తమిళ స్టార్ విజయ్ దళపతి ‘జన నాయగన్’ మూవీ వాయిదాపై హీరో శివకార్తికేయన్ స్పందించాడు. విజయ్ సినిమా వాయిదా పడుతుందని ఎవరూ ఊహించలేదని తెలిపాడు. ఒక పెద్ద సినిమా వాయిదా పడటం అనేది ట్రేడ్ పరంగా ప్రభావం పడుతుందని, సరైన సమయంలో రావడం మూవీ విజయానికి ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. అలాగే సినిమా విడుదల విషయంలో తాను ఎవరితోనూ పోటీపడాలని అనుకోవట్లేదని చెప్పాడు.
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ భార్య, నటి వితికా శేరు గుడ్ న్యూస్ చెప్పింది. తాను మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది. చాలా ఏళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె.. తన భర్త వరుణ్‌కు జోడీగా నటించబోతుంది. ఈ జంట ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న సినిమా ‘డియర్ ఆస్ట్రోనాట్’. ఈ చిత్రానికి కార్తీక్ భాగ్యరాజా దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘రాజాసాబ్’ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే రూ.112 కోట్లు వచ్చాయని ప్రకటించారు. కొన్ని మిశ్రమ కామెంట్స్ వచ్చినప్పటికీ సినిమా సంక్రాంతి బరిలో నిలిచి హిట్ కొట్టిందన్నాడు.
నటి ఐశ్వర్య రాజేష్, తిరువీర్ ప్రధాన పాత్రల్లో ‘ఓ సుకుమారి’ మూవీ తెరకెక్కుతోంది. ఇవాళ ఐశ్వర్య బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఆమెకు విషెస్ చెబుతూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక గ్రామీణ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీకి భరత్ దర్శన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో త్వరలోనే విడుదల కానుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తండ్రి, అల్లు అరవింద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. SM వేదికగా తన తండ్రితో కలిసి ఉన్న ఓ ఫొటోను పంచుకుంటూ.. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. నా జీవితంలో దేవుడికి అత్యంత దగ్గరైన రూపం మీరు. ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ చూసిన బన్నీ ఫ్యాన్స్ ఆయనకు విషెస్ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.
నటీనటులు శివాజీ, నవదీప్, రాహుల్ రామకృష్ణ, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘దండోరా’. ఈ సినిమా OTTలోకి వచ్చేస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో జనవరి 14న పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. దర్శకుడు మురళీ కాంత్ తెరకెక్కించిన ఈ సినిమా 2025 DECలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన మూవీ ‘నారీనారీ నడుమ మురారి’. ఈ సినిమా JAN 14న రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. జనవరి 11 ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆత్రేయపురం హై స్కూల్ గ్రౌండ్‌లో ఆ రోజు సాయంత్రం 5:30 గంటలకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఇవాళ మధ్యాహ్నం 12:34 గంటలకు టికెట్ బుకింగ్స్ ఓపెన్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డిస్ట్రిక్ట్ యాప్‌లో టికెట్స్ అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో నయనతార, వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు.
తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపుపై నిన్ననే హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే, కోర్టు అక్షింతలు వేసి 24 గంటలు కూడా గడవకముందే, చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. తమ ఆదేశాలను కాదని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై న్యాయస్థానం ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. జనవరి 11న రాత్రి 8 గంటల ప్రీమియర్ షో టికెట్ ధరను GSTతో కలిపి రూ.600గా నిర్ణయించింది. అలాగే, జనవరి 12 నుంచి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 50, మల్టీప్లెక్స్‌లలో రూ. 100 చొప్పున అదనంగా పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హర్రర్ కామెడీ థ్రిల్లర్ ‘రాజాసాబ్’ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. డిలీటెడ్ సన్నివేశాలను ఇవాళ లేదా రేపు ఈ మూవీలో యాడ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ వార్త విన్న రెబల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అలాగే, పెంచిన టికెట్ ధరలను కోర్టు రద్దు చేయడంతో గతంలో ఉన్న ధరలకే టికెట్లు లభించనున్నాయి.
IBOMMA రవిని అరెస్ట్ చేసి పైరసీని అంతం చేశామని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా విడుదలైన ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ HD ప్రింట్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో మరో సర్‌ప్రైజ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సింగర్ రమణ గోగుల పాడిన పాట నేరుగా థియేటర్లలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో నయనతార, వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు.
మహేష్ బాబు సోదరుడు రమేష్ తనయుడు జయకృష్ణ హీరోగా నటిస్తోన్న మూవీ ‘శ్రీనివాస మంగాపురం’. తాజాగా ఈ సినిమా నుంచి జయకృష్ణ ఫస్ట్ లుక్‌ను మహేష్ రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా మహేష్.. జయకృష్ణకు, మేకర్స్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. ఇక దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి రాషా తడాని కథానాయికగా నటిస్తుండగా.. GV ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.
కన్నడ స్టార్ యష్ హీరోగా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తోన్న మూవీ ‘టాక్సిక్’. ఇటీవల రిలీజైన ఈ మూవీ గ్లింప్స్‌లో ఇంటిమేట్ సీన్స్ ఎక్కువగా ఉండటంపై విమర్శలు వచ్చాయి. తాజాగా వాటిపై దర్శకురాలు స్పందించింది. ‘మహిళా దర్శకురాలు ఇలాంటి సీన్స్ తెరకెక్కించిందంటూ వస్తోన్న విమర్శలు చూసి చిల్ అవుతున్నా’ అని పేర్కొంది. ఆ సీన్స్‌లో బీట్రీజ్ బాఖ్ నటించిందని తెలిపింది.