తమిళ హీరో సూర్య ప్రధాన పాత్రలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2026, ఆగస్టు 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో మమితా బైజు కథానాయికగా నటిస్తోంది.
తమిళ హీరో సూర్య ప్రధాన పాత్రలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయ్యింది. 2026, ఆగస్టు 14న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమాలో మమితా బైజు కథానాయికగా నటిస్తుండగా.. GV ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్‌ల క్రేజీ థ్రిల్లర్ సీక్వెల్ ‘దృశ్యం 3’. గత రెండు భాగాల భారీ విజయాల తర్వాత వచ్చిన ఈ మూడో భాగం థియేటర్లలో బ్లాస్ట్‌లా నిలిచింది. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఊహించని వసూళ్లను రాబడుతోంది. వరల్డ్‌వైడ్‌గా కేవలం 7 రోజుల్లోనే రూ. 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఈ చిత్రం సెన్సేషనల్ హిట్‌గా దూసుకుపోతోంది.
మాస్ మేనరిజమ్స్‌తో కోట్లాది మందిని అలరించే సూపర్‌స్టార్ రజినీకాంత్ పాత ఐడీ కార్డ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన బెంగళూరులో బస్సు కండక్టర్‌గా పనిచేసిన రోజుల నాటి ఈ బ్లాక్ అండ్ వైట్ కార్డుపై రజినీ అసలు పేరు ‘శివాజీ రావు గైక్వాడ్’ అని ఉంది. సాధారణ జీవితం నుంచి అసాధారణ స్టార్‌డమ్‌కు చేరిన ఆయన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం.
సూర్య, దర్శకుడు విక్రమ్ కె కుమార్ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్ సెట్ అయినట్లు తెలుస్తోంది. ఇదివరకు వీరిద్దరి కలయికలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ’24’ క్లాసిక్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వీరి కొత్త సినిమా రూపొందనుందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందట. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘స్పిరిట్’ చిత్రంలో త్రిప్తి డిమ్రి ఎంపికపై దర్శకుడు హేమంత్ మధుకర్ స్పందించాడు. సందీప్ వంగా సినిమాల్లో హీరోయిన్లకు కేవలం గ్లామర్ మాత్రమే కాకుండా, బలమైన ఎమోషనల్ డెప్త్ ఉంటుందని అన్నాడు. ‘అర్జున్ రెడ్డి’లో శాలినీ, ‘యానిమల్’లో రష్మిక పాత్రలే దీనికి నిదర్శనమన్నాడు. పాత్రకు సరిపోతుందనే త్రిప్తిని ఎంచుకున్నారని, ఆమె అంచనాలను అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు.
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న మూవీ ‘NBK 111’. ఈ సినిమా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్నట్లు టాక్. ఇటీవలే HYD షెడ్యూల్ పూర్తి చేసుకున్న మూవీ టీం, ఇప్పుడు ముంబైలో సుదీర్ఘ షెడ్యూల్‌కు ప్లాన్ చేసింది. ఇందుకోసం బాలకృష్ణ ఈ వారంలోనే ముంబై వెళ్లనున్నారట. అక్కడ కీలకమైన టాకీ సీన్లతో పాటు, హై-వోల్టేజ్ పోరాట ఘట్టాలను తెరకెక్కించనున్నట్లు టాక్.
సీనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా ఛత్రపతి. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో ఆయన నటన అద్భుతం. మాయాబజార్, లవకుశ, దాన వీర శూర కర్ణ చిత్రాల్లో శ్రీకృష్ణుడు, రాముడు, దుర్యోధనుడిగా ఆయన నటన చిరస్మరణీయం. అడవి రాముడు, యమగోల, బొబ్బిలి పులి, వేటగాడు వంటి సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. నటనతోనే కాకుండా తన వ్యక్తిత్వంతోనూ కోట్ల మంది గుండెల్లో ‘అన్నగారు’గా నిలిచిపోయారు.
సూర్య ‘కరుప్పు’ కథను మొదట విజయ్ దళపతి చివరి సినిమాగా చేయాల్సిందని దర్శకుడు ఆర్జే బాలాజీ తెలిపాడు. స్క్రిప్ట్‌పై చర్చలు జరిగినా, రాజకీయాల వల్ల విజయ్ నటించలేకపోయారని చెప్పాడు. కానీ, ఆయన అడిగిన ప్రశ్నలే కథను మరింత మెరుగుపరిచాయని, అందుకే థియేటర్‌లో విజయ్‌కు థాంక్స్ కార్డ్ వేసినట్లు తెలిపాడు. సినిమా చూసి విజయ్ కూడా టీమ్‌ను అభినందించారు.
సీనియర్ ఎన్టీఆర్ జయంతి వేళ మెగాస్టార్ చిరంజీవి ఘన నివాళులర్పించారు. ‘ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చరిత్రలో చెరిగిపోదు. తెరపై మహానటుడిగా, ప్రజాజీవితంలో తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీకగా ఆయన అందరి హృదయాల్లో శాశ్వతంగా నిలిచారు’ అని కొనియాడారు. ఇటీవల తనకు దక్కిన ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’ ఎంతో ప్రత్యేకమైన గౌరవమని, ఆయనపై తనకున్న భక్తికి ఇది దక్కిన గుర్తింపు అని అన్నారు.
కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ ‘కర’. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. అయితే, తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.
TG: ఏపీ మాజీ సీఎం నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని NTR ఘాట్‌లో జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ప్రముఖుల రాక నేపథ్యంలో ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
రామ్‌చరణ్ ‘పెద్ది’ చిత్రంలో అప్పలసూరి పాత్ర తన కెరీర్‌లోనే ప్రత్యేకమని జగపతి బాబు అన్నాడు. ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ పాత్ర యాస, డబ్బింగ్ ఓ సవాలని, మేకప్‌కే 3 గంటలు పట్టేదని చెప్పాడు. చరణ్ పడిన కష్టం చూసి ఆశ్చర్యపోయానని, ఆయనో మంచి వ్యక్తి అని ప్రశంసించాడు. తమ మధ్య సినిమాలో మంచి అనుబంధం ఉంటుందని తెలిపాడు.
చిన్న సినిమాలను అందరూ ప్రోత్సహించాలని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నాడు. ‘సందిగ్ధం’ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ..ఈ చిత్రానికి అచ్చతెలుగు టైటిల్ పెట్టడం, అడవుల్లో కష్టపడి షూటింగ్ చేయడం అభినందనీయమన్నాడు. ప్రస్తుతం ప్రమోషన్స్ సోషల్ మీడియాకే పరిమితం కాకుండా, అందరికీ తెలిసేలా ప్రతి ఒక్కరూ ముందుండి చిన్న చిత్రాలను ప్రమోట్ చేయాలని కోరాడు.
‘బేబీ’ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ ఇండస్ట్రీ పోకడలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘బేబీ’ విడుదలై ఉంటే సగం షేర్ కూడా వచ్చేది కాదని అన్నాడు. డబ్బులిచ్చి యూట్యూబ్ వ్యూస్, కామెంట్స్, ట్విట్టర్ ట్రెండ్స్ కొనుగోలు చేయడం వల్ల అసలైన ప్రజాభిప్రాయం తెలియడం లేదన్నాడు. ఈ ఫేక్ ప్రమోషన్ల వల్ల ప్రేక్షకులకు విరక్తి కలిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.