కన్నడ స్టార్ యష్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమా టికెట్ ధరలపై బెంగళూరులో జోరుగా చర్చ సాగుతోంది. మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధర దాదాపు రూ.1200 వరకు ఉండవచ్చని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమా కావడంతో, క్రేజ్‌కు తగ్గట్టుగా ప్రీమియం స్క్రీన్లలో ఈ స్థాయిలో ధరలు ఉండే అవకాశం ఉందని టాక్.