• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్‌పై లేటెస్ట్ బజ్!

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో వస్తున్న మూవీ ‘ఇరుముడి’. ఈ సినిమా విడుదలపై లేటెస్ట్ బజ్ నెలకొంది. 2026, ఆగస్టులో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆ సమయానికి సినిమా పనులు అన్నీ పూర్తి కానున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు GV ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

May 27, 2026 / 12:50 PM IST

OTTలోకి ‘లీడర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

వ్యాపారవేత్త నుంచి నటుడిగా మారిన లెజెండ్‌ శరవణన్‌ నటించిన ‘లీడర్‌’ మూవీ OTTలోకి వచ్చేస్తోంది. దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 3న రిలీజై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. దీని డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా.. మే 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.

May 27, 2026 / 12:40 PM IST

రామ్, అనిల్ రావిపూడి కాంబోలో మూవీ!

టాప్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ తమ ప్రస్తుత మూవీలతో బిజీగా ఉన్నారు. ఆ కమిట్‌మెంట్స్ పూర్తి కాగానే ఈ కొత్త సినిమా స్టార్ట్ కానుందట. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2027 దసరా కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

May 27, 2026 / 12:20 PM IST

‘డాన్ 3’ వివాదం.. తెరపైకి దీపిక ‘రేస్ 2’

‘డాన్ 3’ మూవీ టాపిక్‌తో దీపికా పదుకొనె పాత వివాదం మళ్లీ SMలో హాట్ టాపిక్‌గా మారింది. 2012లో ‘రేస్ 2’ మూవీ నుంచి ఆమె అర్ధాంతరంగా తప్పుకోవడంతో, నిర్మాతలు ఆమెపై సినీ సంఘాలకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో వెనక్కి తగ్గిన దీపిక, కొత్త నిబంధనలతో ప్రాజెక్ట్‌లోకి రీఎంట్రీ ఇచ్చి సినిమా పూర్తి చేసింది. 2013లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టింది.

May 27, 2026 / 12:05 PM IST

బాక్సాఫీస్ వద్ద ఆగని ‘దృశ్యం 3’ ర్యాంపేజ్

మోహన్ లాల్ ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. తెలుగులో ఈ మూవీ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, మలయాళ వెర్షన్ మాత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం 4 రోజుల్లోనే కేరళ నుంచి రూ.50 CRపైగా గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో వరల్డ్ వైడ్‌గా ‘ఎంపురాన్’ లైఫ్ టైం కలెక్షన్స్‌ని క్రాస్ చేసి ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్‌గా రికార్డు సృష్టించినట్లు టాక్.

May 27, 2026 / 11:36 AM IST

వెంకీ, కళ్యాణ్ మూవీపై నయా న్యూస్

డైరెక్టర్ అనిల్ రావిపూడి.. వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో క్రేజీ మల్టీస్టారర్ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం సెకండాఫ్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి GV ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. వెంకీ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తున్నారట. జూలై లేదా ఆగస్టులో షూటింగ్ ప్రారంభించి, సంక్రాంతికి సినిమాను విడుదల చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

May 27, 2026 / 11:08 AM IST

‘బాలన్ ది బాయ్’ సినిమా కోసం నాగార్జున

దర్శకుడు చిదంబరం దర్శకత్వంలో వస్తున్న ఎమోషనల్ డ్రామా ‘బాలన్ ది బాయ్’. KVN ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 19, 2026న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను కింగ్ నాగార్జునకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

May 27, 2026 / 10:42 AM IST

యూకే మార్కెట్‌లో ‘పెద్ది’కి సాలిడ్ రెస్పాన్స్!

రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుల క్రేజీ కాంబో ‘పెద్ది’ జూన్ 4న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్స్ షురూ కాగా, యూకే మార్కెట్‌లో ఈ సినిమా సాలిడ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. యూఎస్‌కు ధీటుగా అక్కడ ఇప్పటికే 12,500కి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. రిలీజ్ ముందే లభిస్తున్న ఈ భారీ రెస్పాన్స్‌తో యూకేలో ‘పెద్ది’కి గట్టి ఓపెనింగ్స్ గ్యారెంటీ అనిపిస్తోంది.

May 27, 2026 / 10:16 AM IST

‘వారణాసి’ తర్వాత మహేష్ పర్ఫెక్ట్ ప్లానింగ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ తర్వాత దానికి తగ్గ రేంజ్ కాంబోను సెట్ చేయడం పెద్ద సవాలే. అయితే దీనికి సమాధానంగా మహేష్ ఊహించని ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన నెక్స్ట్ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నాడట. ‘వారణాసి’ లాంటి భారీ చిత్రం తర్వాత ఆ వెయిట్‌ను క్యారీ చేయాలంటే ఈ క్రేజీ కాంబోనే కరెక్ట్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

May 27, 2026 / 09:58 AM IST

‘పెద్ది’ తొలిరోజు కలెక్షన్ రూ.210 కోట్లు..?

