బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ‘క్రిష్ 4’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. ఈ భారీ ప్రాజెక్ట్ను హృతిక్ స్వయంగా దర్శకత్వం వహించనున్నప్పటికీ, ఇది ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. దీనికంటే ముందు మరో భారీ చిత్రాన్ని పూర్తి చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడట. దీంతో సూపర్ హీరో సిరీస్ ‘క్రిష్ 4’ ప్రారంభం మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.