• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

ACB వలకు చిక్కిన ఎస్సై

AP: కడప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్‌లో ACB అధికారులు తనిఖీలు చేపట్టారు. ఓ కేసు విషయంలో ఎస్సై అనిల్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. టూవీలర్ కన్సల్టెన్సీ యజమానిని రూ.4 లక్షలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది. దీంతో ఎస్సై అనిల్‌తో పాటు సీఐ వెంటరమణను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. 

February 23, 2026 / 04:34 PM IST

విషాదాన్ని నింపిన ట్రైనీ టెకీల బీచ్‌ ఔటింగ్‌

చెన్నైలో జరిగిన బీచ్ ప్రమాదంలో ట్రైనీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రకు చెందిన గోల్డెన్ బీచ్ వద్ద సెల్ఫీలు తీసుకుంటుండగా ఒక్కసారిగా 15 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. దీంతో ముగ్గురు కొట్టుకుపోయారు. అయితే, వారిలో ఒకరు సురక్షితంగా బయటపడగా.. మరొకరు గల్లంతయ్యారు. తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి సహాయ చర్యలు చేపట్టినట్లు మహారాష్ట్ర సీఎంవో ప్రకటించింది.

February 23, 2026 / 04:20 PM IST

రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

TG: హైదరాబాద్ బంజారాహిల్స్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ర్యాపిడో బైక్‌ను వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హోంగార్డు సయ్యద్ హుస్సేన్, అక్షిత మృతి చెందారు. సంతోష్ నగర్ ట్రాఫిక్ హోంగార్డుగా సయ్యద్ పనిచేస్తున్నారు. ఉద్యోగం తర్వాత పార్ట్ టైంగా ర్యాపిడో డ్రైవర్‌గా చేస్తున్నారు. ర్యాపిడో కస్టమర్ అక్షిత కూడా ప్రాణాలు కోల్పోయింది.

February 23, 2026 / 03:07 PM IST

పెట్రోల్ దాడిలో గాయపడిన వ్యక్తి మృతి

KKD: తునిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్రీరామ థియేటర్ సెంటర్లో బుధవారం జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన సైకిల్ మెకానిక్ నానాజీ సోమవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బైక్ మెకానిక్, సైకిల్ మెకానిక్ మధ్య జరిగిన ఘర్షణ ఆగ్రహానికి లోనైన బైక్ మెకానిక్, నానాజీపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో ఇవాళ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

February 23, 2026 / 11:00 AM IST

రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

కోనసీమ: అయినవిల్లి మండలం ముక్తేశ్వరం తొగరపాయ వంతెన వద్ద సోమవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్ సైకిళ్ళు ఢీకొన్నాయి. ఈ విషయం తెలుసుకున్న అయినవిల్లి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో కొలపర్తి అచ్యుత లోకేశ్వరరావు, పి.శ్రీనివాసరావులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.

February 23, 2026 / 10:43 AM IST

తండ్రిని కత్తితో పొడిచి చంపిన కొడుకు

AP: కృష్ణా జిల్లా పామర్రు మండలం డీపీగూడెంలో దారుణం జరిగింది. తండ్రిని కొడుకు మహేష్ కత్తితో పొడిచి చంపాడు. వేడినీళ్ల విషయంలో తండ్రి మందలించాడని ఘాతుకానికి ఒడిగట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

February 23, 2026 / 09:59 AM IST

నార్పలలో బొలెరో టైర్ల చోరీ

ATP: నార్పలలోని సుల్తాన్‌పేట పెట్రోల్ బంకు వద్ద దొంగలు బరితెగించారు. వడ్డే మహేష్ అనే వ్యక్తికి చెందిన బొలెరో వాహనానికి ఉన్న రూ. 45 వేల విలువైన రెండు టైర్లను అపహరించారు. నాలుగు నెలల వ్యవధిలోనే రెండోసారి ఇలా జరగడంతో బాధితుడు కన్నీటిపర్యంతమయ్యాడు. పోలీసులు గస్తీ పెంచి నిందితులను పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

