లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ‘తలైవార్ 173’ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీని దర్శకుడు శిబి చక్రవర్తి తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాకు కమల్‌తో పాటు R మహేంద్రన్ నిర్మాతగా వ్యవహరించనుండగా.. అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. ఇక ఈ చిత్రం 2027 సంక్రాంతికి విడుదల కానుంది.
బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టు ‘డాన్ 3’ నుంచి హీరో రణ్‌వీర్ సింగ్ తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఆయన స్థానంలో హృతిక్ రోషన్ నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రకు హృతిక్ సరిగ్గా సెట్ అవుతాడని మేకర్స్ భావిస్తున్నారట. ప్రస్తుతం ఆయనతో చర్చలు జరుగుతున్నట్లు, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘రాజాసాబ్’ మూవీ 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీలోని రెండు పాటలు రిలీజ్ కాగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. తాజాగా ఈ సినిమాలోని మరో పాట ‘NacheNache’ను జనవరి 5న రిలీజ్ చేయనున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వెల్లడించాడు. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి తెరకెక్కించాడు.
➠ముగింపు దశలో ‘మృత్యుంజయ్’, ‘కామ్రేడ్ కళ్యాణ్’➠’సామజవరగమన’ దర్శకుడు రామ్ అబ్బరాజుతో మరో సినిమా.. 2026 మార్చిలో స్టార్ట్!➠సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ‘అనగనగా’ దర్శకుడు సన్నీ సంజయ్‌తో వినోదాత్మక సినిమా!➠జీఏ2 బ్యానర్‌లో కొత్త దర్శకుడితో కొత్త సినిమా!.
దర్శకుడు కార్తీక్ దండుతో అక్కినేని నాగచైతన్య ‘వృషకర్మ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చైతూ.. ‘బెదురులంక’ దర్శకుడు క్లాక్స్‌తో సినిమా చేయనున్నాడట. ఇప్పటికే ఈ సినిమా విషయమై చర్చలు జరుగుతున్నాయట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మాత బన్నీ వాసు మరో నిర్మాణ సంస్థతో కలిసి నిర్మించనున్నట్లు సమాచారం.
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9 ఇటీవలే ముగిసింది. ఈ సీజన్‌లో విన్నర్‌గా కామనర్ కళ్యాణ్ పడాల నిలిచాడు. తాజాగా ఈ షో అరుదైన రికార్డు సృష్టించింది. గత ఐదేళ్లలోనే ఎప్పుడూ లేని విధంగా సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఏకంగా 19.6 రేటింగ్ నమోదు చేసింది. జియో హాట్‌స్టార్‌లో 285 మిలియన్ నిమిషాల పాటు ప్రేక్షకులు వీక్షించారు.
తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ సరసన మీనాక్షి చౌదరి నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రదీప్ స్వీయ దర్శకత్వంలో నటించనున్న ఈ సినిమాలో ఆమె కథానాయికగా చేయనున్నట్లు సమాచారం. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. 2026 మార్చిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు, ఒకే షెడ్యూల్‌లో షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలని డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.
టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ రెండోసారి తండ్రి అయ్యాడు. తన భార్య అరుణ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇటు ఆది నటించిన ‘శంబాల’ మూవీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆది ఇంట్లో డబుల్ హ్యాపినెస్ నెలకొంది. 2014లో ఆది, అరుణ పెళ్లి జరగ్గా.. వారికి కూతురు పుట్టింది. దీంతో ఆదికి నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ 173వ చిత్రం గురించి రేపు కీలక ప్రకటన వెలువడనుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని లోకనాయకుడు కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై నిర్మించబోతున్నాడు. 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను రేపు ఉ.11 గంటలకు వెల్లడించనున్నారు.
హీరో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ సీజన్ 9 సరికొత్త రికార్డులు సృష్టించింది. స్టార్ మాలో టెలికాస్ట్ అయిన ఫైనల్ ఎపిసోడ్ 19.6 రేటింగ్‌ను(TVR) సొంతం చేసుకోగా, జియోహాట్‌స్టార్ యాప్‌లో 285 మిలియన్ నిమిషాల వ్యూస్‌ను దక్కించుకుంది. గత ఐదు సీజన్లలో ఇదే అత్యధికం అంటూ నాగార్జున సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
అఖిల్ అక్కినేని నటిస్తున్న ‘లెనిన్’ ఈ ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది. చాలా కాలంగా సరైన హిట్ లేని అఖిల్, ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. మురళీ కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మొదట హీరోయిన్‌గా శ్రీలీలను తీసుకోగా, అనివార్య కారణాలతో ఆమె తప్పుకుంది. శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేయగా, తాజాగా ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘శంబాల’ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లో రూ. 16.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దీంతో ఆది కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక యుగంధర్ ముని తెరకెక్కించిన ఈ సినిమాలో అర్చనా అయ్యర్, శ్వాసిక విజయ్, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు.
బాలీవుడ్‌పై నటి కృతి శెట్టి ఫోకస్ పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. వీటిపై కృతి క్లారిటీ ఇచ్చింది. తాను ముంబైలో పుట్టి పెరిగానని, అందుకే హిందీలో పనిచేయడం ఎప్పటి నుంచో ఇష్టమని చెప్పింది. కెరీర్ తొలినాళ్లలో హిందీలో ఆఫర్స్ వచ్చాయని, డేట్స్ కుదరకపోవడం, అక్కడి వర్కింగ్ స్టైల్ కారణంగా నో చెప్పినట్లు తెలిపింది. త్వరలోనే హిందీలో మంచి అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది.
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో ‘రాజాసాబ్’ మూవీ తెరకెక్కింది. 2026 జనవరి 9న ఈ సినిమా రిలీజ్ కానుంది. కొన్నిరోజులుగా ఈ సినిమాకు సీక్వెల్ ఉండనున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా పార్ట్ 2పై మేకర్స్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరిన్ని హర్రర్ ఎలిమెంట్స్‌తో అద్భుతమైన కథను రెడీ చేయడంలో బిజీగా ఉన్నట్లు టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీతో చిరంజీవి, వెంకటేష్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జనవరి 12న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుంచి 3 పాటలను విడుదల చేయగా, తాజాగా మేకర్స్ ట్రైలర్ అప్‌డేట్ ఇచ్చారు. ఈనెల 4న ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.