‘డెకాయిట్’ చిత్రానికి వస్తున్న అద్భుతమైన స్పందన పట్ల హీరో అడివి శేష్ సంతోషం వ్యక్తం చేశాడు. HYDలో నిర్వహించిన థ్యాంక్యూ మీట్‌లో మాట్లాడుతూ.. ప్రేక్షకులకు సరికొత్త వాస్తవిక అనుభూతిని పంచాలనే లక్ష్యంతో ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డామని, ఇప్పుడు ఆ ప్రయత్నానికి తగిన గౌరవం దక్కుతోందని తెలిపాడు. తన కెరీర్‌లోనే ఇది మొదటి మ్యూజికల్ హిట్‌గా నిలవడం ఆనందంగా ఉందన్నాడు.
HYDలో నిర్వహించిన ‘డెకాయిట్’ థ్యాంక్యూ మీట్‌లో హీరో అడవి శేష్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘ఓ అభిమాని నాతో మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో నాపై 150 మంది దాడి చేయడంతో నేను చాలా కాలం హాస్పిటల్లో ఉన్నా. అప్పుడు బయటకు వెళ్లాలన్నా భయం వేసింది. కానీ ‘మేజర్’ సినిమా చూసి ధైర్యం వచ్చింది. ‘డెకాయిట్’ మూవీ కూడా చూసాను. నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పాడు’...
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్వయంభు’. తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ OTT నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు టాక్. అయితే ఈ డీల్‌లో ‘పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్’ మోడల్‌ను అనుసరించినట్లు సమాచారం. దీని ప్రకారం.. థియేటర్లలో ఈ సినిమా సాధించే నెట్ కలెక్షన్లలో 50 శాతాన్ని నెట్‌ఫ్లిక్స్ చెల్లించనుంది.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కొత్త అవతారం ఎత్తాడు. ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్‌తో కలిసి ఓ మైథలాజికల్ గ్లోబల్ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ‘ఇప్పుడు కనిపించే కోపమంతా ఒకప్పటి ప్రేమ’ అంటూ విడుదలైన పోస్టర్ అంచనాలు పెంచుతోంది. ‘హౌస్ అఫ్ ది డ్రాగన్’ వంటి హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన టెక్నీషియన్స్ వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టులో భాగం క...
స్టార్ హీరో ధనుష్, డైరెక్టర్ విఘ్నేష్ రాజా కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కారా. ఈ మూవీ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా మేకర్స్ ఓ కొత్త పోస్టర్‌ను షేర్ చేస్తూ ట్రైలర్ అప్‌డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 19న ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా.. ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మమిత బైజు నటిస్తుంది.
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, దర్శకుడు డేవిడ్ ధావన్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘హై జవానీ తో ఇష్క్ హోనా’. ఇందులో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలోని ఒక స్పెషల్ సాంగ్‌లో కృతి సనన్ మెరవబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఆమెతో చర్చలు జరపగా, అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబోలో ఓ భారీ చిత్రం రాబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు ముగిశాయని, ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వరుస విజయాలతో జోరు మీదున్న బాలయ్యకు, కొరటాల మార్క్ సోషల్ మెసేజ్ తోడైతే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. త్వరలోనే ఈ క్రేజీ కాంబోపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.
నిఖిల్ నటించిన భారీ చిత్రం ‘స్వయంభూ’ విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ముందుగా 2026 ఏప్రిల్‌లో రావాల్సి ఉండగా.. గ్రాఫిక్స్ పనుల వల్ల వాయిదా పడింది. టీజర్ విజువల్స్‌పై మిశ్రమ స్పందన రావడంతో, మేకర్స్ ఇప్పుడు VFX అవుట్‌పుట్ విషయంలో రాజీ పడకూడదని భావిస్తున్నారట. క్వాలిటీ పక్కాగా వచ్చిన తర్వాతే రిలీజ్ డేట్‌ను లాక్ చేయనున్నారట.
మలయాళ నటి కళ్యాణి ప్రియదర్శన్, మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ పెళ్లి వార్తలపై ఆమె తల్లి లిజి లక్ష్మి క్లారిటీ ఇచ్చింది. ‘విషు’ సందర్భంగా లిజి షేర్ చేసిన ఫొటోలపై ఓ నెటిజన్ వీరిద్దరి పెళ్లి గురించి ప్రశ్నించగా.. ‘అవన్నీ కేవలం అబద్ధపు వార్తలు, అస్సలు నమ్మకండి’ అని తెలిపింది. దీంతో ఈ పెళ్లి పుకార్లకు ఒక్క కామెంట్‌తో చెక్ పడింది.
కుంభమేళాతో వైరల్ అయిన మోనాలిసా పెళ్లి ఇప్పుడు వివాదంగా మారింది. ఆమె మైనర్ అని తేలడంతో భర్తపై పోక్సో కేసు పెట్టారు. ఈ వివాదం పెద్దదవ్వడంతో రెండు రాష్ట్రాల డీజీపీలు ఢిల్లీ రావాలని జాతీయ కమిషన్ ఆదేశించింది. చట్టపరమైన ఇబ్బందుల వల్ల ఈ కేసు దర్యాప్తు ఇప్పుడు క్లిష్టంగా మారింది. ప్రస్తుతం ఆమె ఎక్కడుందో కనిపెట్టేందుకు పోలీసులు కేరళలో తీవ్రంగా గాలిస్తున్నారు.
‘మైసా’ చిత్రం కోసం రష్మిక మందన్న చూపిస్తున్న అంకితభావం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. పాత్ర కోసం ఆమె బ్యాంకాక్‌లో కఠినమైన యాక్షన్ బూట్ క్యాంప్‌లో శిక్షణ పొందుతోంది. నిపుణుల సమక్షంలో రోజుకు 8 గంటల పాటు హ్యాండ్-టు-హ్యాండ్ కంబాట్, హై-స్పీడ్ స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తోంది. శారీరకంగా, మానసికంగా సిద్ధమవుతున్న ఆమె డెడికేషన్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో రాబోతున్న భారీ చిత్రం ఇవాళ అధికారికంగా ప్రారంభమైంది. దిల్‌రాజు నిర్మాణంలో వస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచే మొదలైంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
కన్నడ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది కేవలం గ్యాంగ్‌స్టర్ డ్రామా మాత్రమే కాదు, భావోద్వేగాలతో కూడిన తండ్రీకొడుకుల ప్రతీకార గాథ అని చెప్పాడు. రామాయణానికి పూర్తి భిన్నమైన ప్రపంచం ఇది. చాలా క్రూరంగా, వైల్డ్‌గా సాగే కథ అని తెలిపాడు. ఇక ఈ చిత్రం 2026 జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.