February 23, 2026 / 08:50 AM IST

గుంతకల్లులో వరుసగా నాలుగు ఇళ్లలో చోరీ

ATP: గుంతకల్లులోని మోదినాబాద్ ఏరియాలో గల రైల్వే క్వార్టర్స్‌లో ఆదివారం అర్ధరాత్రి వరుసగా నాలుగు ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువాలో ఉన్న నగదుతో పాటు నగలు ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పరిసర ప్రాంతాలతో పాటు సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

February 23, 2026 / 08:10 AM IST

కోడిపందేలపై దాడి.. ఆరుగురి అరెస్ట్

KKD: ప్రత్తిపాడు మండలం ధర్మవరం శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందేల స్థావరంపై ఎస్సై లక్ష్మీకాంతం ఆదివారం సాయంత్రం మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రెండు కోడిపుంజులు, రూ.2,550 నగదును స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

February 23, 2026 / 08:00 AM IST

కన్న కూతురిపై అత్యాచారం చేయించిన తల్లి

కూతురిపై తల్లే తన ప్రియుడితో అత్యాచారం చేయించింది. ఈ ఘటన చెన్నైలోని సాలిగ్రామంలో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న తల్లికి అది తప్పు అని చెప్పిన కూతురు.. ఆ తర్వాత మాట్లాడటం మానేసింది. అయితే బాలికకు జ్వరం రాగా.. మాత్రలని చెప్పి నిద్రమాత్రలిచ్చి తన ప్రియునితో అత్యాచారం చేయించింది. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. పోలీసులు తల్లిని, ప్రియుడిని అరెస్ట్ చేశారు.

February 23, 2026 / 07:48 AM IST

BREAKING: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం

TG: రాష్ట్రంలో వరుసగా బస్సు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం షాంపూర్ వద్ద బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. షాంపూర్ బ్రిడ్జి వద్ద బస్సు అదుపుతప్పి వాగులో పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉట్నూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 23, 2026 / 07:11 AM IST

కల్లూరు సమీపంలో రైలులో గొలుసు చోరీ

ATP: గార్లదిన్నె మండలంలోని కల్లూరు రైల్వేస్టేషన్ సమీపంలో ఆదివారం చైన్ స్నాచింగ్ జరిగింది. ధర్మవరానికి చెందిన శారద తన బంధువులతో కలిసి యాదగిరి వెళ్తుండగా బీదర్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు వేగం తగ్గడంతో గుర్తుతెలియని దొంగ.. ఆమె మెడలోని మూడు తులాల మంగళసూత్రాన్ని లాక్కెళ్లాడు. బాధితురాలు రైలు చైన్ లాగి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

February 23, 2026 / 06:50 AM IST

సినీ నటి తండ్రి దారుణ హత్య

వ్యాపారవేత్త, తమిళ నటి విష్ణుప్రియ తండ్రి సూర్యనారాయణన్ హత్యకు గురయ్యారు. TN దిండిగల్ జిల్లాలో నారాయణన్‌కు ఓ గెస్ట్ హౌస్ ఉండగా.. 2 రోజుల క్రితమే అందులో అద్దెకు చేరిన ఐదుగురు యువకులు ఆయనను చంపేసి భారీ మొత్తంలో నగదు, నగలతో పరారయ్యారు. CC TV ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా విష్ణుప్రియ తమిళ సినిమా ‘మాయావి(2005)’లో సూర్యతో కలిసి నటించింది.

February 23, 2026 / 12:40 AM IST

పేకాట స్థావరంపై దాడి.. పది మంది అరెస్ట్

ATP: తాడిపత్రి మండలం వెలమకూరు పొలాల్లో పేకాటాడుతున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ జగదీష్ ఆదేశాలతో సీఐ శివగంగాధర్ రెడ్డి నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. నిందితుల నుంచి రూ.72,980 నగదు, మూడు మోటార్ సైకిళ్లు, 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

February 22, 2026 / 08:30 PM IST

పెళ్లి రోజే విషాదం.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

రాజస్థాన్‌లోని జోధ్‌పుర్ జిల్లాలో విషాదం నెలకొంది. వివాహం జరగాల్సిన రోజే అక్కాచెల్లెళ్లు శోభ(25), విమల(23) విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబీకులు వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. బాబాయ్‌ల ఒత్తిడితో జరిగిన బలవంతపు పెళ్లి ఇష్టం లేకనే వారు మరణించినట్లు మేనమామ ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 22, 2026 / 05:44 PM IST