• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

ఆ మూవీ కోసం నాని ఇన్ని ఆఫర్లు వదులుకున్నాడా?

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. అయితే ఈ సినిమా కోసం నాని ఏకంగా మూడు ప్రాజెక్టులు వదులుకున్నాడట. ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ డైరెక్షన్‌లో చేయాల్సిన సినిమా విజయ్ దేవరకొండకు షిఫ్ట్ అవ్వగా.. సిబి చక్రవర్తి ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కలేదు. ఇక టీజే జ్ఞానవేల్ నాని కోసం సిద్ధం చేసిన స్క్రిప్ట్‌ను సూర్యతో తెరకెక్కిస్తున్నాడు.

April 24, 2026 / 09:05 AM IST

OTTలోకి వచ్చేసిన ‘బ్యాండ్ మేళం’

‘కోర్ట్‌’ సినిమాతో హిట్‌ పెయిర్‌గా పేరుతెచ్చుకున్న హర్ష్‌ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన మూవీ ‘బ్యాండ్‌ మేళం’. మార్చిలో రిలీజైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఇది ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ‘జీ 5’లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇక బావమరదళ్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి సతీశ్‌ జివ్వాజీ దర్శకత్వం వహించాడు.

April 24, 2026 / 09:01 AM IST

విజయ్ ఆంటోని కొత్త ప్రాజెక్టుపై క్రేజీ న్యూస్..!

మల్టీ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోని కొత్త ప్రాజెక్టుపై తాజా అప్‌డేట్ వచ్చింది. దర్శకుడు ము.మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ తన తదుపరి చిత్రాన్ని ఓకే చేశాడట. ఈ చిత్రానికి తాత్కాలికంగా ‘అప్పా కుట్టి’ అనే టైటిల్ పెట్టారని తెలుస్తుండగా.. ఇది కూడా తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న బలమైన భావోద్వేగ బంధం చుట్టూ తిరుగుతుందని సమాచారం. త్వరలో ఈ మూవీపై అధికారిక ప్రకటన రానుంది.

April 24, 2026 / 08:36 AM IST

‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ డేట్ ఫిక్స్..!

దర్శకనటుడు తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘గాయపడ్డ సింహం’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్‌ ఫిక్స్ అయింది. ఏప్రిల్ 25, 2026న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 1, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

April 24, 2026 / 07:40 AM IST

‘వాలా-2’ రివ్యూ&రేటింగ్

నలుగురు ప్రాణ స్నేహితులు ‘లూజర్స్’ అనే ముద్రను చెరిపేసుకోవడానికి వారు విదేశాలకు చేసే ప్రయాణమే ఈ కథ. ఇక సినిమా విషయానికి వస్తే.. ప్రధాన పాత్రల్లో నటించిన హషీర్, అలన్, వినాయక్, అజిన్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్టూడెంట్ లైఫ్ కామెడీ ఈ సినిమాకు ప్రాణం. అక్కడక్కడా సాగదీత సీన్లు ఉన్నప్పటికీ.. ఎమోషనల్ ముగింపు గుండెను హత్తుకుంటుంది. ఓవరాల్ రేటింగ్: 3/5.

April 24, 2026 / 07:22 AM IST

నాకు టీనేజ్ కుర్రాళ్లు నచ్చరు: నటి

బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్.. ప్రముఖ నటి ప్రియాంక చోప్రాపై వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. ‘నా వెంట కూడా టీనేజ్ కుర్రాళ్లు పడుతుంటారు. కానీ ఆ వయస్సు కుర్రాళ్లు నాకు నచ్చరు. కుర్రాడిని బుట్టలో వేసుకొని పెళ్లి చేసుకోవడానికి నేనేమీ ప్రియాంకా చోప్రాని కాదు. అయితే.. ప్రియాంకా చోప్రా వయస్సు పెద్దగా కనిపించదు. ఆమె యువతిలా ఉంటుంది. అందుకే సమస్య లేదు’ అని పేర్కొంది.

April 24, 2026 / 07:06 AM IST

ఆ సమయంలో వెక్కి వెక్కి ఏడ్చాను: సాయి పల్లవి

హీరోయిన్ సాయిపల్లవి తన కేరీర్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ‘కెరీర్ ప్రారంభంలో ఒక సినిమా పూర్తయ్యాక మరో సినిమా చేసేదాన్ని. కానీ కోవిడ్ వల్ల ఒకేసారి మూడు సినిమాలు చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో పని చేసి చాలా అలసిపోయి.. ఒక్కరోజు అయినా హాలిడే వస్తే బాగుండేదని బాధపడుతూ వెక్కి వెక్కి ఏడ్చాను. కానీ, నావల్ల సినిమా ఎలాంటి ఇబ్బందుల్లో పడకూడదని షూటింగ్ పూర్తి చేశాను’ అని చెప్పింది.

April 23, 2026 / 10:11 PM IST

రాజకీయాల్లోకి ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన శింబు

భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా అన్న ప్రశ్నకు తమిళ హీరో శింబు తనదైన శైలిలో అదిరిపోయే సమాధానమిచ్చాడు. ‘నేను హ్యాపీగా ఉండటం మీకు ఇష్టం లేదా? ఇప్పుడిప్పుడే నా సమస్యలన్నీ తీరిపోయి, ప్రశాంతంగా సినిమాలు చేసుకుందామనే మూడ్‌లో ఉన్నాను. ఇలాంటి టైంలో రాజకీయాల పేరుతో ఆ సంతోషాన్ని చెడగొట్టేలా ఉన్నారు’ అంటూ చమత్కరించాడు. ప్రస్తుతం తన దృష్టి కేవలం నటనపైనే ఉందని శింబు చెప్పాడు.

