• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

రవితేజ నెక్స్ట్ మూవీ ఫిక్స్!

మాస్ రాజా రవితేజ తదుపరి సినిమాల లైన్ అప్ ఫిక్స్ అయింది. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ‘ఇరుముడి’ పూర్తి కాగానే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత దిల్ రాజు నిర్మాణంలో, యువ డైరెక్టర్ హసిత్ గోలి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం.

June 1, 2026 / 09:20 AM IST

శింబు సరసన ప్రియాంక?

‘ఓజీ’ బ్యూటీ ప్రియాంక మోహన్ సరికొత్త కాంబోలో భాగం కానుంది. శింబు హీరోగా, వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘అరసన్’ చిత్రంలో కథానాయికగా ఆమె పేరును పరిశీలిస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు తుది దశకు చేరాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

June 1, 2026 / 08:07 AM IST

వాళ్లకి కావల్సింది వసూళ్లు కాదు: అదా శర్మ

హీరోయిన్ అదా శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాక్సాఫీస్ వసూళ్లే ప్రధాన అంశంగా మారాయని, కానీ తన దృష్టిలో విజయానికి అర్థం వేరే ఉందని తెలిపింది. ‘మీ సినిమా రూ.375కోట్లు వసూలు చేసింది అని చెప్పడానికి బదులుగా.. ఆ మూవీలో మీరు ఏడుస్తున్నప్పుడు నేను కూడా ఏడ్చాను, మిమ్మల్ని ఆ పాత్రలో చూసి నాకు భయం వేసింది’ అని ప్రేక్షకులు చెప్తే కష్టానికి ఫలితం దక్కినట్లే అని చెప్పుకొచ్చింది.

June 1, 2026 / 07:35 AM IST

జూన్ 01: టీవీలలో సినిమాలు

స్టార్ మా: కార్తీకదీపం(9AM); జీ తెలుగు: సంతోషం(9AM); ఈటీవీ: సకుటుంబ సపరివార సమేతం(9AM); జెమిని: భీష్మ(9AM); స్టార్‌మా మూవీస్: రక్త తిలకం(7AM), అంబాజీపేట మ్యారేజి బ్యాండు(9PM), s/o సత్యమూర్తి(12PM), ప్రతి రోజూ పండగే(3PM), ధమాకా(6PM), ది వారియర్(9PM); జీ సినిమాలు: పెళ్లాం ఊరెళ్లితే(7AM), ఆలస్యం అమృతం(9AM),బలాదూర్(12PM), చినబాబు(3PM), లింగ(6PM), ధీరుడు(9PM).

June 1, 2026 / 12:36 AM IST

‘పెద్ది’ టికెట్ ధరల పెంపుపై సస్పెన్స్

నైజాంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ టికెట్ల రెట్ల పెంపుపై సందిగ్ధత నెలకొంది. అయితే టికెట్ల పెంపుపై హైకోర్టులో పిటిషన్ వేసి మళ్లీ విత్‌డ్రా చేసుకుంది. పరిస్థితి చూస్తుంటే హైక్స్ లేకుండానే రిలీజ్ అయ్యేలా ఉంది. ప్రస్తుతం సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 175, మల్లిప్లెక్స్‌ల్లో రూ. 295గా కొనసాగుతోంది. కాగా, జూన్ 4న ఈ చిత్రం విడుదల కానుంది.

May 31, 2026 / 05:28 PM IST

వైట్ డ్రెస్‌లో సెగలు రేపుతున్న యుక్తి తరేజా

‘రంగబలి’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ యుక్తి తరేజా సోషల్ మీడియాలో సరికొత్త గ్లామర్ ఫోటోలతో సందడి చేస్తోంది. తాజాగా వైట్ కలర్ టైట్ డ్రెస్‌లో తన నడుమందాలు హైలెట్ అయ్యేలా ఈ బ్యూటీ ఇచ్చిన ఫోజులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. రింగుల జుట్టు, మెడలో చిన్న చైన్, క్యూట్ స్మైల్‌తో మెరిసిపోతున్న యుక్తి లేటెస్ట్ ఫోటోలు SMలో తెగ వైరల్ అవుతున్నాయి.

May 31, 2026 / 05:12 PM IST

సాయంత్రం సర్ప్రైజ్ అప్‌డేట్!

సమంత కథానాయికగా, నిర్మాతగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మా ఇంటి బంగారం’. రాజ్ నిడిమోరు కథను అందించిన ఈ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా నేడు సాయంత్రం 6 గంటలకు అభిమానుల కోసం ఒక క్రేజీ సర్ప్రైజ్ అప్‌డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో నెటిజన్లలో ఆసక్తి నెలకొంది.

May 31, 2026 / 04:57 PM IST

హిందీలో సూర్య ‘కరుప్పు’ విడుదల?

