కోలీవుడ్ యంగ్ హీరో అథర్వ మురళి, దర్శకుడు ఆకాష్ బాస్కరన్ కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఇధయం మురళి’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
యంగ్ బ్యూటీ రాశీ ఖన్నా నెటిజన్లకు, ముఖ్యంగా అమ్మాయిలకు ఒక మంచి సలహా ఇచ్చింది. ‘వేరొకరితో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం ఆపేయాలి. నా ఫిట్‌నెస్ ప్రయాణం మొదట్లో నేనూ కేవలం సన్నగా అవ్వాలనే అనుకున్నా. అది నేను చేసిన ఒక పెద్ద తప్పు. దయచేసి SMలో వచ్చే ట్రెండ్స్‌ను గుడ్డిగా ఫాలో అవకండి. సన్నగా మారడం కంటే మీ శరీరాన్ని బలంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి’ అని చెప్పింది.
రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ భారీ అంచనాలు పెంచగా.. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అయితే సినిమా విడుదలకు మరో వారం రోజులు ఉన్న నేపథ్యంలో మరో ట్రైలర్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
ఏపీ Dy.CM పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ సినీ నిర్మాతల భేటీ విజయవంతమైంది. వచ్చే వారం విడుదల కానున్న రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా థియేటర్ల కేటాయింపులు, ప్రత్యేక షోల ఇబ్బందుల నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం సానుకూలంగా ముగిసింది. మూవీ విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేవని, పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ తెలిపారు. దీంతో ‘పెద్ది’ మూవీ విడుదలకు లైన్ క్లియర్ అయింది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి చిత్రం ‘సూర్య-47’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ‘ఆవేశం’ ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. నజ్రియా హీరోయిన్‌గా, నస్లెన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి సుశిన్ శ్యామ్ సంగీతం అందిస్తుండగా.. ఈ మూవీలో ఊహించని సర్‌ప్రైజ్‌లు ఉంటాయని నస్లెన్ పేర్కొన్నాడు.
‘డాన్ 3’ మూవీ నుంచి వైదొలగడంతో హీరో రణ్‌వీర్ సింగ్‌పై ‘FWICE’ మూడేళ్లపాటు బ్యాన్ విధించినట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో FWICE చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ వివరణ ఇచ్చాడు. అది అధికారిక బ్యాన్ కాదని స్పష్టం చేశాడు. నటులపై నిషేధం విధించే అధికారం తమకు లేదని చెప్పాడు. సమస్యకు పరిష్కారం లభించే వరకూ ఆయనతో కలిసి పనిచేయొద్దని FWICE సభ్యులను ఆదేశించామని తెలిపాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ‘OG’ మూవీ సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం OTTలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. దీని శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ ఈటీవీ సొంతం చేసుకోగా.. త్వరలోనే టెలికాస్ట్ కానుంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక మోహన్, బాలీవుడ్ నటి ఇమ్రాన్ హష్మీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
తమిళనాడు సీఎం విజయ్ దళపతిని దర్శకుడు లోకేష్ కనగరాజ్ మర్యాదపూర్వకంగా కలిశాడు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కి అభినందనలు తెలియజేశాడు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోను లోకేష్ షేర్ చేస్తూ.. ‘తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ అన్న నీకు శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చాడు. ఇక వీరి కాంబోలో ‘మాస్టర్’, ‘లియో’ వంటి హిట్ మూవీలు వచ్చిన విషయం తెలిసిందే.
సౌత్ సినిమా టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు తమన్, అనిరుధ్‌ల కాంబోపై తాజాగా SMలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘నన్బా ఇక మొదలెడదామా’ అంటూ తమన్ షేర్ చేసిన ఈ పోస్ట్‌తో వీరిద్దరూ కలిసి ఒకే మూవీకి సంగీతం అందిస్తున్నారనే వార్తలు మొదలయ్యాయి. అయితే ఇద్దరూ కలిసి పని చేయడం లేదని, గతంలో లాగే తమన్ కంపోజ్ చేసిన ఓ మూవీ పాట కోసం అనిరుధ్ కేవలం గాత్రం మాత్రమే అందిస్తున్నట్లు టాక్.
నటి నివేదా థామస్ తమ్ముడు నిఖిల్ థామస్ ‘బెంగళూరు మహానగరంలో బాలక’ (BMB) చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమవుతున్నాడు. మహి–రాజ్ దర్శకత్వంలో, బెంగళూరులో ఓ ఆంధ్ర కుర్రాడు ఎదుర్కొనే సవాళ్ల నేపథ్యంలో ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. వరంగల్, హనుమకొండల్లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది.
నటి నివేదా థామస్ తమ్ముడు నిఖిల్ థామస్ ‘బెంగళూరు మహానగరంలో బాలక’ (BMB) చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమవుతున్నాడు. మహి–రాజ్ దర్శకత్వంలో, బెంగళూరులో ఓ ఆంధ్ర కుర్రాడు ఎదుర్కొనే సవాళ్ల నేపథ్యంలో ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. వరంగల్, హనుమకొండల్లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది.
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంలోని ‘వదలనే’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నటి శ్రీ గౌరి ప్రియ భావోద్వేగానికి లోనైంది. HYDలో జరిగిన ఈ వేడుకలో యాంకర్ స్రవంతి “ఈ పాటను ఎవరికి అంకితం చేస్తారు?” అని అడగ్గా.. గౌరి ప్రియ సమాధానం ఇస్తూ ఎమోషనల్ అయ్యింది. ‘మా అమ్మ నన్ను వదిలేసి మూడేళ్లయింది, కానీ తను నన్ను వదల్లేదు. ఈ పాట లైన్స్ మా అమ్మకే అంకితం’ అని చెప్పింది.
‘చాంద్ మేరా దిల్’ చిత్రంలో నటి అనన్య పాండే చేసిన భరతనాట్యం ప్రదర్శనపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. ఆమె డాన్స్ స్టెప్పులు సంప్రదాయ నాట్యశైలికి భిన్నంగా ఉన్నాయంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ సీన్ క్లిప్ వైరల్ అవ్వడంతో, హీరోయిన్‌తో పాటు దర్శకుడు వివేక్ సోని కూడా మీమ్స్, విమర్శలను ఎదుర్కొంటున్నారు.
దర్శకుడు ప్రశాంత్ నీల్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో సినిమా రాబోతున్నట్లు సోషల్ మీడియాలో భారీగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. KGF’, ‘సలార్’ మూవీలతో మాస్ పల్స్ పట్టుకున్న నీల్.. మహేష్ కోసం ఒక పవర్‌ఫుల్ యాక్షన్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు టాక్. ఒకవేళ వీరిద్దరి క్రేజీ కాంబో సెట్ అయితే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ వర్గాల్లో టాక్.
మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్‌పై సస్పెన్స్ ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. బాబీ, చిరు ‘మెగా 158’ మూవీ షూటింగ్ స్పీడందుకున్నా, అంతకంటే ముందే పూర్తయిన ఈ భారీ ఫాంటసీ మూవీ అప్‌డేట్స్ లేకపోవడం గమనార్హం. గతంలో సమ్మర్ రిలీజ్ అన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది కష్టమేనని తెలుస్తోంది. విడుదల ఆలస్యానికి గల కారణాలపై క్లారిటీ ఇస్తే ఫ్యాన్స్ ఊరట చెందుతారు.