• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

పెద్ది’లో శ్రుతి హాసన్ స్పెషల్ సాంగ్..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా తాజా అప్‌డేట్ టాలీవుడ్‌లో వైరల్ అవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులోని స్పెషల్ సాంగ్ కోసం శ్రుతి హాసన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. గ్లామర్, ఎనర్జిటిక్ స్టెప్పులతో ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలవనుందట. త్వరలోనే ఈ సాంగ్ షూటింగ్ పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

April 22, 2026 / 01:55 PM IST

నేను జైలుకు వెళ్లింది డబ్బు లేక కాదు: రాజ్‌పాల్‌ యాదవ్‌

చెక్‌బౌన్స్ కేసుపై బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్ స్పందించాడు. తాను జైలుకెళ్లడానికి డబ్బు చెల్లించకపోవడం మాత్రమే కారణం కాదని అన్నాడు. ఇది కేవలం రూ.5 కోట్ల వివాదం కాదని, దీనివల్ల తాను రూ.17 కోట్లు నష్టపోయానని తెలిపాడు. తనపై వచ్చిన మోసం ఆరోపణలను ఆయన ఖండించాడు. సినిమా ఫలితాలను బట్టి మోసగాడిగా ముద్ర వేయకూడదని, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నాడు.

April 22, 2026 / 01:36 PM IST

‘లెనిన్’ క్లైమాక్స్ కోసం ప్యాచ్ వర్క్..?

అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం 2026 జూన్ 26న విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల చిత్ర ఫైనల్ కట్ చూసిన నాగార్జున కొన్ని మార్పులు సూచించడంతో, చిత్ర బృందం క్లైమాక్స్ ప్యాచ్ వర్క్ సహా కొన్ని కీలక దృశ్యాలను రీషూట్ చేస్తున్నట్లు సమాచారం. అఖిల్, ఇతర తారాగణం ఈ షూట్‌లో పాల్గొంటున్నారట. ప్రస్తుతం టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది.

April 22, 2026 / 12:59 PM IST

మెగాస్టార్ ఇంటికి ద‌గ్గ‌ర్లో అల్లు అర్జున్ ఇల్లు..!

HYD జూబ్లీహిల్స్‌లో మెగాస్టార్ చిరంజీవి ఇంటికి సమీపంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక విలాసవంతమైన భవనాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. దాదాపు 4 వేల చదరపు గజాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ మేన్షన్ నిర్మాణ వ్యయం సుమారు రూ. 80 కోట్లు అని టాక్. అత్యాధునిక హంగులతో సిద్ధమవుతున్న ఈ కట్టడానిని ఈ ఏడాది చివర్లో పూర్తి చేసి, బన్నీ తన కుటుంబంతో కలిసి గృహప్రవేశం చేయనున్నాడట.

April 22, 2026 / 12:26 PM IST

మెగాస్టార్ ఇంటికి ద‌గ్గ‌ర్లో అల్లు అర్జున్ ఇల్లు..?

HYD జూబ్లీహిల్స్‌లో మెగాస్టార్ చిరంజీవి ఇంటికి సమీపంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక విలాసవంతమైన భవనాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. దాదాపు 4 వేల చదరపు గజాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ మేన్షన్ నిర్మాణ వ్యయం సుమారు రూ. 80 కోట్లు అని టాక్. అత్యాధునిక హంగులతో సిద్ధమవుతున్న ఈ కట్టడానిని ఈ ఏడాది చివర్లో పూర్తి చేసి, బన్నీ తన కుటుంబంతో కలిసి గృహప్రవేశం చేయనున్నాడట.

April 22, 2026 / 12:26 PM IST

జీవీ ప్రకాష్ హీరోగా ‘జో’ డైరెక్టర్ మూవీ..!

తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా, ‘జో’ ఫేమ్ హరిహరన్ రామ్ దర్శకత్వంలో ఒక చిత్రం సిద్ధమవుతోంది. లార్క్ స్టూడియోస్, పారలల్ యూనివర్స్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టులో మాళవిక మనోజ్ కథానాయికగా నటిస్తోంది. జీవీ ప్రకాష్ స్వయంగా సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. ఈ ప్రయోగాత్మక చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానున్నట్లు టాక్.

April 22, 2026 / 12:10 PM IST

జీవి ప్రకాష్ హీరోగా ‘జో’ డైరెక్టర్ మూవీ..!

తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా, ‘జో’ ఫేమ్ హరిహరన్ రామ్ దర్శకత్వంలో ఒక చిత్రం సిద్ధమవుతోంది. లార్క్ స్టూడియోస్, పారలల్ యూనివర్స్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టులో మాళవిక మనోజ్ కథానాయికగా నటిస్తోంది. జీవీ ప్రకాష్ స్వయంగా సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. ఈ ప్రయోగాత్మక చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానున్నట్లు టాక్.

