విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా వారి పెళ్లికి సంబంధించిన సరికొత్త ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాయల్ డోలీలో రష్మిక ఎంట్రీ ఇవ్వగా, చేతిలో ఖడ్గంతో విజయ్ రాజసం ఉట్టిపడేలా కనిపించిన ఈ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఇక మార్చి 4న హైదరాబాద్‌లో జరగబోయే వారి గ్రాండ్ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా తరలిరానున్నారు.