‘పెద్ది’ మూవీలో భాగమవడంపై దివ్యేందు శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ మూవీ షూటింగ్‌లో ఉండగా దర్శకుడు బుచ్చిబాబు పెట్టిన మెసేజ్‌లతో దాన్ని మధ్యలోనే ఆపేసి వచ్చానని తెలిపాడు. బుచ్చిబాబు చూపిన ప్రేమ, కళపై ఆయనకున్న గౌరవం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, పాత్ర వినగానే సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కేవలం దర్శకుడి కోసమే ఈ మూవీకి వెంటనే ఓకే చెప్పానని వెల్లడించాడు.
రామ్ చరణ్, బుచ్చిబాబుల ‘పెద్ది’ మూవీ జూన్ 4న రిలీజ్ కానుంది. ఏఆర్ రెహమాన్ ఇచ్చిన 3 పాటలు ఇన్స్టంట్ హిట్ అయ్యాయి. ఇటీవల భోపాల్ ఈవెంట్‌లో లైవ్ పెర్ఫామ్ చేసిన ‘మస్సా మస్సా’ మాస్ సాంగ్ హైప్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. అయితే విడుదల సమయం దగ్గరపడుతున్నా దీని తెలుగు వెర్షన్‌ని ఇంకా రిలీజ్ చేయలేదు. దీనిపై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.
తమిళ హీరో సూర్య తెలుగు సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు టాలీవుడ్‌లో భారీ బజ్ నెలకొంది. ఆయన నటించిన ‘కరుప్పు’కి సాలిడ్ రెస్పాన్స్ రావడంతో.. ఈ సినిమా ఆంధ్రా రైట్స్(రాయలసీమ మినహాయించి) దక్కించుకోవడం కోసం బయ్యర్స్ పోటీ పడుతున్నారు. ఈ మూవీకి రూ.10-12 కోట్ల NRA రేటు చెబుతున్నారట. దర్శకుడు వెంకీ మార్కెట్ వాల్యూ, సూర్యకు తెలుగులో ఉన్న క్రేజ్‌తో ఈ రేటు పలుకుతున్నట్లు టాక్.
‘పెద్ది’ మూవీలో తన పాత్రపై కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ మాట్లాడారు. ‘నా మనసుకు నచ్చిన పాత్రలే ఎంచుకుంటా, ఈ చిత్రంలో గౌర్నాయుడు పాత్ర కూడా అలాంటిదే. ఇది మంచి లక్ష్యమున్న అద్భుతమైన కథ. బుచ్చిబాబు ఈ క్యారెక్టర్‌ను చక్కగా తీర్చిదిద్దారు. నాది ఇందులో కోచ్ తరహా పాత్ర. ‘పెద్ది’తో నాకున్న అనుబంధం, ఎమోషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కన్నడ స్టార్ ఉపేంద్ర అన్న కొడుకు, హీరో నిరంజన్ సుధీంద్ర నిశ్చితార్థం డాక్టర్ సంజనా రాజ్‌తో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఉపేంద్ర కుటుంబ సమేతంగా హాజరై కొత్త జంటను దీవించారు. ఉపేంద్ర భార్య ప్రియాంక ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోగా, అవి వైరల్ అవుతున్నాయి. నిరంజన్ ‘సెకండాఫ్’ చిత్రంతో నటుడిగా మారి, ఈ ఏడాది ‘సీతా పయనం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.
NTR, కొరటాల శివ కాంబోలో వచ్చిన భారీ హిట్ చిత్రం ‘దేవర’. థియేటర్స్, OTTలో రికార్డులు సృష్టించిన ఈ సినిమా శాటిలైట్ హక్కులపై ఇన్నాళ్లూ ఉన్న సస్పెన్స్‌కు తెరపడింది. ప్రముఖ టీవీ ఛానెల్ ఈటీవీ దేవర శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. త్వరలోనే బుల్లితెరపై ఈ యాక్షన్ డ్రామా సందడి చేయనుంది. ఏదైనా పండుగ కానుకగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ప్లాన్ చేస్తే భారీ టీఆర్పీ రావడం ఖాయం.
‘పెద్ది’పై కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పెద్ది పాత్ర కోసం చరణ్ రెండేళ్లపాటు ఎంతో అంకితభావంతో పనిచేశారు. ఆయన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్, నిజాయితీతో కూడిన నటన ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. దర్శకుడు కథను అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉండే ఈ మూవీ క్లైమాక్స్‌ను థియేటర్లలోనే చూసి ఆస్వాదించాలి’ అని తెలిపారు.
