• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

ఆ మెసేజ్ చూసి నేను ఏడ్చాను: నరేష్

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ తాజాగా ‘హే బల్‌వంత్’ అనే మూవీలో నటించాడు. ఈ మూవీ ఈరోజు విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కొడుకు నవీన్ ఒకరోజు రాత్రి తనకు మెసేజ్ చేసినట్లు తెలిపాడు. అందులో ‘నా చైల్డ్ హుడ్ ఎంతో బాగుండేది నాన్న. నీ ప్రేమను మిస్ అవుతున్నా’ అని రాసి ఉందన్నాడు. ఆ మెసేజ్ చూడగానే తాను ఎంతో ఏడ్చినట్లు చెప్పుకొచ్చాడు.

February 20, 2026 / 03:59 AM IST

OTTలోకి వచ్చేసిన కొత్త మూవీ

మలయాళ నటులు అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, విషాక్ నాయర్ కలిసి నటించిన మూవీ ‘చథా పచ్చ’. FEB 13న రిలీజైన ఈ మూవీ OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. WWE తరహా రెజ్లింగ్ క్లబ్‌ను స్థాపించే ముగ్గురు సోదరుల కథతో ఈ మూవీ దర్శకుడు అద్వైత్ నాయర్ తెరకెక్కించాడు.

February 19, 2026 / 10:56 AM IST

అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది: శ్రీవిష్ణు

శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘విష్ణు విన్యాసం’ ఈనెల 28న విడుదల కానుంది. తాజాగా జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని, అందరినీ అలరిస్తుందని అన్నాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ యువతకు బాగా నచ్చుతుందని, థియేటర్లలో అందరూ హాయిగా నవ్వుకుంటారని ధీమా వ్యక్తం చేశాడు.

February 19, 2026 / 09:56 AM IST

‘వారణాసి నా కెరీర్‌ను నిర్వచించే సినిమా’

దర్శక ధీరుడు రాజమౌళి, మహేశ్‌ బాబు కాంబోలో రానున్న భారీ చిత్రం ‘వారణాసి’ గురించి ప్రియాంక చోప్రా ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇందులో తను ‘మందాకిని’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించింది. ఈ సినిమా తన సినీ ప్రయాణాన్ని మార్చేస్తుందని, తన కెరీర్‌ను నిర్వచించే చిత్రమిదని ఆమె పేర్కొంది.

February 19, 2026 / 08:28 AM IST