HYD జూబ్లీహిల్స్లో మెగాస్టార్ చిరంజీవి ఇంటికి సమీపంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక విలాసవంతమైన భవనాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. దాదాపు 4 వేల చదరపు గజాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ మేన్షన్ నిర్మాణ వ్యయం సుమారు రూ. 80 కోట్లు అని టాక్. అత్యాధునిక హంగులతో సిద్ధమవుతున్న ఈ కట్టడానిని ఈ ఏడాది చివర్లో పూర్తి చేసి, బన్నీ తన కుటుంబంతో కలిసి గృహప్రవేశం చేయనున్నాడట.