• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

‘రాజాసాబ్’ టికెట్ బుకింగ్స్ ప్రారంభం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ ఈ నెల 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టికెట్ బుకింగ్స్ ప్రారంభించనట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఏపీ వ్యాప్తంగా ఉన్న థియేటర్లలో టికెట్స్‌ను డిస్ట్రిక్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని.. ఈ మేరకు పోస్టర్ విడుదల చేసింది. కాగా, రేపు సాయంత్రం 6 గంటల నుంచి ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.

January 7, 2026 / 08:45 PM IST

‘రాజాసాబ్’ టికెట్ ధరలు భారీగా పెంపు

ప్రభాస్ హీరోగా నటించిన ‘రాజాసాబ్’ మూవీ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ జీవో జారీ చేసింది. ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.1000గా నిర్ణయించింది. మరోవైపు 10రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌లో రూ.150, మల్టీప్లెక్స్‌లో రూ.200 పెంపునకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

January 7, 2026 / 05:38 PM IST

దళపతి విజయ్ సినిమా విడుదలవుతుందా?

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ‘జన నాయగన్’కు సెన్సార్ సర్టిఫికెట్‌పై మద్రాసు హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. జనవరి 9న ఉదయం తుది తీర్పు వెలువరిస్తామని కోర్టు వెల్లడించింది. దీంతో సినిమా 9న విడుదలవుతుందా లేదా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది.

January 7, 2026 / 05:03 PM IST

‘అనగనగా ఒకరాజు’ నాన్ థియేట్రిక‌ల్ డీల్ పూర్తి

టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒకరాజు’ జనవరి 14న విడుదలవుతుంది. మొత్తం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్ రూ.27 కోట్లకు క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. OTT హక్కులు రూ.19 కోట్లు, శాటిలైట్ హక్కులు రూ.5 కోట్లు, ఆడియో హక్కులు రూ.3 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం.

January 7, 2026 / 04:36 PM IST

‘జన నాయగన్‌’కు సెన్సార్‌ కష్టాలు.. కోర్టులో వాదనలు

తమిళ హీరో విజయ్ దళపతి ‘జన నాయగన్’ సెన్సార్ సర్టిఫికెట్‌పై మద్రాసు హైకోర్టులో విచారణ జరుగుతోంది. మూవీని నిలిపివేయాలని CBFC ఛైర్‌పర్సన్ ముందే సమాచారం ఇచ్చారని ASG సుందరేశన్ కోర్టుకు తెలిపారు. ఈ మూవీని కొత్త కమిటీ సమీక్షిస్తుందని, ఇందుకు 15 రోజుల టైం పడుతుందని అన్నారు. కొత్త కమిటీ ఏర్పాటుకు 20 రోజులు అవసరమని, JAN 5నే ఈ విషయం నిర్మాతలకు తెలిపినట్లు వెల్లడించారు.

January 7, 2026 / 04:20 PM IST

బన్నీ, లోకేష్ మూవీ స్టార్ట్.. అప్పుడేనా?

తమిళ డైరెక్టర్ అట్లీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత బన్నీ.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో హీరోగా చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమా 2026 అక్టోబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీని స్కిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

January 7, 2026 / 03:59 PM IST

రణ్‌వీర్ ‘ధురంధర్‌’ మరో రికార్డు

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ రూ.1000కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. తాజాగా ఈ సినిమా మరో మైలురాయిని అందుకుందని మేకర్స్ పోస్ట్ పెట్టారు. ఒక భాషలో మాత్రమే విడుదలై దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిందని తెలిపారు. ఇది భారతీయ సినిమాలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని, రాబోయే సినిమాలకు స్ఫూర్తినిస్తుందని అన్నారు.

January 7, 2026 / 02:44 PM IST

‘అనగనగా ఒకరాజు’ ట్రైలర్ రిలీజ్ వాయిదా

టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన మూవీ ‘అనగనగా ఒకరాజు’. 2026 JAN 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 7న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ట్రైలర్ వాయిదా పడింది. జనవరి 8న ఉదయం 10 గంటలకు మూసాపేట్‌లోని శ్రీరాముల థియేటర్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు.