April 23, 2026 / 05:50 PM IST

నితేష్ తివారీ ‘రామాయణ’పై క్రేజీ UPDATE

నితేష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా వస్తున్న ‘రామాయణ’ మూవీపై క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీ రావణుడిగా నటిస్తున్న యష్ పవర్‌ఫుల్ ఎంట్రీతో మొదలుకానుందట. తన సోదరుడు కుబేరుడితో యుద్ధం చేసి, స్వర్ణ లంకను, పుష్పక విమానాన్ని రావణుడు కైవసం చేసుకునే భారీ యాక్షన్ సీన్‌తో ఇది ప్రారంభమవుతుందని టాక్. ఈ హై-వోల్టేజ్ సీన్ సినిమాకే హైలెట్‌గా నిలవనుందట.

April 23, 2026 / 05:20 PM IST

మహేష్ ‘వారణాసి’ షూటింగ్ UPDATE

మహేష్ బాబు, రాజమౌళి కలయికలో వస్తున్న ‘వారణాసి’ మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. ఇప్పటికే మహేష్, ప్రియాంక చోప్రాలపై ఒక భారీ సాంగ్ షూట్ పూర్తయినట్లు సమాచారం. తదుపరి షెడ్యూల్ జూన్‌లో రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం కానుందట. ఈ గ్యాప్‌లో చిత్ర బృందం మెక్సికో Comic Con ఈవెంట్‌లో పాల్గొననుందట. భారీ అంచనాలున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

April 23, 2026 / 04:56 PM IST

నేను నోరు తెరిస్తే కాపురాలు కూలిపోతాయి: గీతా మాధురి

సింగర్ గీతా మాధురి తన కాఫీ షాప్ అనుభవాలపై ఆసక్తికర వ్యాఖ్యలు సహాసింది. ‘నేను అప్పుడప్పుడు కాఫీ షాప్‌కు వెళ్తుంటాను. చిత్రం ఏంటంటే, నేను వెళ్లిన రోజే ఎవరో ఒక సెలబ్రిటీ ప్రేమజంట అక్కడ నాకు దొరికిపోతుంటారు. అలా ఇప్పటికీ చాలా మంది నాకు చిక్కారు. వారి గురించి నేను నిజాలు బయటపెడితే ఎన్నో కాపురాలు కూలిపోతాయి’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

April 23, 2026 / 04:46 PM IST

బ్రేక్ తీసుకుంటోన్న స్టార్ డైరెక్టర్స్..!

కోలీవుడ్ డైరెక్టర్ల పరిస్థితి ఇప్పుడు భిన్నంగా ఉంది. మణిరత్నం, కార్తీక్ సుబ్బరాజ్ తమ తదుపరి మూవీ షూటింగ్ పనుల్లో బిజీగా ఉండగా, లోకేష్ కనగరాజ్ ఏకంగా హీరోగా మారుతున్నాడు. అయితే శంకర్ పరిస్థితి మరింత ఆసక్తికరం. వరుస ప్లాపులతో తదుపరి సినిమా ఆలస్యమవుతుండటంతో, ఆయన నటుడిగా మారబోతున్నట్లు సమాచారం. రజినీకాంత్ 173వ చిత్రంలో శంకర్ విలన్‌గా నటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

April 23, 2026 / 04:10 PM IST

OTTలో అదరగొడుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలో మిశ్రమ ఫలితాన్ని అందుకున్నప్పటికీ, OTTలో మాత్రం దుమ్ములేపుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ మూవీ గ్లోబల్ లెవల్లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. థియేటర్ల మ్యాజిక్ మిస్ అయినా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై పవన్ మేనియా గట్టిగా నడుస్తోంది. ఇక ఈ మూవీలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు.

April 23, 2026 / 03:42 PM IST

‘గవర్నర్’గా రాబోతున్న మనోజ్ బాజ్‌పాయ్

మనోజ్ బాజ్‌పాయ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘గవర్నర్: ద సైలెంట్ సేవియర్’ ఫస్ట్ లుక్ విడుదలైంది. చిన్మయ్ దీపక్ మాండ్లేకర్ దర్శకత్వంలో, విపుల్ అమృత్ లాల్ షా నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. అదా శర్మ, మధు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒక సామాన్యుడి అసాధారణ పోరాటంగా రానున్న ఈ చిత్రం, సమ్మర్ కానుకగా జూన్ 12న విడుదల కానుంది.

April 23, 2026 / 03:11 PM IST

‘అగధ’ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్

ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘అగధ’. ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం వరుసగా క్యారెక్టర్ పోస్టర్లను వదులుతోంది. ఇటీవల కామాక్షి భాస్కర్ల ‘మహాదేవి’ లుక్‌కు మంచి స్పందన రాగా, తాజాగా బాలీవుడ్ నటుడు శ్రవణ్ రెడ్డి పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన ‘సింహ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతు...

April 23, 2026 / 02:47 PM IST