April 22, 2026 / 11:56 AM IST

‘ది ప్యారడైజ్’ నెక్స్ట్ సాంగ్‌పై సాలిడ్ UPDATE

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ‘ది ప్యారడైజ్’ అప్‌డేట్స్ జోరుగా ఉన్నాయి. అనిరుధ్ అందించిన ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేయగా, త్వరలో నాని-కయాదు లోహర్ మధ్య ఒక మెస్మరైజింగ్ రొమాంటిక్ మెలోడీ రాబోతున్నట్లు సమాచారం. ‘చుట్టమల్లే’ రేంజ్‌లో ఈ సాంగ్ చార్ట్‌బస్టర్ అవుతుందని టాక్. ఈ మూవీ ఆగస్టు 21, 2026న విడుద...

April 22, 2026 / 11:55 AM IST

మరో OTTలోకి ‘యుఫోరియా’ మూవీ

దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘యుఫోరియా’ మూవీ FEB 6న రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రముఖ OTT సంస్థ ఈటీవీ విన్‌లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా మరో తెలుగు OTT ఆహాలో కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఈ సినిమాలో భూమిక, సారా అర్జున్, రోహిత్, నాజర్, విఘ్నేష్ గవిరెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

April 22, 2026 / 11:23 AM IST

సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ

శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 6న థియేటర్లలో విడుదలైనా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే, తాజాగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. అంతేకాకుండా, వచ్చే వారం నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కానుంది.

April 22, 2026 / 11:06 AM IST

రూ.10కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైన రణ్‌వీర్‌!

రణ్‌వీర్ సింగ్ ‘డాన్ 3’ నుంచి తప్పుకున్నారనే వార్తలు బాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలో దర్శకుడు ఫర్హాన్ అక్తర్‌తో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రణ్‌వీర్ సిద్ధమయ్యాడట. ఈ మూవీ నుంచి వైదొలిగినందుకు గానూ ఆయన రూ.10 కోట్లు తిరిగి ఇచ్చేస్తారని, అలాగే తన తదుపరి మూవీ ‘ప్రళయ్’లో అక్తర్ నిర్మాణ సంస్థకు వాటా ఇచ్చేందుకు అంగీకరించారని సమాచారం.

April 22, 2026 / 10:53 AM IST

ఒకేరోజు మూడు ప్రీమియర్లు..!

బుల్లితెర ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఒకేరోజు మూడు సినిమాలు TVలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు స్టార్ మాలో ‘ది రాజాసాబ్’, జీ తెలుగులో ‘అఖండ 2’, అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఈటీవీలో ‘నారీ నారీ నడుమ మురారి’ టెలికాస్ట్ కానున్నాయి. మూడు విభిన్న జానర్లలో తెరకెక్కిన ఈ మూవీల్లో ఏది TRP రేసులో టాప్‌లో నిలుస్తుందో చూడాలి.

April 22, 2026 / 10:27 AM IST

‘కొరియన్‌ కనకరాజు’పై లేటెస్ట్ UPADTE

వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబోలో వస్తున్న ‘కొరియన్ కనకరాజు’ మూవీపై అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవీ షూటింగ్‌లో తేజ్‌పై ఒక అదిరిపోయే కామెడీ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారట. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే ఈ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందట. మేర్లపాక తనదైన మార్క్ హ్యూమర్‌తో ఈ ఎపిసోడ్‌ను ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా డిజైన్ చేశాడని టాక్.

April 22, 2026 / 10:05 AM IST

‘మెగా 158’లో నెగటివ్ పాత్రలో స్టార్ బ్యూటీ..?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబోలో ‘మెగా 158’ మూవీ రాబోతుంది. ఈ సినిమాలో ప్రియమణి కథానాయికగా నటించనుండగా.. తమన్ మ్యూజిక్ అందించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలో మరో స్టార్ బ్యూటీ డింపుల్ హయాతి భాగం కానున్నట్లు సమాచారం. ఇందులో ఆమె మరో కథానాయికగా కాకుండా, కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

April 22, 2026 / 09:47 AM IST

ప్రభాస్ ‘కల్కి 2’ కోసం భారీ సెట్..?

దర్శకుడు నాగ్ అశ్విన్, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో రాబోతున్న ‘కల్కి 2’ మూవీపై ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్‌ను వేసి ఇంటర్వెల్‌ను షూట్ చేయనున్నారట. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ పాల్గొంటారని సమాచారం. కాగా, లాస్ట్ షెడ్యూల్‌లో అమితాబ్, కమల్ పాత్రలపై కీలక సన్నివేశాలను షూట్ చేశారు.

April 22, 2026 / 09:26 AM IST