• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

రైస్ పుల్లింగ్ మోసగాడు డీకే బాబు అరెస్టు

సత్యసాయి: రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న రౌడీషీటర్ డీకే బాబును పోలీసులు అరెస్టు చేశారు. కదిరి DSP శివన్నారాయణ స్వామి ఆదివారం వివరాలు వెల్లడించారు. నిందితుడు బాధితుడి నుంచి రూ. 10 లక్షలు వసూలు చేయడమే కాకుండా, కత్తితో బెదిరించి అదనంగా నగదు, ప్రామిసరీ నోట్లు తీసుకున్నాడు. తనిఖీల్లో భాగంగా నిందితుడి నుంచి ఫార్చునర్ వాహనం స్వాధీనం చేసుకున్నారు.

February 22, 2026 / 05:20 PM IST

అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ గుట్టురట్టు

దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించారు. అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్‌పై దాడులు చేసి సుమారు 513 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో ట్రామాడోల్, నైట్రోజెప్, ఆల్ఫాజోలం వంటి నిషేధిత డ్రగ్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా నెట్‌వర్క్‌పై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.

February 22, 2026 / 04:32 PM IST

భారీ చోరీ.. 35 తులాల బంగారం అపహరణ

AP: YSR కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ చోరీ జరిగింది. తిమ్మయ్య కాలనీకి చెందిన బాలిరెడ్డి కుటుంబం పెనికలపాడులోని బంధువుల ఇంటికి వెళ్లగా ఇంట్లో నుంచి 35 తులాల బంగారం, 40 తులాల వెండిని దొంగలు అపహరించారు. తలుపులు తెరిచి ఉండటాన్ని స్థానికులు గమనించి ఇంటి యజమానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

February 22, 2026 / 04:28 PM IST

కాలువలో శవమై తేలిన బీజేపీ నేత

TG: జగిత్యాల జిల్లా సుద్ధపల్లిలో విషాదం చోటుచేసుకుంది. బీజేపీ నేత రమణ అనుమానాస్పద స్థితిలో కాలువలో శవమై తేలారు. గతంలో BRS పార్టీ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్‌గా పనిచేసిన ఆయన.. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ఆయనపై మూడు రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే, ప్రమాదమా లేక హత్యా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

February 22, 2026 / 01:41 PM IST

బాలకృష్ణ ఇంటి దగ్గర రోడ్డు ప్రమాదం

TG: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సినీ నటుడు బాలకృష్ణ ఇంటి దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అతివేగంగా వచ్చి పక్క రోడ్లోకి దూసుకెళ్లి కార్లు, బైకులను ఢీకొట్టింది. పలువురికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై వాహనాలు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 22, 2026 / 11:50 AM IST

నగల కోసం భార్య గొంతు కోసిన భర్త

TG: మెదక్ జిల్లా చేగుంట రైల్వే స్టేషన్ రోడ్డులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. త్రిమూర్తి అనే వ్యక్తి తన భార్య వరలక్ష్మి(36) గొంతుకోసి చంపాడు. నగల కోసమే భర్త ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న త్రిమూర్తి కోసం పోలీసు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

February 22, 2026 / 10:38 AM IST

BREAKING: ఐదుగురు పోలీసులు దుర్మరణం

ఒడిశా ఝార్సుగూడా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవే-44పై పోలీస్ సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న టిప్పర్ వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు సమాచారాన్ని అందించినట్లు ఎస్పీ రాఘవేంద్ర వెల్లడించారు.

February 22, 2026 / 09:30 AM IST

నీటి సంపులో పడి తొమ్మిదేళ్ల బాలిక మృతి

TG: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం తాళ్లపల్లిగూడలో విషాద ఘటన జరిగింది. తొమ్మిదేళ్ల బాలిక మిల్కీ ఆడుకుంటూ వెళ్లి నీట సంపులో పడి మృతిచెందింది. అడుకునేందుకు వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. ఇంటి పక్కనే ఉన్న నీటి సంపులో బాలిక మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 22, 2026 / 09:22 AM IST

దారుణం.. యువకుడిని సజీవదహనం చేశారు!

TG: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి, సజీవ దహనం చేశారు. మృతుడు టోలిచౌకి ప్రాంతానికి చెందిన అమీర్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

February 22, 2026 / 08:45 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భింద్ జిల్లాలోని హైవేపై ఓ వ్యాన్‌ను వేగంగా వచ్చి బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

February 22, 2026 / 07:42 AM IST

కదిలే బస్సులో భారీ చోరీ

AP: ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో భారీ చోరీ జరిగింది. శ్రీదేవి అనే మహిళ ప్రొద్దుటూరు నుంచి కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా దుండగులు ఆమె బ్యాగులో ఉన్న 15 తులాల బంగారాన్ని అపహరించారు. ​దీంతో బాధితురాలు కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును కమలాపురం పీఎస్‌కు తరలించారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు అనుమానితుల కోసం ఆరా తీస్తున్నారు.

February 22, 2026 / 02:58 AM IST

నాలుగేళ్ల చిన్నారిపై వృద్ధుడి అత్యాచారయత్నం

AP: తూ.గో.జిల్లా దేవరపల్లిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. నిందితుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు. నిందితుడు గోపాలపురం మండలం గోపవరానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

February 21, 2026 / 09:08 PM IST

విషాదం.. దంపతుల ఆత్మహత్య

AP: చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుప్పంలోని వేపూరులో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతో భార్య మల్లమ్మ(55) ఉరి వేసుకోవడంతో మనస్తాపం చెందిన భర్త రామప్ప(62) కూడా ఉరి వేసుకున్నాడు. భార్యాభర్తల మృతిత కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

February 21, 2026 / 07:07 PM IST

ఉగ్రకుట్ర.. భాగ్యనగరంలో హై అలర్ట్

TG: చంచల్‌గూడ జైలు ములాఖత్‌లో నగర విధ్వంసానికి ఉగ్రకుట్ర జరిగినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. లష్కరే తోయిబా ఉగ్రవాది జైలు నుంచే ఈ ప్లాన్ రచించినట్లు సమాచారం. దీంతో మూసారాంబాగ్, సైదాబాద్, మలక్‌పేట ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. ములాఖత్ సమయంలోనే దాడులపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఉగ్ర హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు నగరంలో హై అలర్ట్ ప్రకటించారు.

February 21, 2026 / 11:58 AM IST

ACB దాడులు.. ఇన్‌స్పెక్టర్ అరెస్ట్

AO: లంచం తీసుకుంటూ మరో అధికారి ACBకి చిక్కాడు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మెడికల్ షాప్ పెట్టుకునేందుకు అనుమతి అడిగిన వ్యక్తి నుంచి డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కంపా సురేష్ రూ.20 లంచం అడిగాడు. బాధితుడు ACBని ఆశ్రయించడంతో.. శుక్రవారం సురేష్‌ను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సురేష్, అలాగే అతనికి సహాయం చేసిన శివరామకృష్ణ అనే వ్యక్తినీ అరెస్ట్ చేశారు.

February 21, 2026 / 07:29 AM IST