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న ‘పెద్ది’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4న రిలీజ్ కానున్న ఈ మూవీ తొలిరోజే రూ.210 కోట్ల కలెక్షన్స్ రాబడుతుందని ఫాన్స్ SMలో రచ్చ లేపుతున్నారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత హైప్ నెక్స్ట్ లెవెల్‌కు చేరింది. త్వరలో మరో ట్రైలర్ కూడా రానుందట. కథ క్లిక్ అయితే బాక్సాఫీస్ రికార్డులు షేక్ అవ్వడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

May 27, 2026 / 09:27 AM IST

‘ధురంధర్’ ప్రొడక్షన్ డిజైనర్ కేసు

సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన ‘ధురంధర్’ మూవీ ప్రొడక్షన్ డిజైనర్ సైనీ జోహ్రేపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాజెక్టులో అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చండీగఢ్ పోలీసులు కేసు నమోదు చేశారు. షూటింగ్ సమయంలో సైనీ జోహ్రే తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి, వేధించాడని బాధితురాలు పేర్కొంది.

May 27, 2026 / 09:10 AM IST

కుమార్తె డ్యాన్స్‌పై ట్రోల్స్‌.. స్పందించిన చంకీ పాండే

తన కూతురు అనన్య పాండే డ్యాన్స్‌పై వచ్చిన ట్రోల్స్‌పై నటుడు చంకీ పాండే స్పందించాడు. ‘చాంద్‌ మేరా దిల్‌’ మూవీలోని ఒక సీన్‌ చూసి జడ్జ్ చేయొద్దన్నాడు. అందులో చేసింది భరతనాట్యం కాదని, విద్యార్థులు చేసే ఫ్యూజన్ డ్యాన్స్ అని స్పష్టం చేశాడు. నెటిజన్లు అపార్థం చేసుకున్నారని, సినిమా చూశాక రియాక్ట్ అయితే బాగుంటుందని పేర్కొన్నాడు.

May 27, 2026 / 09:04 AM IST

మరోసారి యష్ ‘టాక్సిక్’ వాయిదా..?

కన్నడ స్టార్ హీరో యష్ భారీ చిత్రం ‘టాక్సిక్’ విడుదల ఇప్పటికే వాయిదా పడింది. ముందుగా ప్రకటించినట్లుగా జూన్ 4న విడుదల చేయలేకపోతున్నామని యష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్ర డిజిటల్ రైట్స్ కోసం నిర్మాతలు ఆశిస్తున్న బడ్జెట్‌ రాకపోవడంతో విడుదల తేదీని వాయిదా వేస్తున్నారు. ఆగస్టు నాటికి ‘టాక్సిక్’ రాకపోతే.. వచ్చే ఏడాదికి (2027) షిఫ్ట్ అయ్యే ప్రమాదం ఉందని టాక్.

May 27, 2026 / 08:43 AM IST

మెగాస్టార్ ఆరోగ్యంపై ఫేక్ న్యూస్.. కీలక నిర్ణయం

మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యంపై అసత్య ప్రచారాలు చేస్తూ.. మార్ఫింగ్ వీడియోలను SMలో వైరల్ చేసిన ఒక యూట్యూబ్ ఛానెల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. చిరంజీవి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, ఆయన ఆరోగ్యంపై తప్పుడు సమాచారంతో కూడిన వీడియోలు, ఫొటోలను యూట్యూబ్ ఛానెల్ ప్రచారం జరగుతోంది. ఈ నేపథ్యంలో న్యాయవాది రామకృష్ణ మిర్యాల జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

May 27, 2026 / 08:22 AM IST

హైదరాబాద్‌లో ప్రభాస్ స్పిరిట్ షూటింగ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగాల ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూట్ హైదరాబాద్‌లోని చారిత్రాత్మక కోఠి ఉమెన్స్ కాలేజీ (చాకలి ఐలమ్మ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం) ప్రాంగణంలో జరుగుతోంది. ఈ తాజా షెడ్యూల్‌లో భాగంగా హీరో ప్రభాస్, హీరోయిన్ త్రిప్తి డిమ్రిల మధ్య వచ్చే కొన్ని కీలకమైన టాకీ పోర్షన్స్ ఇక్కడ చిత్రీకరిస్తున్నారు.

May 27, 2026 / 07:29 AM IST