సూర్య, త్రిష ప్రధాన పాత్రల్లో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో మే 15న విడుదలైన ‘వీరభద్రుడు’ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్ర సక్సెస్ మీట్‌లో సూర్య మాట్లాడుతూ.. అంచనాలకు మించి సినిమా ఘన విజయం సాధించడం ఆనందంగా ఉందన్నాడు. అలాగే అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర సీక్వెల్‌పై త్వరలోనే అప్‌డేట్ వస్తుందని సూర్య హింట్ ఇచ్చాడు.
అల్లు అర్జున్.. తాజాగా తన లగ్జరీ వాచ్‌తో వార్తల్లో నిలిచాడు. ఇటీవల తనను కలిసిన క్రికెటర్ వెంకటేష్ అయ్యర్‌తో దిగిన ఫొటోల్లో బన్నీ ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. అది ఫేమస్ పాటెక్ ఫిలిప్ నాటిలస్ (5712/1R-001) మోడల్. 18 క్యారెట్ల రోజ్ గోల్డ్, మూన్ ఫేజ్‌తో ఉండే ఈ వాచ్ మార్కెట్ ధర రూ.90L కాగా, రీసేల్ మార్కెట్‌లో క్రేజ్ వల్ల రూ.1.8 CRపైగా పలుకుతోంది.
IPL 2026 క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో GT, RCB ధర్మశాలలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌పై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశాడు. టాస్ గెలిస్తే గుజరాత్ బౌలింగ్ ఎంచుకుని బెంగళూరును కట్టడి చేయవచ్చని, ఒకవేళ బెంగళూరు టాస్ గెలిస్తే చేజింగ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని ఆయన విశ్లేషించాడు.
కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్.. రామ్ చరణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో నటనకు గానూ రామ్ చరణ్‌కు ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. తన జీవితంలో చేసిన అత్యంత స్ఫూర్తిదాయకమైన సినిమా ‘పెద్ది’ అన్నాడు. కాగా, రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం ‘పెద్ది’ జూన్ 4న విడుదల కానుంది.
రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం నుండి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మాసా మాసా’ పాట మే 28న విడుదల కానుంది. ‘పెద్ది పవర్‌ప్లే టూర్’లో భాగంగా ఢిల్లీలో నిర్వహించనున్న భారీ ఈవెంట్‌లో ఈ మాస్ సాంగ్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుత జనరేషన్‌లో నటీనటులపై ఉన్న ఒత్తిడి గురించి నటి శ్రద్ధా శ్రీనాథ్ ఓపెన్‌గా మాట్లాడింది. ఈరోజుల్లో కేవలం నటిగా ఉంటే సరిపోదని, SMలో నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ ఆన్‌లైన్ విజిబిలిటీని కాపాడుకోవాల్సి వస్తోందని చెప్పింది. తన వ్యక్తిగత విషయాలను షేర్ చేయడం నచ్చకపోయినా..వెనకబడిపోతామనే భయంతో ఇప్పుడు దీన్ని ఒక గేమ్ లాగా భావించి ఫాలో అవుతున్నానని ఆమె పేర్కొంది.
నటి కలర్స్ స్వాతి పెళ్లి, బంధాలపై చేసిన బోల్డ్ కామెంట్స్ నెట్టింట సంచలనంగా మారాయి. ప్రస్తుత రోజుల్లో భాగస్వాముల మధ్య ఓపిక, నమ్మకం కరువయ్యాయని ఆమె తెలిపింది. ఒకరిని పెళ్లి చేసుకుని, రోజూ గొడవలతో మానసిక ప్రశాంతత కోల్పోవడం కన్నా హాయిగా ఒక కుక్కను పెంచుకోవడం చాలా బెటర్ అని పేర్కొంది. మనుషుల కంటే షరతులు లేని ప్రేమను పంచే మూగజీవాలే నమ్మకమైనవని స్వాతి చెప్పింది.
రామ్‌చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్ర ప్రెస్‌మీట్ బెంగళూరులో జరిగింది. ఈ సందర్భంగా హోస్ట్ అడిగిన డైట్ సీక్రెట్ ప్రశ్నకు..రామ్‌చరణ్‌తో కలిసి డ్యాన్స్ చేస్తే ఒక్క పూటలోనే బరువు తగ్గొచ్చంటూ జాన్వీ సరదాగా సమాధానమిచ్చింది. ఈ సినిమా జూన్ 4న విడుదల కానున్న సంగతి తెలిసిందే.