శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 6న థియేటర్లలో విడుదలైనా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే, తాజాగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. అంతేకాకుండా, వచ్చే వారం నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కానుంది.