January 7, 2026 / 01:39 PM IST

నేను ఎవరినీ కాపీ చేయడానికి రాలేదు: తాప్సీ

సినీఇండస్ట్రీలో 15ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నటి తాప్సీ ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన పని భవిష్యత్తు తరాలకు గుర్తింపుగా నిలవాలని భావిస్తున్నానని పేర్కొంది. ఎవరినీ కాపీ చేయడానికి తాను ఈ రంగంలోకి రాలేదని తెలిపింది. కెరీర్ ప్రారంభంలో వాణిజ్య చిత్రాలతో ఎదురైన పరాజయాలే తనకు జీవిత పాఠాలు నేర్పించాయని చెప్పింది.

January 7, 2026 / 01:25 PM IST

‘రాజాసాబ్’, ‘మన వరప్రసాద్‌’ నిర్మాతలకు ఊరట

‘రాజాసాబ్’, ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రాల నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు కేవలం ‘పుష్ప-2, OG, గేమ్ ఛేంజర్, అఖండ-2’ చిత్రాలకే పరిమితమని కోర్టు పేర్కొంది. టికెట్ ధరల పెంపుపై నిర్మాతలు చేసుకున్న విజ్ఞప్తిని పరిశీలించి, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. తాజా ఉత్తర్వులతో టికెట్ ధరలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ లభ...

January 7, 2026 / 12:58 PM IST

‘దృశ్యం 3’ రిలీజ్‌ ఎప్పుడంటే!

మలయాళ స్టార్ మోహన్‌లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబోలో తెరకెక్కిన ఫ్రాంఛైజీ ‘దృశ్యం’. ఇప్పటికే ఈ ఫ్రాంఛైజీ నుంచి రెండు సినిమాలు రాగా.. త్వరలోనే మూడో మూవీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ‘దృశ్యం 3’ షూటింగ్ పూర్తయింది. తాజాగా ఈ సినిమా విడుదలపై దర్శకుడు జీతూ జోసెఫ్ మాట్లాడుతూ.. ఏప్రిల్‌లో దీన్ని రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు.

January 7, 2026 / 12:44 PM IST

ఇవాళ్టి మూవీ UPDATES..!

➠ HYDలోని శిల్పకళా వేదికలో చిరంజీవి ‘MSVG’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ 5:30PMకు స్టార్ట్➠ రవితేజ ‘BMW’ ట్రైలర్ సాయంత్ర 4:05 గంటలకు రిలీజ్➠ నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒకరాజు’ ట్రైలర్ సాయంత్రం 6:04 గంటలకు విడుదల.

January 7, 2026 / 12:09 PM IST

iBOMMA రవికి బిగ్ షాక్

TG: ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. సైబర్ క్రైమ్ పీఎస్‌లో నమోదైన 5 కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోరాడు. కేసు దర్యాప్తు దశలో ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. అలాగే, రవి విదేశాల్లో పౌరసత్వం కలిగి ఉన్నాడని, బెయిల్ ఇస్తే దేశం దాటిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో రవి బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.

January 7, 2026 / 11:36 AM IST

ఓటీటీలోకి వచ్చేసిన స్టార్ హీరో మూవీ

తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన ‘అయలాన్’ మూవీ 2024 సంక్రాంతికి తమిళంలో విడుదలైంది. తెలుగు వెర్షన్ కూడా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేయగా.. పలు కారణాలతో విడుదల కాలేదు. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం ‘ఆహా’లో దీని తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ చిత్రం ఏలియన్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కింది.

January 7, 2026 / 10:34 AM IST

సమంత కొత్త మూవీపై UPDATE

తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’లో సమంత నటిస్తోన్న మూవీ ‘మా ఇంటి బంగారం’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా సామ్.. తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఉ.10 గంటలకు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో చాలా రోజుల తర్వాత సామ్ మళ్లీ తెలుగు సినిమాలో కనిపించనుండటంతో అభిమానులు ఖుషి అవుతున్నారు.

January 7, 2026 / 10:20 AM IST