నీ ఒకేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ నటించిన ‘శంబాల’ మూవీ మంచి హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా OTT డేట్ ఫిక్స్ అయింది. ఆహాలో జనవరి 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారు ఒకరోజు ముందుగా చూసే అవకాశం ఉందని ఆహా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కించాడు.
బాలీవుడ్‌లో నటి సాయి పల్లవి ‘రామాయణ’, ‘ఏక్ దిన్’ మూవీలు చేస్తోంది. తాజాగా ‘ఏక్ దిన్’ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. 2026 మే 1న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపారు. జనవరి 16న ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇక ఈ సినిమాను ఆమిర్ ఖాన్ నిర్మిస్తుండగా.. ఆయన కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. సునీల్ పాండే దర్శకత్వం వహి...
‘పరాశక్తి’ మూవీపై వస్తోన్న ట్రోల్స్‌పై తమిళ హీరో శివకార్తికేయన్ స్పందించాడు. కొంతమంది అభిమానులు దీన్ని పెద్ద విషయంగా చూస్తున్నారని, తన దృష్టిలో ఇది అసలు సమస్యే కాదని అన్నాడు. విజయ్ దళపతి తనకు సోదరుడితో సమానమని, ఎప్పటికీ తాము ఇలానే ఉంటామని చెప్పాడు. ఇంతకుమించి ఈ అంశంపై మాట్లాడడానికి ఏం లేదని తెలిపాడు.
తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన హిట్ సినిమా ‘సర్దార్’కు సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ రాబోతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా మేకర్స్.. విషెస్ చెప్పారు. అలాగే ఈ సినిమాపై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. 2026లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. ఇక ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై రాబోతున్న ఈ చిత్రాన్ని P.S మిత్రన్ తెరకెక్కిస్తున్నాడు.
తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ & టైటిల్ రివీల్‌కు డేట్ ఫిక్స్ అయింది. జనవరి 16న ఉదయం 11 గంటలకు టైటిల్‌ను ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ మూవీలో సంయుక్త, టబు, విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు.
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒకరాజు’. జనవరి 14న రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఫస్ట్ డే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.22 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా.. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు.
తమిళ హీరో విజయ్ దళపతి ‘జన నాయగన్’ మూవీకి సుప్రీకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సెన్సార్ సర్టిఫికేషన్ జారీ చేయడంపై ఇటీవల మద్రాసు హైకోర్టు స్టే విధించిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మేకర్స్ సుప్రీకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు వెళ్లాల్సిందిగా సూచించింది.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. జనవరి 12న రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ మూవీలో వెంకటేష్ కీలక పాత్ర పోషించాడు. అయితే మెగా విక్టరీ మాస్ సాంగ్‌కు చిరు, వెంకీ కలిసి అదిరిపోయే డ్యాన్స్‌తో అలరించారు. తాజాగా ఆ పాటకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ SMలో వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.152కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమాలో నయనతార, వెంకటేష్ తదితరులు కీలక పాత్రలు పోషించగా.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు.
తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు సంక్రాంతి పండుగ.. మరోవైపు సినిమాల జాతర నెలకొంది. రెబల్ స్టార్ ప్రభాస్ ‘ది రాజా సాబ్’, మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారీ’ సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నాయి. మీరు ఏ సినిమా చూశారు. ఈ సంక్రాంతికి గెలి...
‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీతో మెగాస్టార్ చిరంజీవి మంచి హిట్ అందుకున్నారు. తర్వాత చిరు తన ఫోకస్ మొత్తాన్ని ‘విశ్వంభర’ మూవీపై పెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దర్శకుడు బాబీతో చిరు చేయాల్సిన ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనుల కారణంగా మరింత ఆలస్యంగా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. ఇక ‘విశ్వంభర’ 2026 జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.