కోలీవుడ్ స్టార్ సూర్య, త్రిష జంటగా RJ బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ‘కరుప్పు’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. మే 15న తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం రెండు వారాలు దాటినా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సూపర్ సక్సెస్ ఉత్సాహంతో, మేకర్స్ ఈ చిత్రాన్ని త్వరలోనే హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

May 31, 2026 / 04:43 PM IST

చిరంజీవి-బాబి చిత్రంలో మరో హీరో?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబి కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మెగా 158’ గురించిన ఒక ఆసక్తికరమైన వార్త టాలీవుడ్‌లో వైరల్ అవుతోంది. ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఒక కీలక పాత్ర కోసం నారా రోహిత్‌ను మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో చిరు మాస్ లుక్‌లో కనిపించనున్నారు. 

May 31, 2026 / 03:58 PM IST

‘ఇద్దరమ్మాయిలతో’ మూవీకి 13 ఏళ్లు

అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఇద్దరమ్మాయిలతో’ నేటికి విజయవంతంగా 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రంలో అమలాపాల్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే సంగీతం, బన్నీ అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు, అలీ కామెడీ ఈ సినిమాను సూపర్ హిట్ చేశాయి.

May 31, 2026 / 02:24 PM IST

‘జన నాయగన్‌’ దర్శకుడు కీలక వ్యాఖ్యలు

విజయ్ నటించిన ‘జన నాయగన్‌’ విడుదల ఆలస్యంపై దర్శకుడు హెచ్.వినోద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘సినిమా రిలీజ్ మన చేతుల్లో లేదు. దీని వెనుక ఉన్న నిజాలు మాట్లాడే ధైర్యం నాకు లేదు, టెలికాస్ట్ చేసే ధైర్యం మీకు లేదు’ అని అనడం నెట్టింట చర్చనీయాంశమైంది. సెన్సార్ వివాదంతో కోర్టుకు చేరిన ఈ చిత్రం సంక్రాంతికే రావాల్సింది. విజయ్ సీఎం అయినా వివాదం కొలిక్కి రాకపోవడం గమనార్హం.

May 31, 2026 / 12:27 PM IST

మీరే నా హీరో నాన్న: మహేష్ బాబు

సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు మహేష్ బాబు సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యాడు. తండ్రితో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఓ ఫొటోను షేర్ చేశాడు. ‘ఎప్పటికీ మీరే నా హీరో.. హ్యాపీ బర్త్‌డే నాన్న’ అని ఆయన ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ కృష్ణ, మహేష్ కలిసి నటించిన మూవీ సీన్లను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ‘వారణాసి’ సినిమాలో నటిస్తున్నాడు.

May 31, 2026 / 11:33 AM IST

హీరోలకు ఉండే ఎంట్రీ సీన్: జాన్వీకపూర్

‘పెద్ది’ చిత్రంలో ‘అచ్చియ్యమ్మ’గా నటిస్తున్న జాన్వీ కపూర్ తన పాత్ర విశేషాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ‘అందరినీ శాసించే, ఆధిపత్యం చెలాయించే భిన్నమైన, బోల్డ్ పాత్ర ఇది. చిన్న పట్టణాల అమ్మాయిల్లో ఉండే బిడియం ఇందులో ఉండదు. సాధారణంగా హీరోలకు ఉండే భారీ ఎంట్రీ సీన్ ఈ సినిమాలో నా పాత్రకు ఉంటుంది. దర్శకుడు కథ చెప్పగానే నాకు బాగా నచ్చి, ఎంతో ఉత్సాహంగా ఈ పాత్ర చేశాను’...

May 31, 2026 / 09:39 AM IST

మరో OTTలో వరలక్ష్మి సైకలాజికల్ థ్రిల్లర్

వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వంలో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘ఎస్‌.సరస్వతి’. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ఉన్న ఈ చిత్రం జూన్ 4 నుండి ఈటీవీ విన్ OTTలోకి రానుంది. జీవా, ప్రకాష్ రాజ్, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. కూతురు సరస్వతి కిడ్నాప్, హత్యపై సాక్ష్యాలు లేవని పోలీసులు, కోర్టు కేసు కొట్టేయడంతో లక్ష్మి తన కూతురికి ఎలా న్యాయం చేసిందనే అంశంతో ఈ కథ తెరకెక్కింది.

May 31, 2026 / 08:16 AM IST

అజిత్ ఇంటికి సీఎం విజయ్, త్రిష

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి మోహిని మణి మృతి చెందడంతో తమిళనాడు సీఎం తలపతి విజయ్, త్రిష.. అజిత్ నివాసానికి వెళ్లారు. మాతృవియోగంతో దుఃఖంలో ఉన్న అజిత్‌ను వారు స్వయంగా కలిసి ఓదార్చారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

May 31, 2026 / 12:45 AM IST