టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరో క్రేజీ ప్రాజెక్టుతో రాబోతున్నాడు. డైరెక్టర్ లోకమాన్య దర్శకత్వంలో ఆయన నటిస్తోన్న సినిమా ‘రామమ్’. ‘ది రైజ్ ఆఫ్ అకిరా’ అనేది ట్యాగ్ లైన్. డివోషనల్ టచ్‌తో రాబోతున్న ఈ సినిమాను వేణు దోనేపూడి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్.. ప్రీ లుక్ పోస్టర్ షేర్ చేశారు.
మాస్ మహారాజా రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నటి నుపుర్ సనన్ దగ్గరైంది. త్వరలోనే ఈ బ్యూటీ పెళ్లి పీటలెక్కబోతుంది. తాజాగా తన ప్రియుడు, సింగర్ స్టెబిన్ బెన్‌తో ఎంగేజ్మెంట్ అయినట్లు నుపుర్ SMలో ఫొటోలు షేర్ చేసింది. గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట జనవరి 11న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయకుడు’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇన్నాళ్లుగా ఉన్న సందేహాలకు చెక్ పెడుతూ, ఇది బాలకృష్ణ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అని స్పష్టమైంది. అయితే డైరెక్టర్ వినోద్ దీనిని యథాతథంగా తీయలేదు. విజయ్ ఇమేజ్, ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టు కథలో భారీ మార్పులు చేసినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. మొత్తానికి దళపతి ఫ్యాన్స్‌కు ఇది విందుభోజనమే.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా క్లైమాక్స్ పై ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. క్లైమాక్స్‌లో ఓ భారీ ప్రమాదం కారణంగా హీరో పాత్రకి కాళ్ళు పోతాయని.. అయినప్పటికీ రన్నింగ్‌లో ఛాంపియన్ అవుతాడని టాక్ నడుస్తోంది. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 27న విడుదల కానుంది.
తమిళ హీరో విజయ్ దళపతి నటించిన ‘జన నాయకుడు’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ చిత్ర ట్రైలర్ చూశాక, ఇది బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి రీమేక్ అని స్పష్టమవుతుంది. తమిళ నేటివిటీకి, విజయ్ పొలిటికల్ ఎంట్రీకి తగ్గట్టుగా దర్శకుడు కథలో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగులో శ్రీలీల చేసిన పాత్రను తమిళంలో మమిత బైజు పోషిస్తోంది.
తమిళ స్టార్ సూర్య కథానాయకుడిగా, నాగవంశీ ‘సూర్య 46’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, ఈ సినిమాలో మలయాళ బ్యూటీ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, ఈ మూవీలో మరో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ 2026 జనవరి 12న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌పై అప్‌డేట్ వచ్చింది. తిరుపతిలోని SV సినీప్లెక్స్‌లో రేపు మధ్యాహ్నం 3 గంటలకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇక ఈ ట్రైలర్ 2:30 నిమిషాల రన్ టైంతో విడుదల కానున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించాడు.
టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో ‘నారీనారీ నడుమ మురారి’ మూవీ రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను శర్వా పూర్తి చేశాడు. ఇక దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమాలో సంయుక్త, సాక్షి వైద్య నటించారు. 2026 జనవరి 14న ఇది రిలీజ్ కానుంది.
ఇటీవలే ‘ఛాంపియన్’ మూవీతో వచ్చిన రోషన్ మరో క్రేజీ ప్రాజెక్టు చేసేందుకు సిద్ధమయ్యాడు, దర్శకుడు శైలేష్ కొలనుతో రోషన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేయనున్నాడట. ఈ చిత్రంలో అతను ఏజెంట్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో ‘రాజాసాబ్’ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా 2026 జనవరి 9న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా కోసం మారుతి రూ.18 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా.. ప్రభాస్ రూ.100 కోట్ల పారితోషికం అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా 2:55 గంటల నిడివితో రాబోతున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
టాలీవుడ్ హారో చైతన్య రావు మదాడి ప్రధాన పాత్రలో దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న సినిమా ‘దిల్ దియా’. ‘ఏ నేక్డ్ ట్రుథ్’ అనేది ట్యాగ్ లైన్. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్‌లో చైతన్య రావు ఒంటిపైన బట్టలు లేకుండానే న్యూడ్‌గా కనిపించాడు. ఇక ఈ సినిమా 2026 సమ్మర్‌లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ 2026 జనవరి 12న రిలీజ్ కాబోతుంది. విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. తాజాగా రిలీజ్‌కు ఇంకా 9రోజులు మాత్రమే ఉన్నాయని తెలుపుతూ కౌంట్‌డౌన్ పోస్టర్ పంచుకున్నారు. ఇక ఈ సినిమాలో నయనతార, వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న పవర్‌ఫుల్ ప్రాజెక్టు ‘మహాకాళి’. దర్శకురాలు పూజా అపర్ణ కొల్లూరు ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ప్రశాంత్ వర్మ కథను అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ చిత్రీకరణలో బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ ఖన్నా జాయిన్ అయ్యాడు. కాళికాదేవి కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నటి భూమి శెట్టి ‘మహా’ పాత్రలో కనిపిం...
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబోలో తెరకెక్కిన ‘డియర్ కామ్రేడ్’ మూవీ బాలీవుడ్‌లో రీమేక్ కాబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తన ‘ధర్మ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది, ప్రతిభా రంతా ప్రధాన పాత్రలు పోషించనున్నట్లు తెలుస్తోంది.