TG: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి సమీపంలో పేషెంట్‌ను తీసుకెళ్తున్న అంబులెన్స్‌ను ఓ ప్రైవేట్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవర్‌తో పాటు పేషెంట్ అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.